Friday, 3 April 2015

" టెంపర్ " - ప్రతి ఒక్కరి ఆయుధమే కాదు కవచం కూడా......


" టెంపర్"   సినిమా విడుదలై  ఏభై  రోజులైపోయింది.   ఏముందీ  ఈ సినిమాలో  ఇలా ఆడుతుంది?  ఎన్టీయార్  కొంచెం  ఓవర్ ఏక్షన్  చేయలేదూ....  అంత  గొప్ప సినిమానా ఇది...  ఇవి   అనేక మంది మదిలో వస్తున్న ప్రశ్నలు..   ఒక మంచి సినిమా  అనేది.... చూసిన వారి ఆలోచనల్లో  కొంత మార్పు తీసుకురావాలి.  సినిమా చూసి  బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక అంతర్మథనం  కలిగించాలి.  ఈ సినిమా విజయ రహస్యం అదే..   ముఖ్యంగా  పోలీస్ స్టేషన్ సీన్ ,  కోర్టు సీన్   ప్రేక్షకుల మీద తెలియని ముద్ర వేస్తాయి..  ఏంతో  కొంత అంతర్మథనం కలిగిస్తాయి..   ఈ సినిమా లొ ఉన్న ఆ విషయం  ఏమిటో  కొంచెం  చర్చిద్దామా..  ఇవి నా అభిప్రాయాలు మాత్రమె...  పూరీ గారంటే నాకున్న ప్రత్యెక అభిమానం తో రాసినవి కాదు..  ఈ సినిమాలో నిజంగా ఉన్నవి అని నేను అనుకున్న విషయాలు .. చదివి  నిజమే అని అనిపిస్తే  మీ ఇష్టం  లేదు కాదు కూడదు  అన్నారా .. ఏమీ పర్వాలేదు అలాగే ఉండండి. ఎందుకంటే జీవితం ఎవరినీ విడిచి పెట్టదు.  ప్రతీ ఒక్కడి లెఖ్ఖ  ఖచ్చితంగా తెలుస్తుంది. అందరి సరదా  తీరుస్తుంది. 

జీవితం ఎవడిని  విడిచిపెట్టదు .. ప్రతి ఒక్కరి సరదా తీరుస్తుంది.......
మన కన్నా తోపు ఎవడూ లేడని.. మనం ఏమీ చేసినా అడిగే వాడు  ఎవడూ లేడ ని .. మన సిద్ధాంతాలే సరియైనవని.. మనం  ఎవడికీ జవాబుదారీ కాదని  తలబిరుసుతనం తో టెంపర్  తో ముందుకు  వెళ్తుంటాం...  కాని  జీవితాన్ని  మించిన గురువు  ..  జీవితాన్ని మించిన  శిక్షకుడు.. జీవితాన్ని మించిన  Equalizer ఎవరూ ఉండరేమో........ఎక్కడికి అక్కడ బ్యాలెన్స్ చేస్తుంది....
జీవిత పాఠాలను మనకు మనం గా తెలుసుకున్నామా?  అంతకుమించిన సుఖం   మరొకటి ఉండదు. అలా కాకుండా  మన తప్పులను  లేనిపోని లాజిక్కులతో  సర్దుబాటు చేసుకుంటూ,  సమర్ధించుకుంటూ  గుడ్డిగా మొండిగా  ముందుకు వెళ్ళాలని ప్రయత్నించామా   జీవితం  చాలా తాపీగా  చుర్రు మని  కాలుస్తూ  తీరిగ్గా  మనల్ని దారిలో పెడుతుంది.  బయటకు చెప్పుకోలేని తీవ్ర మనోవ్యథ  కలిగించి మరీ   ఎక్కడ వాత పెట్టాలో  అక్కడ పెట్టి మరీ  నేర్పిస్తుంది..... 
1. మనం చూసిందే జీవితం కాదు:   మనం చూసిందే జీవితం కాదు.  మన జీవితం లొ  జరిగిన విషయాలే  మనకు బ్రతుకు నేర్పిన పాఠాలే అనిపించి  మనకు బాధ కలిగించిన అంశాల పట్ల, వ్యవస్థ  పట్ల, వ్యక్తుల పట్ల, ద్వేషాన్ని పెంచుకుంటాం  లేదా అభిమానం పెంచుకుంటాం. Our reality is different from The reality.  మనం చూసిందే జీవితం కాదు.  ఈ సినిమా లొ జూనియర్ ఎన్టీయార్  పోలీస్ ఆఫీసర్ అయితే డబ్బు సంపాదించవచ్చు  జులుము చేయవచ్చు   అధికారం వినియోగించుకోవడం , తెలివిగా  ఎదుటివారిని బురిడీ కొట్టించడం  అదే జీవితం అనుకుంటాడు. అంతే  కాక అదేదో పెద్ద గొప్ప విషయం అనుకుంటూ తనకు తగ్గ లాజిక్  లొ ఉంటాడు. విలువలు గురించి మాట్లాడటం  తేడా గాళ్ళ పని అనే భావన లొ ఉంటాడు. వచ్చిన చిక్కల్లా  అటో ఉండలేక ఇటూ ఉండలేక మధ్యస్తంగా నలిగే వాళ్ళ వల్లే అనుకుంటూ ఉంటాడు. 
2. ప్రేమ మార్పుకు పునాది : ఆకర్షణ  వలన అయితే గాని  క్రాసింగ్ కు వచ్చిన వయస్సు వాళ్ళ అయితే గాని  హీరోయిన్ కు దగ్గరవుతాడు. అదీ ఒక వినోదం కోసం అన్నట్టుగానే .. అందుకే నా మ్యూజిక్ సిస్టం  అని పిలుచుకుంటాడు. మన ఇంట్లో మ్యూజిక్ సిస్టం మనకు ఒక వినోదసాధనం ఎలా ఉంటుందో అలాగా.   కాని  ఆమెకు వేరొ ఎవరితో పెళ్లి జరగబోతుందని తెలిస్తే  విపరీతమైన ఉద్వేగానికి లోనవుతాడు. మనలాంటి వాళ్లకి ఏమిటీ ఈ  ఓవర్ ఏక్షన్ అనిపించేటట్టు.  గాలికి పెరిగినవాడికి  నా అనే వ్యక్తి  దగ్గరై  ఒక్కసారి దూరమౌతుంటే  అలాగే  ఉంటుంది.  ఏదో మాయ చేసి తనకు దగ్గరౌతుంటాడు. వాడిని కూడా తన అడ్డుగా తొలగించుకుంటాడు . కాని ఒక్కసారి  హీరోయిన్ కిడ్నాప్ కి గురయ్యేసరికి. తన అనుకున్న వ్యక్తిని కోల్పోతున్నపుడు  తనలో అంతర్మథనం    ప్రారంభమవుతుంది. ఇంత వరకు సినిమా కొంత వరకు స్లో గా వెళుతుంది. తనను కాపాడుకున్నప్పటికీ  తనలా మరో వ్యక్తి  ప్రమాదం లొ ఉంది ఆ వ్యక్తిని  కాపాడమని హీరోయిన్ చెప్తే  తనకోసం  ఇంతవరకు ఎవరితో అయితే కలిసి వెధవ పనులు చేస్తూ వచ్చాడో  వారికే ఎదురు తిరగాల్సి వస్తుంది.   ప్రేమ కోసం, ప్రియురాలకిచ్చిన మాట కోసం  సరియైన మార్గం లొ రాడానికి నాంది ఏర్పడుతుంది. 
3. ప్రతి ఒక్కడికీ ఇగో ఉండాలి అది వై ఫై లా చుట్టూ ఉండాలి. ఎందుకంటే మనల్ని మన నుంచి కాపాడేది అదే:    ప్రతీ వ్యక్తి కి ఇగో ఉండాలి.  ఉంటుంది. కాని అది ఏ  మూలో పడి ఉంటుంది. అర్భకుల ముందు, బలహీనుల ముందు బయట పడుతుంది. నీ ఆత్మ గౌరవానికి,  ఆత్మ విశ్వాసానికి,   నీ ప్రయోజనాలకు, నిన్ను నమ్ముకున్నవారికి  ఇబ్బంది కలిగిస్తున్నవాడు ఎవడైనా  తెగేసి ఎదురొడ్డగలిగే  నిజమైన  ఆత్మ గౌరవమే ఇగో.దానిని   టెంపర్ అనుకుంటారా ? అనుకోండి  అది మన చుట్టూ ఉండాలి. ఆ గిరిని దాటి లోనికి ఎవడొచ్చినా   ఎదిరించాలి.  ఆ సత్తా ఎవడికి ఉంటుందో  వాడే  ఇగో ఉందని ఫీల్ అవ్వాలి..  లేకపోతె అన్నీ మూసుకొని కుక్కిన పేనులా జీవించాలి.  హీరోయిన్ ని   ప్రకాష్ రాజ్ నుండి కాపాడుకునే క్రమం లో  నేను వేసే బిస్కెట్ లు  తినేవాడివి అంటూ  ప్రకాష్ రాజ్ అన్న సంభాషణలు   తన ఇగో ని దెబ్బతీస్తాయి.  ఎదురుతిరగడం మొదలయ్యాక   ఎవడైనా ఒకటే.......
4. Being Trusted is more than Being Loved: ప్రేమించబడటం కన్నా  విశ్వసించబడటం  గొప్ప.  హీరోయిన్ తో ప్రేమ  తనలో మార్పుకు నాంది పలికితే,   ఎప్పుడైతే  ప్రకాష్ రాజ్ సోదరుల చేతిలో  చిత్రహింసలతో హత్యకు  గురైన  అమ్మాయి సోదరి ని కాపాడటం,  ఆ అమ్మాయి దగ్గర నుండి సి డి ని  సంపాదించే క్రమంలో వారి విశ్వాసం పొందుతాడు.  జీవితం లొ మొట్ట మొదటిసారిగా   అన్నయ్యా అంటూ ఆ అమ్మాయి పిలిచి తన మీద పెంచుకున్న విశ్వాసాన్ని  ప్రకటించడం తో   తనలో   నిజమైన అంతర్మథనం  ప్రారంభమవుతుంది.  పశ్చాతాపం తనని  దహించడం మొదలవుతుంది.
5. మన అంతరాత్మ నిత్యం మనల్ని పరిశీలిస్తుంటుంది  ప్రశ్నిస్తూనే ఉంటుంది: మనం  చేస్తున్న పనులు  ఎంత వరకు సరైనవి మనం చేస్తున్న తప్పులేంటి అంటూ మన అంతరాత్మ  నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది.  నీతి  నిజాయితీలు ఊపిరిగా  బ్రతికే  హెడ్ కానిస్టేబుల్ మూర్తి కావొచ్చు . సమాజం లొ అంగీకరించబడిన  ధర్మాలు,  నియమాలు కావొచ్చు. మనం నమ్మిన మతం లొ చెప్పబడిన సూత్రాలు  కావొచ్చు.  కాని మన అహంకారం వలన గాని అజ్ఞానం వలన గాని వాటిని పట్టించుకోము.  ఇతరుల  ఆస్తుల్ని, గుడులను గోపురాలను ఆఖరుకి బలహీనుల భూముల్ని  కూడా దౌర్జన్యంతో స్వార్థంతో  ఆక్రమిచుకునే  కుహనా నాయకులికి తెలీదా తాము చేస్తుంది తప్పో  ఒప్పో .. తెలుస్తుంది కాని .. ఎదో ఒక  లాజిక్కు తో  లేదా చంచాల్లా అంటి  పెట్టుకొని   తిరిగే  మాడా గాళ్ళ మాటల్లోపడి  ముందుకు పోతుంటారు.  ఈ సినిమా లొ   హీరో అంతరాత్మకి ప్రతిబింబం లా  నిత్యం తనని అంటిపెట్టుకొని తిరిగే కానిస్టేబుల్ మూర్తి ( పోసాని ) నిజాయితీ   ఎన్టీయార్ కి ఒక అద్దం లా తన తప్పుల్ని  ఎత్తి  చూపుతుంది.  సత్సంగత్వ ప్రభావం  మనలో ప్రాయశ్చత్వం  కలగటానికి  తొలి అడుగు. 
6. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చితం లేదు. ప్రతి మనిషిలో  తన తప్పుల్ని సరి దిద్దుకునే అవకాశాన్ని జీవితం ఇస్తుంది  అది ఒక సునామీ లా వస్తుందో  సైలెంట్ గా వస్తుందో  మన అదృష్టం  మీద ఆధారపడి ఉంటుంది. పశ్చాతాపం అనే అగ్ని లొ మన అహంకారం  ఇగో అన్నీ   సమూలంగా కాలి బూడిదవుతాయి.  " మీ అమ్మ మిమ్మల్ని కనడానికి ఎంత బాధ పడిందో తెలీదు కాని  మీనుండి  మీరు పుట్టడానికి ఎన్ని చంకలు నాకుతున్నారు సార్"  అనే డైలాగ్  కొంత మాస్ గా ఉన్న  చాలా లోతైన మాట అది.  నిజాయితీ గా ఉండటం వలన  కలిగే ఆనందాన్ని  అది తెచ్చే   మానాలని మర్యాదల్ని రుచి చూసినవాడు వెనుతిరిగి చూడడు. మొట్ట మొదటిసారిగా  పోసాని కృష్ణ మురళి లేచి నిలబడి సెల్యూట్  చేయడం .  తన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెడతాడు.  పశ్చతాపాన్ని   భరించే దాని వలన ఒత్తిడిని బాధని  తట్టుకోవడం ఎవరి వల్లా   కాదు.  దానిని  పంచుకునేందుకు  నా అనేవాళ్ళను సంపాదించుకుంటాం.  ఏ     తోటా వెంకట రావు   ఉరఫ్  తలారి వెంకటరావు  ఆస్తి ని పోగొట్టుకోడానికి  తాను కూడా కారణమయ్యాడో  అతని  దగ్గరికెళ్ళి   కొడుకు తప్పుచేస్తుంటే   చూస్తూ ఊరుకున్నారేమి నాన్నా  దండించండి   అంటూ  ఒక బంధాన్ని ఏర్పరుచుకొని  తన తప్పులు కడుగుకుంటాడు.  అంతే  కాక  ఒక కుటుంబం తనపై  పెట్టుకున్న  విశ్వాసాన్ని నిలబెట్టుకోడానికి ,  ఒక నిజం ఓడిపోకుండా ఉండటానికి,    ఒక దౌర్జన్యం గెలవకుండా ఉండటానికి   తనను తానూ ఆహుతి చేసుకోడానికి   సిద్ధపడతాడు.  జీవితం నేర్పిన     చేదు పాఠాన్ని  ఇష్టంగా స్వీకరిస్తాడు. 
7. స్వీయ సంస్కరణ  పాటి ఒక్కరి భాద్యత  :  తప్పు చేసాం   అని  గ్రహిస్తే  చాలదు. ఆ తప్పుని సరిదిద్దుకొనే  ప్రయత్నం చేయాలి.  జార్జి బెర్నార్డ్ షా  ఒక మాట అంటాడు . నేను జీవితంలో  చాలా తప్పుల్ని చేసాను.  కాని పాత వాటిని మాత్రం కాదు.... I have done so many mistakes in my life but not the same.  ఈ  సినిమాలో  భాస్కరభట్ల  రవికుమార్ గారు  రాసిన పాట  ఉంటుంది. తన తప్పుల పట్ల పశ్చాతాపం పడుతూ..  వాటిని మరలా  సరిదిద్దుకుని తనను తానూ రిపేరు  చేసుకునే అవకాశం ఇవ్వమని.  ఆ అవకాశం తానే  తీసుకుంటాడు. కాబట్టి  అనుభావాలనుంది జీవిత సారాన్ని తెలుసుకొని స్వీయ సంస్కరణ  కు శ్రీకారం  చుట్టడం ప్రతి ఒక్కరి కనీస భాద్యత. 

              ఈ సినిమా రిలీజై  ఇన్ని రోజులయ్యాక  ఇప్పుడు ఈ రీవ్యూ ఎందుకంటారా ?    ఎందుకంటే మీరు  మొదటిసారి  ఒక సినిమా లా దీన్ని చూసి ఉంటారు   మరలా  ఇంకో సారి చూడండి.   అహం తోనో,    అజ్ఞానం తోనో  మనం చేసే తప్పుల్ని ,  ఎంచుకున్న  తప్పుడు మార్గాలని,   కలిసి తిరిగే  చెడు స్నేహాల్ని,    కొంచెమైనా   మార్చాలనే  ఆలోచన పుడుతుంది.  
    జీవితం ఎవరినీ  విడిచి పెట్టదు . అందరి సరదా తీరుస్తుంది...   అయినా మారుతాననే గ్యారంటీ లేదంటారా ?????   సరే   చూద్దాం..  ఎవరి దురద ఎలా తీరుతుందో!!!!!!!!!!!!!!
అభినందనలతో
మీ 
అలజంగి ఉదయ కుమార్     
trainerudaykumar@gmail.com

Just received a mail from Puri Jagannath sir  for this writeup


Puri Jagan

7:48 AM (1 hour ago)
to me
Thank u Uday
U always support my thoughts

PURIJAGAN 


2 comments:

  1. Uday,
    I am very happy to read the above. After seeing your review I am keen to see the movie. Please use your creativity to review like this which is pleasant to read. Keep up the good work==Swamy Narayana from USA

    ReplyDelete