Sunday, 3 January 2021

ఖలీల్ జిబ్రాన్ కవితలు - తెలుగు అనువాదం

 సంపూర్తిగా జీవించు...


అర్థ ప్రేమికులపై అనురాగం చూపకు
 అర్ధ సావాసగాళ్లతో  స్నేహం చేయకు
అర్థ నైపుణ్యగాళ్లతో వ్యవహారం పూనకు
అర్ధ జీవితం గడపకు 
అలానే
అర్ధ మరణనాన్ని ఆస్వాదించకు
నిశ్సబ్దాన్ని కోరుకున్న యెడల
మారు మాటైనా పలకకు
 మాట్లాడటం మొదలుపెడితే చెప్పాల్సిందే చెప్పేవరకు ఆపకు
మౌనం లో భాషను గాని, సంభాషణలో మౌనాన్ని గాని శ్రుతి చేయకు,
 అంగీకరిస్తే మొండిగా వ్యక్తపరచు,
 ముసుగులో దాచకు,
తిరస్కరిస్తే స్పష్టంగా తెలియచేయ్
 ఎందుకంటే అస్పష్టంగా తిరస్కారం బలహీనమైన అంగీకారం అవుతుంది.
అర్ధ పరిష్కారాన్ని అంగీకరించకు, 
అర్థ సత్యాలను ఔననకు
అర్హస్వప్నాలను వీక్షించకు
అసంపూర్ణ ఆశలలో వీరవిహారం చేయకు
అర్ధ పానీయం నీ దప్పికను తీర్చదు
సగం భోజనం నీ ఆకలిను సంతృప్తి పరచదు
సగం ప్రయాణం నీ మజిలీని చేర్చదు
అర్ధ ఆలోచన ఏ ఫలితాన్ని ఇవ్వదు
ఆ మిగిలిన సగం నీవు ప్రేమించేది కాదు
ఆ సమయంలోనే నీలో మిగిలిన ఆ సగం మరో సమయంలో గడపాల్సినదే
నీవు గడపని ఆ సగం నీవు గడపకుండా విడిచిపెట్టినదే
నీవు పలకని ఆ మాట గాని,
వాయిదావేసిన చిరునవ్వు గాని,
నీవు పొందని ఆ ప్రణయం గాని,
నీకు తెలియని ఆ స్నేహం గాని,
నీవు చేరుకోని ఆ గమ్యం గాని,
నీవు పూర్తి చేయని ఆ పని గాని,
గైర్హాజరుగా హాజరైన చోటు గాని
నీ సన్నిహితులకే నిన్ను ఒక పరాయివాడిని చేస్తుంది 
వారిని నీకు కానివారిగా చేస్తుంది
అసంపూర్తిగా మిగిలిన 
ఆ రెండో సగం నీ అసమర్థత కావచ్చు కానీ 
నీకు నీవు సమర్థుడవే కదా
అసంపూర్ణుడవు కాదు కదా
సంపూర్ణ జీవితాన్ని  పూర్తిగా జీవిచడానికే జీవించవలసినవాడివే కదా
సగం జీవితాన్ని కాదు కదా....
....... ఖలీల్ జిబ్రాన్

No comments:

Post a Comment