Sunday 17 May 2015

Decision making...


నీవేంటో  నీ జీవితం  ఏమిటో
ప్రభావితం చేసేది నీవు  తీసుకునే నిర్ణయమే
ఆలోచించే తీసుకున్నావా లేక
అనుకోకుండా ఏమరుపాటు లొ జరిగిందా
ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది
నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
నిఖార్సయిన నిజం ఇది..
జీవితమంటేనే ఆలోచనల సమాహారం
చావు పుట్టుక మనచేతుల్లో లేవుగాని
ఈ రెండింటి మధ్య జరిగే కథంతా
మన నిర్ణయాల ఫలితమే
రోజు మొదలయ్యేది
ఎప్పుడు మనం లేవాలనే నిర్ణయం బట్టే
రోజు ముగిసేది కూడా
ఎప్పుడు మనం నిద్రకు ఉపక్రమించాలనే దాని బట్టే
చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు
వ్యాపారం, వ్యవహారం, రాజకీయం,
ఒకటేమిటీ మనకు సంబంధించిన
సమస్తం మన నిర్ణయాల పర్యవసానాలే
నలుగురినీ సంప్రదిస్తావో
నాలుగు రకాలుగా ఆలోచిస్తావో
నలుగురి జీవనవిధానాన్ని పరిశీలిస్తావో
భవిష్యత్తును ముందుగా ఊహించగాలుగుతావో
ఎలా అయితేనేం నీవు తీసుకున్న నిర్ణయానికి
కర్త కర్మ క్రియ అంతా  నీవే
అనుకున్న ఫలితం రాకపోతే
వాడి మీద వీడి మీద లేనిపోని ఏడుపులు వద్దు
అనుకున్నట్టు జరిగితే ఆనందించు
అలా కాకపొతే అంతర్మథనం తొ పునరాలోచన చేయ్
ఈ జీవితం నీది . నీ నిర్ణయం నీదే
నీ నిర్ణయం, నీ ఇష్టం........

No comments:

Post a Comment