Sunday 19 April 2015

చేదు సత్యాలు

నీతో నడుస్తున్నారంటే 

నువ్వు నచ్చేసావని కాదు 


నీ తత్త్వం, వ్యక్తిత్వం 


వారికి ఆమోదం అని కాదు 

భలే భలే అని చంకలు గుద్దుకుంటూ 


తెగ మెచ్చేసుకుంటున్నారంటే 


వారి అవసరం కాని అహంకారం కాని 


నీ వలన ఎంతో కొంత తీరుతుందన్నమాట.


ఇప్పుడు కాకపోయినా రేపైనా


ఆ మాత్రం ఉపయోగపడకపోతావా అన్న లెక్కల్లో ఉన్నారన్నమాట


పళ్ళికిలిస్తూ పరాచికాలాడే ప్రతీవాడూ నీవాడనుకోకు


ఎదురైతే ఒక నమస్కారం పడేసే ప్రతీ వాడు నీ భక్తుడనుకోకు


మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబందాలే అని 


మార్క్స్ మహాశయుడు చెప్పాడంటే 


ఇలాంటి ఎదవల్ని ఎంతమందిని చదివాడో 


అనవసర బంధాలు తెగపెంచేసుకొని 


తెగ రాసుకొని పూసుకొని తిరిగావనుకో


ఆనుకున్న పని అయినాక లేదా


పని అయ్యే అవకాశం లేదని తేలాక
 

నిండా ముంచేస్తారు


నీలాపనిందలతో తెగ తడిపేస్తారు 


ఏరుదాటాక తెప్పలు తగలేసే మే
థావుల రాజ్యం ఇది 

కూర లొ కవివేపాకులా ఎంగిలి చేతితో విసిరేసే వింతైన సమాజం ఇది

దేవుడు మనల్ని వార్ జోన్ లొ పడేసాడు 


బి అలర్ట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అని 


పూరీ జగనన్న ఊరికే చెప్పలేదు 


అసలు గుణం అర్థం చేసుకున్నాక 


ఎవడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉం
చు 

ఎవడితో ఎంతవరకు ఉండాలో అక్కడే ఉండు 


శాశ్వతం కాలేని బంధాలు బంధుత్వాలు అనే పాశాలు పెంచుకోకు 


ఆర్ద్రత లేని అభిమానం, అనురాగం అనే


కుహానా కబందాలలో ఇరుక్కోకు 


మానవత్వం పరిడవిల్లె మహితాత్వుల ముందు మోకరిల్లు


పెదవితో నవ్వి నొసటి తొ వెక్కిరించే 


గోముఖ వ్యాఘ్రాల వ్యామోహంలో పడకు 


నువ్వేదో వింటావని కాదు

నాకు చెప్పాలని చెపుతున్నా


వింటావో,వినవో అది నీ ఖర్మ


ఈ రోజు కాకపోయినా రేపైనా 


నిజమే సుమీ అని మాత్రం 


అనకతప్పదులే..

No comments:

Post a Comment