Sunday, 3 January 2021

భయం - ఖలీల్ జిబ్రాన్

 సాగరం లో సంగమించే 

సమయంలో ,

భయం నిలువెల్లా 
ఆవహించగా ఒక నది
గజ గజ లాడిందట...

ఒక్క మారు వెనక్కి తిరిగి
పర్వత శిఖరాలలో  మొదలై,, సుదీర్ఘమైన
మలువులతో కూడి, అరణ్యాలను, గ్రామాలను
దాటుకుంటూ
తాను ప్రయాణించిన మార్గాన్ని,
వీక్షించిందట...

తన ముందట విశాలమైన
సముద్రాన్ని చూస్తుంది.
సముద్రంలో కలవడం అంటే
తన ఉనికిని
శాశ్వతంగా కోల్పోవడమే...
కానీ వేరు దారి లేదు
వెనుకకు మరలిపోలేదు

నదే కాదు ఎవరైనా సరే
ఉన్న స్థితి నుండి
వెనక్కిపోవడం అసంభవం,అసాధ్యం

నది ముందుకు సాగి
సాగరంలో కలిసే సాహసం చేయాల్సిందే,
ఎందుకంటే అలా అయితేనే,
తన భయం మాయమవుతుంది.
అంతేకాదు సముద్రంలో కలవడం ద్వారా,
తన ఉనికిని కోల్పోవడం కాదు
తానే సముద్రం గా మారుతున్నానని సత్యాన్ని 
ఆ నది తెలుసుకోగలుగుతుంది.
Khalil Gibran

No comments:

Post a Comment