Thursday 25 December 2014

యువతకు దశా దిశా నిర్దేశం.. సిరివెన్నెల గారి "ముకుంద" చిత్ర గీతం.


సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
నేటి తెలుగు చలన చిత్ర సీమ నోచుకున్న నోముల ఫలం....  ఆయన కలం సాగించిన కృషీ ఫలం  ఆస్వాదించగలిగిన ఆసక్తి ఉంటే  ,  అవలంబించగలిగిన  అనురక్తి ఉంటే   ప్రతి ఒక్కరి జీవితం  సాఫల్యమయం..  ముకుంద సినిమా కోసం ఆయన గీతాలలో    " చేసేదేదో "  అనే గీతం  నేటి  యువతకు కావాల్సిన దశా దిశా నిర్దేశాన్ని చూపించి  చైతన్య వంతులుగా తీర్చి దిద్దుతుంది.  ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణలో ఉన్న మెలుకువ పాఠాలను  ఒక్క పాటలో  సూటిగా, స్పష్టంగా   చెప్పారు సిరివెన్నెల గారు......

ఈ రోజుల్లో  నేటి యువత కు  సరియైన గమ్యం లేదు  లక్ష్యమ్ లేదు   చెడు దారుల్లో వెళ్తుంది.. సమయాన్ని వృథా చేస్తుంది అంటూ  వారిని  ఎందుకు కొరగాని వారిగా, చేతకాని దద్దమ్మల్లా  చూడటం , దూషించటం   చాలా మందికి ఒక ఫాషన్ అయింది. అలా  అందరిలా సోది కబుర్లు చెప్పకుండా  వారికి అర్థమయ్యే రీతిలో,  వారికి ఉత్తేజం కలిగించే రీతిలో  సిరివెన్నెల గారు తన కలాన్ని  సుతిమెత్తగా ఉపయోగించి  వారి సామర్థ్యాల్ని వారికి అర్థమయ్యే రీతిలో కర్తవ్యబోధన చేసారు.   ఇది ముకుంద సినిమాలో హీరో  పాత్ర ని వ్యక్తిత్వాన్ని తెలియచేసేందుకు రాసినా   ప్రతి యువకునికి , జీవితాన్ని ఉపయుక్త కరంగా జీవించాలనుకునే  ప్రతి వ్యక్తికీ  ఒక గీతా బోధనలా ఉంటుంది....

ఇక పాట లోనికి వెళ్తే ....
                     వాగార్థవ  సంప్రక్తౌ వాగార్థ ప్రతిపత్తయే 
                     జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వర:
వాక్కు  మరియు  దాని యొక్క అర్థం రెండు  ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లా   విడదీయని బంధాన్ని కలిగి ఉంటాయి.   అర్థం లేని వాక్కు  అర్థ రహితం ..  ఈ  భావనతో   ఈ  పాటను   సిరివెన్నెల గారు రాయడం జరిగింది
నేటి యువత ఏమి చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఆలోచిస్తే   ఇంటర్ నెట్ బ్రౌజింగ్,  ఫేస్ బుక్, వాట్స్ ఆప్,  హైక్, ట్విట్టర్ , వైబర్,  రబ్బర్ బంతి  బెట్టింగ్  క్రికెట్ ,  రోడ్డు మూలన మిత్రులతో చిట్ చాట్ లు..   పనికి మాలిన మరియు ప్రమాద కరమైన బైక్ రేస్ లు అమ్మాయిలతో ఫాలోయింగ్.... ఇలా ఈ  లిస్టు కు  అంతం  ఉండదు.   ఇవి చెయ్యొద్దు అని చెప్పడం లేదు అలా అని  చెయ్యమని చెప్పడం లేదు.  ఇవి నీ జీవితానికి   ఎంత వరకు ఉపయోగపడతాయో ఆలోచించుకో మని   చెపుతున్నారు...


పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా

అర్థం ఉన్న  ఓ

పదం కానిదే అర్థం ఉండునా

నీది అయినది నిర్వచనం  ఇచ్చుకో

జీవితానికి ఏం  చేసినా

            అర్థవంతమైన అక్షరాల కలయిక పదం ఎలా అవుతుందో  అర్థవంతమైన పనుల కలయికే జీవితం.  ఇది నీ జీవితం,  నీ జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నావు..  జీవితానికి  నీవు ఇచ్చే నిర్వచనం  ఏమిటి?   ఎవరి జీవితాన్ని  గుడ్డి గా అనుకరించకు ..  నీ ముద్ర ఉండాలి, నీ స్వంత   అర్థం ఉండాలి.. దానికి  తగ్గట్టుగా దానికి జత అయ్యేటట్టు గా   నీవు చేసే  ప్రతి  పని ఉండాలి.   నీ జీవితానికి  నీవు ఇచ్చే  నిర్వచనానికి  తగ్గట్టుగా  ఉన్న పనులే చేయి..  అంతే  కాని  అందుకు విరుద్ధమైన పనులు చేయకు..........

పల్లవి:

చేసే దేదో చేసే ముందే
ఆలోచిస్తే   తప్పుందా?

తోచిందేదో చేసేస్తుంటే
తొందరపాటే కాదా?


ఆచి తూచి అడుగేయ్యోద్దా ...

         నీ  లక్ష్యానికి తగ్గట్టుగా నీవు చేసే ప్రతీ పని ఆలోచించి  ఎటువంటి   తొందరపాటు లేకుండా చెయ్ .. ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా  ఏ  స్నేహితులు ఎన్ని  రకాలుగా ఆకర్షింప చేసినా   ఏ వ్యామోహం  లో  పడకుండా  నీవు చేయబోయే పని నీ జీవితానికి ఉపయోగపడుతుందా  లేదా అని  ఆచి తూచి  నీకు   నీవే ప్రశ్నించుకొని  చెయ్.  ఒక్క తొందరపాటు  పని వలన జీవితసౌదం కూలిపోయే అవకాశం ఉంటుంది  కాబట్టి  ప్రతీ పని ఆలోచించి చేయడం ఏ  మాత్రం తప్పు కాదు.   Haste  Brings  Waste.....

చరణం : 1

ఈతే తెలియాలి నది ఎదురైతే

పూర్తయి తీరాలి  కథ మొదలెడితే

గెలుపే పొందాలి తగువు కి  దిగితే

పడినా లేవాలి

ఏ పూటైనా   ఏ చోటైనా

విడవని పయనం సాగాలి

రాళ్ళే ఉన్నా  ముళ్ళే ఉన్నా

దారేదయినా గాని

కోరే  గమ్యం  చూపించాలి 

          నీవు అన్ని రకాలుగా నిర్ణయించుకొని నీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి.  నదిలో దిగేముందే ఈత వచ్చో రాదో చూసుకోవాలి.  మన బలాలు బలహీనతలు  పూర్తిగా అర్థం చేసుకోవాలి.... ఆ లక్ష్యాన్ని పొందే మార్గం లో    ఎన్ని ముళ్ళు ఉన్నా,  రాళ్ళు  ఉన్నా ,ఎలాంటి దారి అయినా పట్టు వదలకుండా , రేయనక, పగలనక  నీవు  కోరి ఎంచుకున్న గమ్యాన్ని చేర్చే మార్గం లో    చివరి వరకు  నడవాలి.    చాలా మంది విద్యార్థులకు   I.A. S.  లేదా   I.P.S.  లేదా  సాఫ్ట్ వేర్ లొ లక్షలు  సంపాదించే  ఉద్యోగం   ఇలా చాలా కోరికలుంటాయి.   కోరికలు ఉండటం  తప్పు కాదు  .  వాటిని సాధించగల   సామర్థ్యం ఉందా లేదా  ఒక వేళ  లేకపోతె వాటిని ఎలా సంపాదిచాలి.  ఇంగ్లీషు లో  నాలుగు మాటలు  తడబడకుండా  మాట్లాడ గలమా?    ఉద్యోగాన్ని సంపాదించే నైపుణ్యాలు ఉన్నాయా ?  ఒకవేళ లేకపోతే     వాటిని    విడవకుండా రేయనక పగలనక  శ్రమించి   సంపాదించగలమా....  అనేక ఇంగ్లీష్   లేదా జాబ్ ఓరియంటెడ్  నైపుణ్యాలు నేర్పించే సంస్థల్లో ప్రవేశం పొందే  విద్యార్థులు  సగం మందికి  పైగా   వారం రోజులు తరువాత మరి కనబడరు.   జిమ్  లొ జాయిన్  అయిన వారు  నెల తరువాత అటువైపు  మొహం చూపరు.....  ఎన్ని కష్టాలున్నా   రాళ్ళు ఉన్నా  ముళ్ళు ఉన్నా   లక్ష్యసాధనా మార్గం లొ చివరి వరకు సాగమని సిరివెన్నెల గారు  ఈ చరణం లో  ఉద్బోధించారు. 

చరణం : 2

స్పష్టంగా పోల్చుకో

శక్తుందా  తేల్చుకో

అతి సుళువుగా అయ్యే పనా  ఏం అనుకున్నా ,,ఓహో..

కష్టాలే ఓర్చుకో ఇష్టంగా మార్చుకో

అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా..ఓహో ..

కలలకి కళ్ళకి   మధ్యన కనురెప్పే అడ్డని

నమ్మకం నిజమయ్యే లోపుగా 

తప్పని నొప్పి ఉండని

ఆకలే వేటగా మార్చటం కాలం అలవాటని

గమనించే తెలివుంటే

ప్రళయాన్ని ప్రణయం  అనవా   

        ఈ   చరణం వచ్చే సరికి    లక్ష్యసాధన లో  ఉండే  కష్టాలని   వాటిని  ఎలా ఓర్చుకోవచ్చో వివరించారు.....
నీ లక్ష్యమ్ ఏర్పరుచుకున్నావు   బాగానే ఉంది.   దానిని సాధించగల  శక్తులు నీకున్నాయా?   ఇంతకు  ముందు ఆ లక్ష్యాన్ని సాధించిన వారి శక్తులతో నీ శక్తులను ఒకసారి పోల్చుకో.    స్పష్టంగా  నీ లక్ష్యమ్  నీకుందో లేదో మరొకసారి చూసుకో .. ఎందుకంటే   ఇది అతి సులువుగా అనుకునే పని కాదు...  కలలు  వేరు,   కళ్ళ  ముందు ఉన్న వాస్తవాలు వేరు.   వాస్తవాలు అనేక కష్టాలతో కూడి ఉంటాయి   అయితే వాటిని ఇష్టంగా  మార్చుకున్నావా   ఏ మాత్రం కష్టం కలిగించవు.     గెలుపు అందినట్టే అంది  ప్రతి మలుపులో ఒక దెబ్బ కొట్టి పడగొడుతుంది..  తప్పించుకోలేని అనేక నొప్పుల్ని,  బాధల్ని తెచ్చిపడుతుంది.  సచిన్ టెండూల్కర్  సాధించిన విజయాలు ఊరికే రాలేదు   నిద్రాహారాలు మాని , అవమానాలు అపజయాలు తట్టుకొని  సాగించిన శ్రమ వలన వచ్చాయి.  You Must Be  Hungry  అంటాడు  Les   Brown..   ఎప్పుడైతే  విజయం పట్ల  ఆకలి పుడుతుందో   అది వేటాడే పులిలా  నిన్ను  తయారు చేస్తుంది.  అది తెలుసుకొని గుర్తించి తెలివి నీకుంటే  ప్రళయాల్ని కూడా  ప్రేమించగలగుతావు.  పనిని  లక్ష్యాన్ని ప్రేమించేవాడికి  విజయం బానిసగా నిలుస్తుంది.   

చరణం: 3

శ్రీ రాముని బాణమై
సాధించిన శౌర్యమే
చేధించదా నీ  లక్ష్యము
యముడు ఎదురైనా

కృష్ణుని సారధ్యమే
సాగిన సామర్ధ్యమే
సాధించదా ఘన విజయం
ప్రతి సమరాన ..ఓహో..

కయ్యమో నెయ్యమో  చెయ్యకు కాలక్షేపానికి
గాలిలో కత్తులే దుయ్యకు శతృవు లేనిదానికి
ఊహతో  నిచ్చెనే వెయ్యకు  అందని గగనానికి

వ్యర్థంగా  వదిలేస్తే
వందేళ్ళు ఎందుకు మనకి 

       ఈ  చరణం లో   విజయ సాధన  లక్ష్య సాధనలో  సాగించాల్సిన  వ్యూహాల గురించి,  చెంత ఉండాల్సిన ఆయుధాల గురించి,  చేపట్టాల్సిన   విధానాల గురించి యువతకు అవగాహన కలిగిస్తున్నారు సిరివెన్నెల గారు...    లక్ష్యసాధన   ప్రాణం కోల్పోయేనంత  ప్రమాదం  ఎదురైనా గురి తప్పని రామబాణం లాంటి  శౌర్యం కలిగి ఉండాలి.  అన్ని  అనర్థాలకు   మూల కారణం  పిరికితనమే.  ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి   ఎన్నడూ ఒదులుకోవద్దురా ఓరిమి   అన్నట్టు  రామబాణం లాంటి గురి కలిగిన    ధైర్యాన్ని ఆయుధం గా కలిగి ఉండాలంటారు ... కురుక్షేత్ర యుద్ధం లొ   శ్రీకృష్ణుడు  ఎలా వ్యూహ రచన చేసాడో  ఎలాంటి  నాయకత్వ లక్షణాలు  ప్రదర్శించాడో  అలాంటి  నాయకత్వ సామర్థ్యాన్ని  కలిగి ఉండాలంటారు. సమర్థవంత సామర్థ్యం ఉంటే   ఎలాంటి సమరం లోనైనా  ఘన విజయం సాధించగలరు.    కాలక్షేపమ్ కోసం ఊసుపోని కబుర్ల కోసం  స్నేహం చేయకు.  పనికి మాలిన అడ్డగాడిదలతో తిరిగే బదులు  లైబ్రరీ కెళ్ళి  మంచి పుస్తకాలు చదువుకో .. కనబడే ప్రతీ వీధి కుక్క తో దొమ్మీ లకు దిగకు.  కయ్యానికైనా నెయ్యానికైనా  సరి జోడు కాదు .....  సరియైన కారణం ఉండాలి. .... చేతిలో ఆయుదం ఉంది కదా... అని మెదడులో తెలివి ఉంది కదా  అని   లేని శతృవులను   సృష్టించుకొని   యుద్ధాలు చెయ్యకు.   ఊహలలో  గాల్లో మేడలు మిద్దెలు కట్టకుండా వాస్తవిక దృక్పధాన్ని  కలిగి ఉండు.  కాకిలా కలకాలం బ్రతకాల్సినవసరం లేదు.  ఎవరికీ చివరికి నీకు నీవు  కూడా ఉపయోగపడకుండా వందేళ్ళు బ్రతకడం వలన ఉపయోగం  ఉందా...  భగత్ సింగ్  ఎన్నేళ్ళు బ్రతికాడు, స్వామి వివేకానంద ఎన్నేళ్ళు బ్రతికాడు.  రాశి కాదు  వాసి  కావాలి...


పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా
అర్థం ఉన్న  ఓ
పదం కానిదే అర్థం ఉండునా

నీది అయినది నిర్వచనం  ఇచ్చుకో
జీవితానికి ఏం  చేసినా

      అర్థం లేని పనుల కలయిక కాదు జీవితం అంటే...... అర్థవంతమైన   లక్ష్యభరితమైన  ఉపయోగపూరితమైన కార్యక్రమాల మేలుకలయికే   జీవితం.    విధాత నీవే    విజేత   నీవే....

              బాణాల్లాంటి   మాటలతో  సుతి మెత్తగా   యువత ఉద్బోధ కలిగించే ఈ గీతం   యువతకు ఎలా దశా దిశా నిర్దేశం చెబుతుందో వేరేగా చెప్పక్కర్లేదు.   '' అర్థరాత్రి ఉదయించే సూర్యుడు   సిరివెన్నెల'' అని  త్రివిక్రమ్  గారు ఊరికే చెప్పలేదు..    సిరివెన్నెలగారి కలానికి   ఆయన మేథస్సుకు   యువత పట్ల  ఈ జాతి భవిష్యత్  పట్ల ఆయనకున్న నిబద్ధతకు శిరస్సు వంచి పాదాభివందనాలు  తెలియచేసుకుంటూ.....

                                          ...............   అలజంగి ఉదయ కుమార్
                                                    trainerudaykuaar@gmail.com










Saturday 20 December 2014

PK.. the film... FIND YOUR OWN WAY TO HOME LAND



Who said that watching movies is waste of time and movies are tools of entertainment? 

Who said that  you need not question the existing system and blind beliefs? 

Who said that movies are spoiling the system and society?

          You need not  answer the above questions.. Just go and watch  PK.....  The stuff of the movie may be  already dealt in many movies  including recent Oh My God.....  If  it  is  the  case .. almost all romantic or love based  movies have similar  stuff  ... but  the way the director crafted the scree play and penned thought provoking dialogues make all the differences..

    The director knows  that he is handling the most sensitive subject and questioning the age old customs and beliefs and also bulls eye hitting of many  mass accepted religious  gurus..   Rajkuar  Hirani has chosen comedy as the cream of the cake  but  strong satirical , deep pinching   and thought provoking stuff as the bottom line.

     We are living in the Age of Reasoning and our education has to teach us to question everything and everything must be questioned. But unfortunately we become dumb when it comes to religion and God.  What is the purpose of Religion. It has to guide us to find the god within. Religion is a way of finding god within. It is rightly said Spirituality starts where Religion Ends......
     Everyone has to reach his home where he comes from...  Reaching the ultimate goal by finding the soul within is the end of the religion. Even in Kathopanishad the same essence is explained.
Raj kumar Hirani created a role for Aamir Khan as an alien who has to find the way to return to his  Home Planet.  The spirituality also says one has to find the real way of reaching his super soul where from he comes.  The middle men or God men who interprets the existence of god  either create fear  or desire  in people and encash it for their survival or dominance.
     Every Logic question asked by PK initially make the audience to laugh but ultimately makes everyone to think deep. Rajkumar Hirani knitted the character of Aamir Khan as an innocent, even with slang of Bhojpuri Hindi so that the questions that are risen against religion and existing trends may be taken as the questions of innocent person.
     Only three characters get sufficient scope to expose their potential Aamir, Anuskha Sharma and the God man Sourabh Shukla and remaining characters nothing to do much with their talent but supported the main plot of the film
   Aamir Khan proves once again why he is labelled  as Mr. Perfect. He is a versatile and incomparable to any Khans or Kapoors. You will definitely feel jealous of Kohli after watching this glamorous doll with apt action in this movies. The song sung by Sonu Nigam touches the strings of heart.
    Stop reading all these reviews of individual perceptions and enjoy the movie  start YOUR OWN journey of FINDING THE WAY TO REACH YOUR ORIGINAL HOME LAND  .....

trainerudaykumar@gmail.com
www.traineruday.com
         

Sunday 2 November 2014

ఆత్మ బంధువు....ఆత్మీయత సింధువు


ఏ కథ అర్థాంతరంగా ముగియదు 
అర్థ రహితంగా మిగలదు 
అహంకారంతో మొదలెట్టామా 
అవమానాలతో అంతమవుతుంది 
అత్యాశాలతో అడుగుపెట్టామా 
అడియాశలతో అంతరిస్తుంది 
అనుమానాలతో అడుగు అడుగు చూసుకుంటూ 
అనుక్షణం భయపడుతూ 
ముందుకు సాగామా 
అపార్థాలతో శాపనార్థాలతో సెలవుతీసుకుంటుంది
ఎవరు ఎవరి జీవితంలో అడుగుపెట్టినా 
ఎవరు ఈ యవనిక నుండి నిష్క్రమించినా 
నిక్కచ్చైన  హేతువేదో ఉండే ఉంటుంది.
నిబద్ధత నీలో  నిలువెల్లా  ఉన్నప్పుడు
నిస్వార్థం, నిష్కపటం నీ వెంట నీడలై నడిచేటపుడు 
సహనం, సంస్కారం పెట్టని కోటలై ఉన్నపుడు 
ఏ బంధం నిన్ను బందీని చేయలేదు 
ఏ రాగం నీతో పెడ రాగాలు పెట్టించలేదు 
నిన్ను ఒంటరిని చేసి వ్యాకులత కలిగించలేదు 
ఏ  స్నేహం నీ సున్నితత్వాన్ని గాయపరచలేదు 
ఆత్మీయతను పంచుకునేవారు ఆత్మబంధువులై  నిలుస్తారు 
అంతుబట్టని ఎజెండా తో కలిసినవారు రాబందువులై పీడిస్తారు 

trainerudaykumar@gmail.com 
    

Thursday 2 October 2014

భవిష్యత్ భారతావని


నిజమే
అవినీతిపరుల్ని ఏకి పారేద్దాం
పీకి పాతరేద్దాం
ఉతికి ఆరేద్దాం
కాని ఎప్పుడు?
హెల్మెట్‌ పెట్టుకొని బండి నడపగలిగితేనే,
చుట్టూ ఎంత స్థలం వదలాలో అంత వదిలి
నియమాల ప్రకారం ఇళ్ళు కట్టుకోగలిగితేనే,
సెల్‌లో మాట్లాడుతూ బండి నడపకుండా ఉండగలిగితేనే,
సీట్‌ బెల్ట్‌ పెట్టుకొని డ్రైవ్‌ చేయగలిగితేనే,
ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్స్‌ లేకుండా
నిఖార్సైన ఒరిజనల్‌ పత్రాలతో
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందగలిగితేనే,
టాక్స్‌ కన్సల్టెంట్‌ చాకచక్యాల సహాయం తీసుకోకుండా
నిక్కచ్చిగా టాక్స్‌ మినహాయింపులు లేకుండా కట్టగలిగితేనే
మీటర్ రీడింగ్ మతలబుల కోసం
చేతికి తడి అంటించకుండా కరెంట్ చార్జీలు కట్టగలిగితేనే
ఫుట్ పాత మీదా, జీబ్రా గీతల మీదే నడవగలిగితేనే,
నూటికి నూరుమంది ఓటుహక్కు వినియోగించుకుంటేనే
విశ్వవిద్యాలయాల్లో కులగజ్జికి జాలీమ్‌ లోషన్‌తో
స్నానం చేయించగలిగితేనే,
ఏ గైడ్‌ కి చంగాగిరీ చేయకుండా, కాపీ కానటువంటి
ఒరిజినల్‌ పరిశోధనా పత్రాలు నివేదించగలిగితేనే,
కస్టమ్స్‌ కళ్ళు కప్పి కనీసం కారప్పోడి కూడా
తీసుకెళ్ళకుంటేనే,
తీసుకునే జీతంలో ప్రతీ పైసా కి న్యాయం చేయగలిగితేనే,
తప్పుడు సమాచారంతో తెల్ల కార్డులు తీసుకోకపోతేనే,
వాస్తవాదాయం తగ్గించి ప్రభుత్వ స్కాలర్‌ షిప్‌
పొందకపోతేనే,
తనిఖీకి వచ్చిన పాస్‌ పోర్ట్‌ ఉద్యోగికి చిల్లర
సమర్పించకపోతేనే,
ఇవన్నీ చదువుతున్నప్పుడు భుజాలు తడుముకోకపోతేనే,
నిజంగా అవినీతిని పాతరేద్దాం
దుమ్ము దులిపేద్దాం
గురివిందవైఖరికి సలాం కొట్టి
ఆత్మ పరిశుద్దం గావించుకొని
అన్న హజరే ఫోటో పట్టుకొని పవిత్ర నినాదాలు
మనమూ చేద్దాం
అంతర్గత అవినీతికి మంగళం పలికి
నిక్కమైన నీతి పునాదులమీద
భవిష్యత్‌ భారతావనిని నిర్మిద్దాం
భావితరాలను సగర్వంగా జీవించే
సువర్ణావకాశం కల్పిద్దాం...

Sunday 28 September 2014

వ్యక్తిత్వ వికాస ప్రసంగం

ప్రేరణ  వ్యక్తిత్వ వికాస  ప్రసంగం.  ఈ లింక్ లొ చూడండి


https://www.youtube.com/watch?v=h3ngaMeqwuo&list=UUmQU3OZpDOO5jx8mvG5CPLQ

Friday 26 September 2014

ఆడవారి అందం


కవిత్వం రాస్తావట కదా
ఏదీ ఆడవారి అందం గురించి రాయి
ఆ ఒంపుసోపుల ఒయ్యారాల్నీ
ఆ నెరజాణతనాన్ని, నెమలి నడకల్ని
రసికత ఓలలాడే కొంటె చూపుల్ని
శివధనుస్సులా  ఒంగి ఉన్న కనుబొమ్మల్ని
పాలరాతి శిల్పం లా చెక్కి ఉన్న నునుపైన చెక్కిలిని
హంస గమనాన్ని, రాయంచ ఠీవిని
రాజుల్ని రారాజుల్ని పాదదాసులుగా చేయగలిగే
లేలేత వయసు పొంగులను 
మన భాష లొ తగిన పదాలు చాలక పొతే
పరభాషా పదాలు వెతికి తెచ్చి మరీ వర్ణించు
శోధించైనా ,  శ్రమించైనా కాస్త కాలం ఎక్కువ తీసుకునైనా
నీ కలానికి కొత్త కసరత్తులు నేర్పించైనా
కవితా పరంపరులు సాగించు
నవకవితా పరిమళాల సౌరభాలతో
ఈ సురబాలల సరస సల్లాపాలను విశ్లేషించు .......
ఎప్పుడు ఎదుగుతారురా ఓ మూర్ఖుల్లారా !
ఆడవారి అందం వారి శరీరాకృతి లొ,ఒంపుసొంపుల్లో  ఒయ్యారాల్లో కాదురా
అమ్మతనం నిండిన ప్రతి అణువులో ఉందిరా
ఆప్యాయతలో, ఆదరణలో, అర్ధం చేసుకునే ఆర్ద్రత నిండిన
ఆ హృదయం లొ  ఉందిరా
వేయి తప్పుల్ని కూడా క్షమించే ఆ ధరాగుణంలో ఉందిరా
జీవితంలో ఎదురయ్యే ఆతంకాలకి అడ్డంగా బోర్లాపడి
అయోమయం లొ కొట్టుకుపోతూ   
నిండుగా పేడితనం తో  భీరువులై  చేవచచ్చినవారిలో
విశ్వాసపు ఊపిరిలూది , రేపటి జీవితంపై క్రొంగొత్త ఆశలు రగిల్చి
ధీరత్వాన్ని నింపి మగదీరులుగా విజయశిఖరాలపై నిల్పి
తెరవెనుక నిలిచిపోయే ఆ సాద్వీ గుణంలో ఉందిరా......
మనసుతో చూడగలిగే మలినపు ఆలోచనలు ప్రక్కనపెట్టి చూడు
కారుకూతలు మాని వెకిలి వేషాలు వదిలి
ఎవరెస్టును  మించిన ఆ నిలువెత్తు అమ్మరూపాన్ని చూడు
కళ్ళు భైర్లు క్రమ్మి , కామపు పొరలు పోయ
అసలు సిసలైన మగవాడి గా   నిలుస్తావు...    

Monday 22 September 2014

పిల్లల్లో తస్కరించే స్వభావం



పిల్లల్లో డబ్బులు గాని విలువైన వస్తువులు గాని తస్కరించే స్వభావాన్ని సైకాలజీ లొ    క్లేప్తోమేనియా  ( KLEPTOMANIA)  అంటారు.  ఈ రోజుల్లో  స్కూలు కు ఇంటి దగ్గర నుండి  తల్లిదండ్రులకు   తెలియకుండా డబ్బులు తీసుకురావడం  మిగిలిన స్నేహితులతో వాటిని  ఖర్చు పెట్టడం అతి సాధారణం అయిపోతుంది. ఒకరినుండి ఒకరు నేర్చుకుని ఈ జాడ్యం 
మిగిలిన వారికీ ప్రాకే అవకాశం ఉంటుంది. 

ఈ ధోరణికి గల కారణాలు ఏమిటని విశ్లేషిస్తే ..........

కొంతమంది పిల్లలకు చిన్నప్పటినుండి మిగిలిన స్నేహితుల పుస్తకాలు గాని, ఇతర వస్తువులు గాని వారి మీద కోపం వలన గానిలేదా వారు అవి పోగొట్టుకుని ఇబ్బంది  పడుతుంటే  ఆనందించడానికి  దొంగతనం చేసే  అలవాటు మొదలవుతుంది. వాటిని సకాలం లొ గుర్తించి అరి కట్టకపోతే , అలా వారు విలువైన వస్తువులు లేదాతల్లిదండ్రులకు  తెలియకుండా డబ్బులు తీయడం జరుగుతుంది. ఎవరూ గుర్తించకపోవడం తో, తప్పని నచ్చ చెప్పకపోవడం తో  అది ఒక అలవాటు అవుతుంది.

సాధారణం గా చదువులో వెనుక బడే పిల్లలు మిగిలిన పిల్లల వద్ద గొప్పగా ఉండాలనే భావనతో ఇంట్లో నుండి డబ్బులు తీసుకొచ్చి వారి స్నేహితులకు  చిరుతిళ్ళు కోసం లేదా హోటల్ కు తీసుకు వెళ్లి పార్టీ ఇవ్వడం చేస్తుంటారు. అందరి లొ గొప్ప గా ఉండాలనే తపన మిగిలిన స్నేహితుల ముందు అజమాయిషీ  చెల్లించాలనే  కొరికి ఈ విపరీతధోరణికి కారణాలు.   వారు తాము ఇంటి  లొ  ఎ సమయం లొ తల్లిదండ్రులకు  తెలియకుండా  తీసుకువస్తున్నారో మిగిలిన వారికి చెప్పి  వారిని కూడా ఇటువంటి పనులకు ప్రేరేపిస్తుంటారు.   ఇంట్లో కూడా  డబ్బులు  పిల్లలకు అందుబాటు లొ ఉంచడం లెక్క సరిగా చూసుకోకపోవడం వీరిని గుర్తించడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా పెద్ద  సమస్యలో ఇరుక్కున్న తర్వాత తల్లిదండ్రులు కనులు తెరుచుకుంటారు.   పాఠశాల   స్థాయిలో వీటిని నిరోధించకా పొతే   పెద్దయ్యాక   చైన్   స్నాచింగ్ వంటి నేరాలకు 
ప్రయత్నించే ప్రమాదం ఉంది. 

తల్లిదండ్రుల పాత్ర: 

  1.      ఇంట్లో పిల్లల    అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చడమే కాకుండా, పిల్లలలొ  కనబడే  విపరీత ధోరణులను  పరిశీలిస్తూ ఉండాలి. 
  2.      పిల్లలవద్ద ఖరీదైన వస్తువులు  గాని  తాము కొన్ని వస్తువులు గాని కనబడితే అవి ఎలా వచ్చాయో విచారాన్ చేస్తుడాలి. 
  3.      ఇంట్లో  ఎంత డబ్బు ఉంది, ఎప్పటికప్పుడు సరి చూసుకున్తున్డాలి. ఒకవేళ తేడా వస్తే సరిగా ఆరా తీతాలి.
  4.     పిల్లలకు   అందుబాటు లొ డబ్బులు ఉంచరాదు. 
  5.     పిల్లలకు డబ్బు పొడుపు చేసే  అవగాహన కల్పిస్తూ వారి కిడ్డీ బ్యాంక్ లొ ఎంత జమా అయినదీ, దేనికి ఖర్చు అయినది తెలుసుకుంటుండాలి.  
  6.     పిల్లల గదులను, బ్యాగ్ లను అప్పుడప్పుడు వారికి తెలియకుండా  తల్లిదండ్రులు కొన్ని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని పరిసీలిస్తుండాలి. 
  7.     స్కూల్ నుండి  సమయానికి వస్తున్నారా, మధ్యలో చిరుతిళ్ళ కోసం గాని మరి ఇతర వ్యాపకం కోసం ఇంటికి రావడం  ఆలస్యమవుతున్నారా  అని  పరిశీలిన చేస్తుండాలి.
  8.     ఉపాధ్యాయులను తరుచూ కలుస్తూ  వారి ప్రవర్తనకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే,  తేలిక గా తీసుకోకుండా  పరిశీలించాలి. 
                  మొక్కి ఒంగనిది   మాని  ఒంగునా    అన్నట్టు   పిల్లల ప్రవర్తనలో లోపాలు  ఆదిలోనే తొలగిస్తే తర్వాత బాధ పడాల్సిన అవసరం రాదు. తల్లిదండ్రులుగా మన భాద్యత ను
   సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Wednesday 17 September 2014

ఇది నీ జీవితం


ఇదే కదా జీవితమంటే తమ్ముడూ
ఇక్కడ ఎవ్వరూ నా అనేవారు ఉండరు
అలా అని పరాయి వారూ ఉండరు
నీతో పనేమైనా ఉందా 
ఎప్పటికైనా ఉపయోగపడే అవకాశం ఉందా 
టచ్ లొ ఉండే వర్కవుట్ అవుతుందా
నిన్ను మించినవాడు లేరంటారు..
స్నేహానికి కొలమానం నీవే అంటారు
అసలు ఈ దేశానికి నీ అవసరం చాలా ఉందంటారు
నీతో చేయించుకోవలసిన పని పూర్తయిందా
ఇక పై అడగాల్సిన లేదా అవసరం పొందాల్సిన పనేమీ లేదా
ఎదురుగా కనబడినా వేరే గ్రహవాసిని చూసినట్టు చూస్తారు
ఇక్కడొక బొక్క ఉందని అక్కడొక మచ్చ ఉందని
వెతికి మరీ చూపిస్తారు
అవకాశం దొరికిందా ఓ రెండు రాళ్ళు విసరడానికి సిద్ధమవుతారు
కృతజ్ఞత అనే పదం నవ మానవ డిక్షనరీ నుండి
అదెప్పుడో తీసేశారు బ్రదర్
వెర్రి వెంగలప్పలా దిక్కులు చూస్తూ కూర్చోకు
ఎవడికి మేలు చేసిన వెంటనే మరిచిపో
ఎప్పుడు ఎ బాధ వచ్చినా ఒంటరిగా ఎదుర్కొ
నీకు నివు నిజమైన స్నేహితుడివి కాగలిగితే
ఏ గొట్టం గాడి కోసమో ఎదురుచూడక్కరలేదు
ఎదలో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటె
ఎవ్వడి మీదా అధారపడక్కరలేదు
ఇది నీ జీవితం ఇది నీ పోరాటం
చివరి వరకూ నిలిచేదీ నీవే
చస్తే చివరిక్ ఒంటరిగా వేల్లెదీ నీవే .....
.........trainerudaykumar@gmail.com

Tuesday 9 September 2014

Art of Parenting.

ఖలీల్ జిబ్రాన్ రాసిన ప్రోఫెట్ కవితా సంకలనం అనేక తాత్విక విషయాలను సోదాహరణం గా వివరిస్తుంది.   ముఖ్యంగా  On Children  అనే కవిత లొ ఆయన వ్యక్తపరచిన భావాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు గా భావించవచ్చును. 

I STANZA

And a woman who held a babe against her bosom said, "Speak to us of Children." And he said: 
      Your children are not your children. 
      They are the sons and daughters of Life's longing for itself. 
      They come through you but not from you, 
      And though they are with you, yet they belong not to you.


           తన బిడ్డను గాడంగా హృదయానికి హత్తుకున్న ఒక స్త్రీ పిల్లల గురించి కొన్ని విషయాలను చెప్పమని ప్రోఫెట్ ను అడుగుతుంది.   బిడ్డను హృదయానికి హత్తుకున్న స్త్రీ అనే పదం తోనే  పిల్లల పట్ల ప్రేమగా ప్రవర్తించే తల్లిదండ్రులు పిల్లల పెంపకం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తో ఉంటారు అని జిబ్రాన్ అభిప్రాయం అని చెప్పవచ్చును.  ఆమె తో ప్రోఫెట్ అంటాడు......

              "     నీ  పిల్లలు నీ  పిల్లలు కారు. 
                    తనకుతానుగా గాడంగా వాంచించే జీవితం యొక్క కుమారులు మరియు కుమార్తెలు. 
                    వారు నీ  ద్వారా ఈ జీవితం లోకి వచ్చారు కాని నీ నుండి కాదు. 
                   వారు నీతో  ఉన్నప్పటికీ నీకు సంబంధించినవారు  కాదు. "  

వివరణ:      జిబ్రాన్ పిల్లల పట్ల మనకు ఉండాల్సిన దృక్పథం గురించి చెప్పాడు.  ఒక పైప్ ద్వారా నీరు వస్తుంది గాని పైప్ నుండి కాదు. అలాగే భగవంతుడు మన పిల్లల్ని మనద్వారా ఇక్కడకు పంపించాడు కాని మననుండి వారు రాలేదు.  పూర్వం టెలిగ్రాం ద్వారా పిల్లలు పుట్టిన విషయం దూరంగా ఉన్న తండ్రి కి తెలియచేయాలంటే ..you are blessed with a baby  అని టెలిగ్రాం పంపే వారు. అంటే భగవంతుడు మనల్ని పిల్లలు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించాడు అని.  వారికంటూ స్వంత జీవితం ఉంటుంది. వారు మనతో ఉనప్పటికి వారి కంటూ ఒక స్వతంత్ర జీవితం వారు కోరుకున్నది వారికి ఉంటుంది. అంతవరకూ వారిని ఒక ధర్మకర్తల్లా వారిని సాకాల్సిన భాద్యత మనదే .  మన పిల్లలకు మనం కేవలం ధర్మ కర్తలు మాత్రమె .  భజగోవిందం లొ కూడా  కస్తే కాంతా.. కస్తే పుత్రా . అనే శ్లోకం లొ శంకరాచార్యుల వారు చెప్పిన వేదాంతం ఇదే.  

II STANZA

               You may give them your love but not your thoughts. 
               For they have their own thoughts. 
               You may house their bodies but not their souls, 
               For their souls dwell in the house of tomorrow, which you cannot visit, not                                                            even in  your dreams.
                 You may strive to be like them, but seek not to make them like you. 
                  For life goes not backward nor tarries with yesterday. 

                నీవు నీ పిల్లలకు నీ ప్రేమ ఇవ్వవచ్చు
                కాని  నీ ఆలోచనలను మాత్రం కాదు.
                వారి శరీరాలు నీవి  కావచ్చు కాని వారి ఆత్మలు కాదు
                నీవు కలలో కూడా దర్శించలేని ఉన్నత భవిష్యత్తులొవారి ఆత్మలు నివసిస్తాయి. 
                నీవు  వారిలా ఉండటానికి ప్రయత్నిచావచ్చు, 
                కాని  వారిని నీలా తయారుచేయడానికి ప్రయత్నించకుండా ఉండటం తెలుసుకో   
               ఎందుకంటే  జీవితం వెనుకకు నడవదు,  నిన్నటి తో అంటిపెట్టికోదు 


    వివరణ:  తల్లిదండ్రుల మొదటి భాద్యత పిల్లల రక్షణ మరియు  సంరక్షణ  మాత్రమే.. వారి శారీరక ఎదుగుదల అవసరమయ్యే పోషణ, అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇవి తల్లిదండ్రుల ప్రథమ  కర్తవ్యం. అంతే  కాని వారి ఆలోచనలను అణచివేసే అధికారం హక్కు తల్లిదండ్రులకు లేవు. నిన్నటి తరానికి చెందిన  తల్లిదండ్రులు రేపటి తరానికి చెందిన  పిల్లల ఆలోచనలను శాసించడం మూర్ఖత్వం.  జీవితం వెనక్కు నడవదు లేదా నిన్నలా ఉండదు. వారు రేపటి రోజున ఏ  స్థాయికి వెళతారనేది తల్లిదండ్రుల ఊహకు కూడా అందని సత్యం. ఉదాహరణకు ఇప్పుడు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలలో స్థిర పడ్డవారు చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు వారు  ఇంతవరకు రాగలరని కలలో కూడా ఊహించి ఉండరు.  కాబట్టి వారి ఆలోచనలు వారివే...  మన ఆలోచనలు వారిపై రుద్దరాదు.  అంత ఎందుకు మన సెల్ ఫోన్ లొ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మన పిల్లలకు తెలిసింది కూడా మనకు తెలియదు.    సెటప్ బాక్స్ ని ఎలా అమర్చాలో ఎలా ఆపరేట్ చేయాలో చిన్నారులకు తెలిసినంత కూడా మనకు తెలియదు. మనం టి వి చూడటానికి  ఇరవై ముప్పై సంవత్సరాలు వస్తే కాని అవ్వలేదు. అదీ ఒక చానెల్ తోనే .   మరి వారు  పుట్టుకతో  వంద చానెల్స్ తో రిమోట్ తో హల్  చల్ చేస్తున్నారు.  

III STANZA
      
      You are the bows from which your children as living arrows are sent forth. 
      The archer sees the mark upon the path of the infinite,                                                  and He bends you with      

     His might that His arrows may go swift and far. 
      Let your bending in the archer's hand be for gladness; 
      For even as he loves the arrow that flies, so He loves also the bow that is stable

    మీ పిల్లలు ఎక్కుపెత్తబడిన శరాలు , బాణాలయితే 
  మీరు అవి ముందుకు వెళ్లేందుకు వంచబడిన విల్లులు 
  విలుకాడు అనబడే భగవంతుడు ఆ బాణాలను అనంత  లక్ష్యాల వైపు గురి పెడతాడు 
   ఆ బాణాలు వేగంగా సూటిగా వేళ్ళెందుకు  విల్లులు వంగాలని నిర్దేశిస్తాడు 
   విలుకాది అబిష్టానికి తగ్గట్టుగా వినమ్రమంగా వంగడమే విల్లు యొక్క కర్తవ్యం
 ఆయన   వేగంగా ప్రయాణించే బాణాలను  ప్రేమించినట్టే 
   స్థిరంగా  ఒంగే విల్లును కూడా ప్రేమిస్తాడు. 

వివరణ :     ఇక్కడ జిబ్రాన్ భగవంతుని విలుకానిగా  పిల్లలను బాణాలు గా తల్లిదండ్రులను విల్లులుగా  సరిపోల్చాడు. బాణాన్ని ఎ అనంతమైన లక్ష్యానికై గురిపెట్టాడో విల్లుకి తెలియదు. దాని పని విలుకాడు చెప్పేటట్టు గా  బాణాన్ని సూటిగా, వేగంగా వెళ్లేందుకు సహకరించేందుకు విలుకాని చేతి లొ స్థిరంగా సున్నితంగా ఒంగటమే..    అలా ఎ తల్ల్లింద్రులయితే పిల్లలు తమ లక్ష్యాల వైపు వెళ్లేందుకు వారి ఉన్నతికి తమకు తెలిసి తెలియని మిడి మిడి పరిజ్ఞానం తో అడ్డు పడకుండా ఉంటారో వారిని భగవంతుడు కూడా ప్రేమిస్తాడు. 

trainerudaykumar@gmail.com 

Sunday 7 September 2014

.. గురుభ్యో నమ:.............



పాదాభివందనాలు వద్దు

పుష్ప గుచ్చాలసలే వద్దు 

బహుమానాలు వద్దు 


సన్మానాలసలే వద్దు

మీరేదో ఫీజులు కట్టారు కాబట్టి 


మాకొచ్చిన రెండు ముక్కలు చెప్పామనుకోడానికి 


మా పాఠశాల పచారి కొట్టు కాదు 


చదువిక్కడ అంగటి సరుకు కాదు 


మీరు చెల్లించేది మా శ్రమకే గాని


మేమందించే జ్ఞానానికి కాదు


మీలో మేం కలిగించే ఆత్మవిశ్వాసానికి కాదు


అంత ఎత్తుకు ఎదిగారంటే 


నిచ్చెన మెట్లలా ప్రతి ఉపాధ్యాయుడు తోడ్పడితేనే


డాలర్ల సేద్యాన్ని సాగిస్తున్నారంటే 


ఆనాడు నాగలి గా మే మేథస్సును సుసంపన్నం చేయబట్టే గదా

మీరు సాధించిన విజయాలు చూసి మేం ఉప్పొంగిపోతాం 


ఫలసాయం చేతికొచ్చిన రైతులా మైమరచిపోతాం

మీనుండి మేం ఆశించేది ఓ పలకరింపు 


నిండిన గౌరవం తో మీరిచ్చే ఓ చిరునవ్వే......

వెటకారాలు ఒద్దు. వెక్కిరింతలొద్దు 


చాటుగా మాటుగా సన్నాయి నొక్కులొద్దు....


వ్యంగ్య బాణాలొద్దు..వ్యతిరేకభావనలొద్దు

గురుశాపాలుండవు గాని గురు శోకం మాత్రం ఊరికే పోదు,,,,

Tuesday 26 August 2014

మనుష్యులం కదా


మనుష్యులం కదా 
మూర్ఖత్వాన్ని
మొండితనాన్ని
పక్కనబట్టి 
అహాన్ని,ఇజాల్ని,  భేషిజాల్ని 
ఏదో ఒక మూలన దాచి పెట్టి
కొంచెం మానవత్వం తో బ్రతుకుదామా.....
గుర్తించబడాలనే కోరిక మంచిదే
నలుగురిలో గొప్పగా
తలెత్తుకోవాలనే తపన తప్పేమీ కాదు
ఒక గీత పెద్దది కావాలంటే 
పక్క గీతలని చెరపాల్సిందేమీ లేదు భాయీ 
అందరికన్న మిన్నగా ఉండేందుకు 
నీలో ఉన్న ఆ ప్రతిభని ప్రదర్శిచేందేకు ప్రయత్నించు
అవకాశం రాలేదా అధైర్య పడకు 
నాలుగేళ్ళు మొలకగా బ్రతికిన
చైనా వెదురు మొక్క 
నిరీక్షణ ఫలించిన తర్వాత 
నింగే తన హద్దుగా ఎదగడం తెలియదా 
ఏనుగు వెళుతుంటే 
అస్థిత్వం  ఏమవుతుందేమో
అంటూ అరిచేది వీధి శునకమే.. 
మనం మనుష్యులం కదా 
ఎదిగే వాళ్ళను చూసి ఆనందిద్దాం.
ప్రతిభ ఎవ్వరిలో కనబడినా 
మనస్ఫూరిగా అభినందిద్దాం. 
మనదైన రోజు వచ్చే వరకు 
కొంచెం మౌనంగా ఉందాం.  
మనశ్శాంతితో జీవిద్దాం. 
వాడిని వీడిని  ఎవడినీ కెలక్కుండా
కవ్వించకుండా  క్రమశిక్షణతో బ్రతికేద్దాం. 

trainerudaykumar@gmail.com

Tuesday 3 June 2014

గుండెలో తడి ని సజీవంగా నిలిపే చిత్రం మనం


ఈ రాజకీయాలు, ఎన్నికలు, లెక్కింపులు, గెలుపులు , ఓటములు, ఇవన్నీ చూసి చూసి అలిసి పోయారా?  ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా   ఏవి నమ్మాలో. ఏవి అనుసరించాలో తెలియక యాంత్రికత అలవరుచుకొని  జీవితం లో జీవాన్ని కోల్పోయారా?...  వేసవి లో ఉష్ణతాపాన్ని తట్టుకోలేక తల్లడిల్లి పోయారా? గుండెలో తడి ఆరి పోయి ఆర్ద్రత అంతా ఇంకిపోయి మోడిబారిపోయారా????? 

      ఎడారిలో ఎండమావులవెంట పరుగులెత్తిన వారికి ఖర్జూరపు తోటలతో నిండిన ఒక ఒయాసిస్సు లా, మండువేసవిలో తల్లడిల్లినవారికి ఒక చల్లని జలపాతం హాయిగా  సేద దీర్చే అతి చక్కని చిత్రం " మనం "
  
            ఇక వెంటనే సకుటుంబ సపరివార సమేతం గా " మనం" సినిమాకి వెళ్ళండి. బాగుందట, బాగో లేదట   మగధీర, మూగ మనసులు సినిమాల్లా  పునర్జన్మ తో కూడిన సినిమా అట. అదట ఇదట  అంటూ అందరూ చెప్పిన మాటలు పక్కన పెట్టండి.  లాజిక్కుల్ని, హేతువాద  విశ్లేషణల్ని పక్కన పెట్టి  సినిమా లో పూర్తిగా నిమగ్నమవ్వండి.   కలకాలం గుర్తుంచుకోతగ్గ గుండెను పిండే ఒక రసానుభూతి తో బయటకు వస్తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు. 
    భావకవి గా పేరు గాంచిన కృష్ణశాస్త్రి  అడివి అందాలు చూడాలంటే కళ్ళతో కాదు .. ఆకు లో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై అంటూ ఆయా అంశాలతో నిమగ్నమై చూస్తేనే రసస్పూర్తి పొందుతారని వర్ణించారు. ఆరవ బర్త్ డే  ఆనందంగా జరిగి, ఊహించని బహుమానాలతో అందరితో ఆనందించి, తల్లిదండ్రులు అన్యోన్యంగా కీచులాడుకోకుండా ఉండాలని కేక్ కట్ చేసేటపుడు మనస్పూర్తిగా కోరుకున్న ఒక చిన్నారికి మరుసటి దినమే విగత జీవులై తల్లిదండ్రులు కనిపిస్తే , వారు తన నుండి ఏమి కోరుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక వీడియో రూపం లో అందిస్తే అది చూస్తూ పెద వాడైన ఆ బాలునికి తన తల్లి, తండ్రి మరలా కనిపిస్తే.....      ఆ   పాత్రలో  మిమ్మల్ని మీరు ఊహించుకోగలిగితే లేదా కనీసం ఎంపతీ తో ఆలోచించ గలిగితే .....  తాను ఎలాంటి అనుభూతిని పొందనో   తన కడుపును పుట్టిన మరో పాత్ర అదే అనుభూతి పొందితే.....  ఇది కేవలను మాటలతో చెప్పలేని ఒకభావన....   ఎక్కడా ఏ మాత్రం  అసహజం అని అనిపించనీయకుండా  వస్త్రధారణ తో పాటు  గోల్డ్ స్పాట్   సీసా  తో  పాటు అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని ఒక శిల్పం లా మలచిన తీరు చూస్తే దర్శకుడిని అభినందించకుండా ఉండలేరు.  ఒక కుటుంబం మొత్తం  ఆ  కుటుంబం ఎదుగుదలకు మూలవిరాట్టు అయిన ఆ మాహానటునికి ఇచ్చిన ఘన నివాళి ఈ సినిమా.    నట వారసత్వాన్ని  ఒక తరం నుండి మరో తరం అందిప్ అందిపుచ్చుకున్న తీరుని హర్షించకుండా ఉండ లేము.  ఎవరు ఎలా నటించారు, కథ ఏమిటి ఇవన్ని చెప్పాలా?  మీ అనుభూతులు ఎలా ఉండాలో చెప్పడానికి మేం ఎవరం.  చక్కగా సినిమా చూసి ఆనందించండి.  అందరినీ అభనందించండి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్టయితే మనసా వాచా కర్మేణా ప్రేమించండి. ఒక వేళ మన మధ్య లేకపోతే ఏదో ఒక రూపం లో ఎప్పుడో ఒకప్పుడు కనబడతారని ఆశిస్తూ జీవించండి. కళామతల్లి ముద్దుబిడ అక్కినేనికి ఘన నివాళు అర్పించండి. మన తెలుగువాడయినందుకు గర్వించండి.     .. by  A. Uday Kumar

Tuesday 11 February 2014

Do the work you LOVE


ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి!
మనం చేసే పని మనకు నచ్చిందే అయితే 
మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితే
ఆ కిక్కే వేరురా అబ్బాయి!
సమయం ఎప్పుడైపోతుందో తెలీదు
శరీరానికి అలసట అంటే తెలీదు 
సృజనాత్మకతయే ఆలంబనగా   
రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ 
పరిపూర్ణత్వం వైపు నడుస్తుంటాం. 
ఎవ్వడేమంటున్నాడో
ఎవడు  పలకరిస్తున్నాడో  
ఎవడు పరిహసిస్తున్నాడో 
ఎవడు కలహిస్తున్నాడో
ఎవడు కలహిస్తున్నాడో 
ఎవడు కవ్విస్తున్నాడో 
ఎవడు కలవర పెడుతున్నాడొ
ఆలోచించడానికే సమయం దొరకదు 
చేసే పనిలో నిరంతరం 
ఓ మునిలా
ఓ ధ్యానిలా
ప్రాపంచిక లోకంతో 
లాభనష్టాల బేరీజుతో
ఏ లెక్క లేదన్నట్టు మునిగిపోవడమే 
చేతికి వచ్చే సంపాదన కన్నా
గుండె లో నిండే సంతృప్తి 
యావత్ లోకాన్నే నీ కాళ్ళకింద దాసోహం చేస్తుంది 
కాని అది అంత సుళువు కాదురా చిన్నా 
ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు
ఎవరి సహాయాలు ఉండవు
ఎవరి సూచనలు ఉండవు
లోకం నిన్ను గుర్తించేంత వరకు 
నీ ఆకలి, నీ అవసరాలు
నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి 
ఎవడు మనల్ని తక్కువగ చూస్తున్నాడో అనే
ఆత్మన్యూన్యత  అసలు నిదురే పోనియ్యదు 
ఎవడిని కలిసినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా
అవహేళనా జ్వాలలు గుచ్చుకుంటూనే ఉంటాయి 
నమ్ముకున్నవారికి బరువు అవుతున్నామేమో అన్న వ్యథ 
నిలువెల్లా కాలుస్తునే ఉంటుంది 
ఎదురు చూసే క్షణం నీదైనంతవరకు 
కలలు సాకరమై ఎదురుగా నిలిచేంతవరకు 
జీవితంతో ఫొరాడే ఓపిక, ఓరిమి
నీ ఆయుధాలుగా మలుచుకునే నైపుణ్యం ఉంటేనే
నీవు ప్రేమించే పని జీవితాంతం చేయడానికి సిద్ధపడు 
లేదా మనసు చంపుకొని నాలుగు రాళ్ళు సంపాదించేందుకు 
దొరికిన పని చేస్తూ ప్రతి క్షణం చస్తూ జీవించు...