Sunday, 8 July 2018

బహుముఖ ప్రజ్ఞలు -- పిల్లల ప్రతిభను గుర్తించి పదునుపెట్టడం ఎలా ?


బహుముఖ ప్రజ్ఞలు -  హార్వర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన హావర్డ్ గార్డ్నర్  ప్రతి పిల్లవారిలో ఎనిమిది రకాల బహుముఖ ప్రజ్ఞలు పుట్టుకతో అతి సహజంగా ఉంటాయని  ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్  అనే తన పరిశోధనాత్మక గ్రంధంలో వివరించాడు. వాటిని ఆటలతో పాటలతో, చిన్న  చిన్న ఆచరణ సాధ్యమైన కృత్యాలతో తల్లిదండ్రులు సాన పెట్టి  వారిని నిష్ణాతులు చేయాలని పేర్కొన్నాడు. పాటశాల అన్ని ప్రజ్ఞాసామర్ధ్యాలను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి. ఈ వేసవి సెలవలను వాటిని అభివృద్ధి చేయవచ్చునో నిపుణులు తెలియచేస్తున్నారు.
పిల్లలలో సహజంగా ఉండే ప్రజ్ఞా సామర్ధ్యాలు – అవి అభివృద్ధి చేసే చిన్న చిన్న కృత్యాలు:
1.     LINGUISTIC INTELLIGENCE : భాషా సామర్ధ్యాలు : ఈ వేసవి కాలంలో పిల్లలకు బాల సాహిత్యం, కథల పుస్తకాలు, దిన పత్రికలు చదవడం అలవాటు చేయండి.  క్విజ్ పుస్తకాలు కొని ఇచ్చి వాటి పై ఉన్న ప్రశ్నలు అప్పుడప్పుడూ అడగుతూ ఉండండి.
విహార యాత్రలకు తీసుకువెళ్తే వారి అనుభూతులను ఒక డైరీలో రాయమనండి.
పెద బాలశిక్ష. నీటి శతకాలు లోని కొన్ని పద్యాలను చదివి వాటి భావాలను రాయమనండి.
2.    MATHAMATICAL INTELLIGENCE: గణిత లేదా తార్కిక సామర్ధ్యం:  పజిల్స్  సాధించడం, వారితో కూర్చొని చదరంగం ఆడటం, సుడోకు, రూబెక్స్ క్యూబ్, అబాకస్ మొదలగునవి నేర్పించడానికి వేసవి సెలవలను మించిన అవకాశం ఉండదు. అయితే వీటిని వారు ఆనందించే విధంగా నేర్పించాలి. ప్రోత్సహించాలి.
3.    MUSICAL INTELLIGENCE: సంగీత సంబంధ సామర్ధ్యం:  పిల్లల ఆసక్తి బట్టి శాస్త్రీయ సంగీతం కాని ఫ్లూట్, తబలా, గిటార్ వంటి వాయిద్యాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటే వారిని ప్రోత్సహించండి. సినిమా పాటలు గాని, జానపద గీతాలు గాని పాడుతుంటే వారితో పాటు మీరు ఆనందించండి. వారు పాడిన పాటలను వీడియో రికార్డింగ్ చేసి యూ ట్యూబ్ లో మీ బంధువులు, స్నేహితులతో పంచుకోండి.
4.    VISUAL/SPATIAL INTELLIGENCE దృశ్య మరియు ప్రాదేశిక సామర్ధ్యం:  పిల్లలకు అట్లాస్. మేప్ లు కొని ఇచ్చి వివిధ ప్రదేశాలను గుర్తించమని చెప్పండి.  వారికి చిత్ర లేఖనం, క్లే మౌల్దింగ్ , గ్రాఫిక్ డిజైనింగ్ ఈ అంశాలలో శిక్షణ ఇవ్వం కాని లేదా వారు నేర్చుకోడానికి అవకాశం కల్పించండి. సైకిల్ , స్కూటీ వంటివి తొక్కడం మీ స్వీయ పర్యవేక్షణలో నేర్పించండి. పిల్లలు కళ్ళకు గంతలు కట్టి దాగుడుమూతలు ఆడుతారు. వాటివలన ఈ సామర్ధ్యం బాగా పెరగడానికి అవకాశం ఉంటుందని గ్రహించండి.  విశాఖ సముద్ర తీరం. కైలాసగిరి, అరకు మొదలగు ప్రాంతాలకు తీసుకువెళ్ళి వారితో పాటు మీరు ఆనందించండి.
5.    PHYSICAL INTELLIGENCE: శారీరక సామర్ధ్యం;  శరీరం, మనసు మధ్య సమతౌల్యం సాధించే ఈ సామర్ధ్యం పిల్లలు చలాకీగా , హుషారుగా ఉండటానికి దోహదపడుతుంది. వారికి నచ్చిన వచ్చిన ఆటలను ఆడుకోనివ్వండి. యోగా, కరాటే, క్రికెట్ మొదలగు వాటిని నేర్చుకోడానికి అనేక వేసవి శిబిరాలు  క్రీడా సాదికారతా సంస్థ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తే అందులో చేర్పించండి.
6.    INTERPERSONAL INTELLIGENCE సాంఘిక సంబంధాల సామర్ధ్యం:  బిజీ బిజీ బ్రతుకులతో ఎవరు ఎవరికీ ఏమవుతారో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు. మీ వంశ వృక్షం వారికి తెలియ చేసి వివిధ బంధువుల సంబంధాలను, వారి పేర్లతో ఒక చార్ట్ తయారు చేయించండి. వీలైనంత మంది బంధువులను కలవడానికి అవకాశం కల్పించండి.  స్నేహితులతో ఆడుకోనీయండి. ఫీల్డ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ మొదలగువాటికి వెళ్తామంటే ప్రోత్సహించండి. నలుగురితో ఎలా మెలగాలో వారు తెలుసుకునేందుకు ఈ వేసవి సెలవలను ఉపయోగించండి.
7.    INTRA-PERSONAL INTELLIGENCE: స్వీయ విశ్లేషణా సామర్ధ్యం;   ఈ వేసవి సెలవలను పిల్లలి తమను తాము తెలుసుకునేందుకు, చిన్న చిన్న సమస్యలకు క్రుంగి పోకుండా రాటుదేలేందుకు, మానసికంగా ధృఢ తరం అయ్యేందుకు ఈ వేసవి సెలవుల్ని ఉపయోగించండి. వారికి డైరీ రాయడం, వివిధ వ్యక్తుల ఆత్మ కథలను చదవడం అలవాటు చేయండి. వివిధ మానసిక ఉద్వేగాలు కలిగేతపుడు ఎలా ప్రవర్తించాలో ప్రేమతో వివరించండి. వారి వ్యక్తిత్వం లోని లోపాలను వారు బాధపడకుండా వారికి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియచేయండి. యూ ట్యూబ్ లో ఉండే వివిధ ప్రసంగాలను చూసే అవకాశం కల్పించి ఉత్తమ వ్యక్తిత్వం పొందేందుకు సహకరించండి. ఈనాడు వారు నిర్వహించే వ్యకిత్వ వికాస శిబిరాలకు పంపించండి.
8.    NATURAL INTELLIGENCE ప్రకృతి పరిశీలనా సామర్ధ్యం : పర్యావరణ స్పృహ, అవగాహన కలిగేందుకు అవకాశాలు కల్పించండి. ఇంటి పెరడు లో అవకాశం ఉంటే వివిధ మొక్కలు వారిచే ఈ సెలవుల్లో పెంచండి. పెరడు లేనివారు బాల్కనీ లో  టెర్రస్ పై  కుండీలలో వివిధ మొక్కలు పెంచడం, రోజూ వాటిని పరిశీలన చేయడం అలవాటు చేయండి.  చిన్న చిన్న శారీరక రుగ్మతలకు ఇంట్లో లబించే జీలకర్ర, వాము, శోంటి, అల్లం, తులసి ఎలా ఉపయోగపడతాయో నేర్పించండి.  వీలైనన్ని  ప్రదేశాలను చూసేందుకు అవకాశం కల్పించండి. దగ్గరలో ఉన్న పార్క్ లను, ఉద్యానవనాలను, సింహాచలం, పద్మనాభం, అన్నవరం, దేవీపురం, గుడిలోవ, కంబాలకొండ, తోటల కొండ మొదలగు ప్రదేశాలకు తీసుకువెళ్ళండి.

పిల్లలలో ఉండే ఏ రెండు సామర్ధ్యాలైన సరిగా పెంపొందిస్తే వారు ఏంటో ప్రయోజకులవుతారని గార్డ్నర్ చెబుతారు, స్కూల్ నందు కేవలం భాషా సామర్ధ్యం, గణిత సామర్ధ్యానికి మాత్రమె ఈ రోజుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరి ఈ వేసవి సెలవుల్ని వినోదంతో పాటు విజ్ఞాన దాయకం ఉపయోగించుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలను బహుముఖ ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్ది వారికి ఉత్తమ భవిష్యత్తు కానికగా ఇవ్వండి.
                         విష్ యు ఆల్ ది బెస్ట్
                         అలజంగి ఉదయ కుమార్ 

No comments:

Post a Comment