Friday 16 January 2015

సృజనాత్మకత కు నిలువెత్తు దృశ్య కావ్యం శంకర్ సార్ సినిమా ' ఐ '


   
   తాజ్  మహల్  చూడటానికి వెళ్తాం ....ఇంటి దగ్గర  బయలు దేరినప్పటి నుండి  మరలా ఇంటికి చేరినంత వరకు  మొత్తం ప్రయాణం  అంతా  సంతోషంగా ఉండక పోవచ్చు.   కొన్ని అద్భుత సంఘటనలు ఉండొచ్చు.  కొన్ని చోట్ల  కొన్ని సార్లు మంచి హోటల్,   మంచి  భోజనం దొరకక పోవచ్చును.  తాజ్  మహల్ దగ్గరకు వెళ్ళారు.  ఆ రోజు  పౌర్ణమి ..నిండు వెన్నెల .. అలా మైమరచి పోతుండగా   మీ చిన్ననాటి ప్రేయసి అనుకోకుండా అక్కడ కలిస్తే..  ఇద్దరూ కొంత సేపు   ఆ తాజమహల్ బ్యాక్ గ్రౌండ్  లొ  మాట్లాడుకుంటూ  ఆ పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే ....  మరలా  గుడ్ బై  చెప్పుకొని ఎవరి ఫ్యామలీ  తో వారు  వెనక్కి వస్తే....  మరలా దారిలో అక్కడక్కడా   చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే    .....  ఇంటికి చేరుకున్న తరువాత..   ప్రయాణం ఎలా జరిగింది   అని మీకు మీరు  అనుకుంటే ఏం  చెబుతారు...   ఎదవ ప్రయాణం    అక్కడక్కడ భోజనం బాగో లేదు..   ఏముంది తాజ్ మహల్  లొ  ...  ఎదవ   సంత  తో వెళ్ళా ..  ప్రయాణం లొ రకరకాల ఇబ్బందులు పడ్డా   అని చెబుతారా.....అలా చెప్ప  గలిగితే.....మీ సృజనాత్మకతకు.......  కవితాత్మకతకు జోహార్.......

అలాగే తిరుపతి వెళ్తాం... ప్రయాణం లొ ఇబ్బంది..   మెట్లు ఎక్కి వెళ్ళారు....  లైన్లలో గంటల కొద్దీ ఉన్నారు.  దర్శనం స్వామి ని చాలా దగ్గర నుండి చూసారు.. స్వామి  ప్రత్యెక పూజల్లో  స్వామి విగ్రహం ముందు అరగంట ఉండే అవకాశం వచ్చింది...  తిరిగివస్తుండగా  మీ పాత బట్టలు  ఉన్న  బ్యాగ్  పోయింది.   ట్రైన్  కొంచెం ఆలస్యమయింది.   మొత్తానికి ఇంటికి చేరుకున్నారు.   మొత్తం   యాత్ర  ఎలా జరిగింది అంటే  ఏమి చెబుతారు...    పోయిన బ్యాగ్  గురించి చెబుతారా.....   మెట్లు ఎక్కినా అలసట గురించి చెబుతారా  లేదా  అరగంటకు పైగా స్వామి సన్నిధి లొ ఒళ్ళు పులకరించేలా  గడిపిన మధుర క్షణాల  గురించి చెబుతారా......    మీ భక్తీ కి  అనురక్తి కి జోహార్........

కోడి గుడ్డు మీద ........... పీకే  పని  ధ్యేయంగా  ఉన్నవాళ్ళ   ఆలోచన మీకు అనవసరం...  హాలీవుడ్ సినిమాల్లో సగానికి సగం  డైలాగ్ లు  వినబడవు... వినబడినదాంట్లో   చాలా మటుకు  అర్థం కావు....   ఏ   లాజిక్  కి అందని  మర మనుష్యులు.  వికృత రూపాలు...   సినిమా ఎప్పుడు మొదలయిందో  ఎప్పుడు ముగిసిందో  తెలుసుకొనే సరికి   అంతా   బయటకు వచ్చేస్తుంటారు.  చాలా మంది అబ్బా   ఏమి టెక్నాలజీ  హబ్బా   ఏమి  గ్రాఫిక్స్.  హబ్బబ్బా   ఏమి స్క్రీన్ ప్లే   అబ్బా అబ్బా   అబ్బా   అంటూ   చంకలు గుద్దుకొని వచ్చేస్తుంటారు......

అదే  మన వాళ్ళు  సాహసించి వందల కోట్లు ఖర్చు పెట్టి  రాత్రనక పగలనక ఒళ్ళు హూనం చేసుకొని  శక్తికి మించి  సినిమాని ఒక కళాఖండం గా తీస్తే .. శంకర్  మేజిక్   అయిపొయింది..  శంకర్    వాడిని వదులుకోవడం  తప్పు. వీడితో చేస్తే బాగుండును..  పాత కథే..  భైరవద్వీపం లా  మన బాలకృష్ణ   ఇంకా ఇరగ దీసాడు......అంటూ  సన్నాయి నొక్కులు నొక్కడమే కాకుండా ఫేస్ బుక్ వాల్ మీద  వెధవరాతలు  రీవ్యూ లు రాసేస్తారు...
అసలు ఏమి చేస్తే   వీళ్ళు బాగుపడతారు....  వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొల్లు కబుర్లు చెప్పి  షార్ట్  ఫిలిం కి ఎక్కువ  డాక్యు మెంటరీ  కి  తక్కువ లాంటి సినిమా తీసి  వాళ్ళు    సినిమాయే మా జీవితం.  సృజనాత్మకత కోసం జీవిస్తున్నాం   అని ప్రగల్భాలు పలుకుతూ  పెద్ద పెద్ద సినిమాలని   విమర్శించడం  ద్వారా   కొంచెం  పాపులారిటీ  పెంచుకుందాం  అని ఆలోచించేవాళ్ళు   శంకర్  గారి సినిమా    ని విమర్శిస్తుంటే    చాలా బాధ అనిపిస్తుంది.

సినిమాని చూడటానికి  ప్రేక్షకులని థియేటర్ కు రప్పించడం చాలా కష్టం.   పనికిమాలిన రీవ్యూ లు  రాయడం వలన ఒక గొప్ప  కళాకారుడి  కృషి ని   పాత్రకోసం చేసిన త్యాగాలని తపస్సుని   చాలా మంది  మిస్   అవుతారు..   అప్పుడెప్పుడో చదివాం  విన్నాం. దేవదాసు సినిమాకి  అక్కినేని  నాగేశ్వర రావు గారు ఉపవాసాలు  చేసారని..  రాముడు కృష్ణుడు   పాత్ర వేసినప్పుడు  నందమూరి రామారావు గారు  చాలా నిష్టగా  ఉండేవారని.. మరి మన కళ్ళముందు    ఈ   ఐ   సినిమా కోసం  విక్రం పడిన పాట్లు   ఒక భారతీయ నటుడి  నట విశ్వరూపం    తప్పని సరిగా సినిమా చూసే అవకాశం  మరియు  అలవాటు ఉన్న ప్రతి  ఒక్కడూ చూడాల్సిందే...

ఒక  అద్భుత  దృశ్య  కావ్యాన్ని చూడటానికి   సరస హృదయం కావాలి.. రసజ్ఞత ఉండాలి... రస స్వాదన చేసే  స్పందించే హృదయం  ఉండాలి....   ఇవి లేక పోయిన పర్వాలేదు....   చందమామ పై   మచ్చను మాత్రం  చూసే నిరాశావాద  గుణం,     బడి గోడ   మీద  గుడి గోడ మీద  కుక్క  మూడు కాళ్ళపై నిలబడి .......   పోసే   తుచ్చ  గుణం   మాత్రం  ఉండగూడదు....... 

ఈ సినిమా లొ  విమర్శించడానికి  ఏమైనా ఉందంటే  అది   ఐదు  నుండి పడి శాతం  లోపే.. 
 ఒకటి  నిడివి  ఎక్కువ అవడం. 
  క్లైమాక్స్  సాగ దీయటం..   
 చివర్లలో  బ్యాచలర్  పార్టీ లొ విల్సన్ల తో   సంబాషణలలొ  పస తగ్గటం. 
  అనవసరమైన  అర్థం  లేని ట్రైన్ ఫైటింగ్ 
    చివరి అరగంట ఓ స్పీడ్  తగ్గటం  అంతే...........


.మెచ్చుకోవలసినవి  వందలకొద్దీ ఉన్నాయి......    

ఒకే వ్యక్తి  వివిధ రకాలుగా శరీరాకృతి ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకోవడం.......
కళ్ళు చెదిరే  అందమైన   దృశ్యాలను చూపించిన అద్భుత ఫోటోగ్రాఫర్  పనితనం.......
చైనా లోకేషన్స్ లొ  తీసిన వివిధ  సన్నివేశాలు  అందునా   ఇంటర్ వెల్  ముందు ఫైటింగ్ దృశ్యాలు.......
వివిధ కారణాలుగా తనకు తెలియకుండా శత్రువులు ను పెంచుకొని వారి చేతుల్లో తన కెరీర్  ప్రేమ కోల్పోవడం............కథ లొ భాగంగా వీటన్నింటిని  మిళితం చేసి చూపించడం....

ఇవన్నీ  ఒక ఎత్తు   షేక్ స్పియర్   తన సోనేట్    ట్రూ లవ్  లొ   నిజమైన  ప్రేమ  అంటే బాహ్య మైన  అందానికి  ప్రాధాన్యత  ఇవ్వదని  కాలానికి అది  మార్పు కాదని చెప్పాడు..
   ఈ  సినిమా లొ  హీరోయిన్   వ్యక్తిత్వాన్ని  అద్భుతంగా   చూపించారు  శంకర్  సార్....    అవసరం కోసం  ప్రేమ ఒక సాకుగా  వాడుకోకూడదని...  ఒక  వ్యక్తి  పై  ప్రేమ ఏర్పడితే   ఆ వ్యక్తీ కి   ఏ రకమైన  సమస్యలు వచ్చినా   తోడుగా నీడగా ఉండాలని...   అతను కోలుకునేందుకు  అండగా ఉండాలని.....    ప్రేమించిన వ్యక్తి   కలను సాకారం చేసేందుకు   జీవితాన్నే అంకితం చేయాలని తపించే నిజమైన ప్రేయసిగా    హీరోయిన్  వ్యక్తిత్వాన్ని   చూపించారు.........   అవకాశాల కోసం   వ్యక్తిత్వాన్ని  అమ్ముకోకూడదని,, సమస్య పెట్టినవారికే సమస్య ను కల్పించాలని   హీరోయిన్  ద్వారా    చెప్పించారు...
ఇంకా రాయమంటే   వంద పేజీలు  రాస్తా........ఈ సినిమా గురించి  ......అది కాదు  ముఖ్యం..  వందల కోట్లు పెట్టి  భారతీయ ప్రేక్షకులు    సహృదయం ఉన్నవాళ్ళు...... సృజనాత్మకత కు  పెద్ద పీట  వేస్తారు....  సొల్లు రాతలు నమ్మరు  అనే ధైర్యం తో శంకర్  సార్   ఈ సినిమా తీసారు    ఈ   సినిమాను    చూడండి..   థియేటర్  లోనే   చూడండి...   సినిమా రంగం పై  ఆశలు పెట్టుకొని అనేక మంది జీవిస్తున్నారు..    పనికిమాలిన అభిప్రాయాలతో  గొప్ప మధురానుభూతి   కోల్పోవద్దు.......

అతి సాధారణ ప్రేక్షకులమైన మాకు  స్పీల్  బర్గ్  తెలీదు... హిచ్ కాక్  ఎవరో తెలీదు...  సగటు ప్రేక్షకులకు కోట్లు ఖర్చుబట్టి  సాహసం  చేసి   గుండె ధైర్యం తో  అద్భుత అనుభూతి కల్పించి  నిజమైన ప్రేమకు నిలువెత్తు రూపంగా  ఈ సినిమాను మలిచిన    శంకర్ గారికి ఆయన అంచనాలకు అనుగుణం గా ఒళ్ళు హూనం చేసుకొని నటించిన విక్రం  కళాభిరుచి  కి అంకిత భావానికి    శిరస్సు వంచి పాదాభివందనం  చేస్తున్నాను.

అంతా చదివిన   తరువాత  నన్ను తిట్టుకోవాలని అనిపిస్తే.......  తిట్టుకోండి..  రాజ్యాంగం లొ  19 వ ప్రకరణ  భావ ప్రకటనా  స్వాతంత్రాన్ని ఇచ్చింది...  కాని   అధ్బుత రసమయ దృశ్య కావ్యాన్ని ,    కళను నమ్ముకున్న అవిరళ కృషిని  అనవసరంగా   విమర్శించి  అభాసుపాలు కావద్దు.......    ఎందుకంటే    శ్రమ ఏవ జయతే......

wish you all the best
A. Uday Kumar

trainerudaykumar@gmail.com

7 comments:

  1. Excelent Gaa Cheppav Boss Hatsup

    ReplyDelete
  2. మీరు వ్రాసిందంతా కరక్టే. ఒప్పుకున్నాను. కానీ ఏ కళారూపమయినా భావ ప్రాప్తి కలిగించాలి కదా.అది కలగాలంటే పాత్రల బాధ కానీ ఆనందం కానీ ప్రేక్షకుడికి తెలియాలి కదా. కధన లోపం వలన దర్శకుడు అక్కడ విఫలమయ్యాడు.

    ReplyDelete
    Replies
    1. అవును ఫ్రిజిడిటీ ఉంటె భావప్రాప్తి కలగదు..... నూటికి తొంభై సంసారాల్లో భావప్రాప్తి లేదని గణాంకాలు చెబుతున్నాయి...

      Delete
  3. :-) :-) :-) అవతార్,టైటానిక్ కన్నా బాగుందండీ సినిమా..చిన్న చిన్న లోపాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.విక్రమ్ పాత్రలో జీవించేసాడు.. సినిమాలో లింగేశ్వర్ తప్ప ఇంక ఎవరూ కనిపించరు.కొన్ని చోట్ల మాత్రం చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోయారేమో..ఫస్ట్ హాఫ్ ఇంకొద్దిగా బాగా తీసి ఉండొచ్చేమో అనిపించింది. నాకైతే నచ్చింది. డాక్టరే విలన్ అని మొదటి నించీ తెలిసిపోతునే ఉంది. అక్కడ ఇంకొద్దిగా సస్పెన్స్ చూపిస్తే బావుండేది అనిపించింది. అందం మానసికమైనది అనే భావాన్ని చివర్లో చక్కగా చెప్పారు.ఆమె కళ్ళతో చూస్తే అతను కురూపి కాదు. చూసే వాళ్ళ కళ్ళను బట్టి భావం అర్థమవుతుంది.

    ReplyDelete
  4. విమర్శ చాల తేలిక కదా అన్నయ్య ... అందుకే మనం విమర్శ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము
    పోనీ ఆ చెప్పేది అయినా ఒక్క మాట బావుంది ... పర్లేదు ... సో ... సో గా ఉంది అని అయినా చెప్పరు .
    స్క్రీన్ ప్లే అని మొదలు పెడతారు ... రీ రికార్డింగ్ ... అంటూ... సన్నాయి నొక్కులు నొక్కుతారు ... ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఈ సీన్ తీసుకున్నారు ... ఇది ఇక్కడినుంచి అంటూ వారి ప్రతిభ మొత్తం చూపాలనే ఆరాటం ఆ ఆరాటం ఒక వర్క్ చేయడంలోనో ఒకటి create చేయడంలోనో కాదు ...
    మనకి ఉన్నవాళ్లు ఎక్కువ మంది క్రియేటివ్ క్రిటిక్స్ అది మన దురదృష్టం ...

    మీ పోస్ట్ చదివి ఒక్కరు అయినా బహిరంగంగా విమర్శ మానేస్తే బాగుంటుంది ...

    ReplyDelete
  5. మీ పోస్ట్ చదివి ఒక్కరు అయినా బహిరంగంగా విమర్శ మానేస్తే బాగుంటుంది ...
    What don't you kallurisailabala??

    ReplyDelete