Sunday, 1 December 2013

జీవిత పాఠాలు తెలిపే కవితలు - :"If - by Rudayard Kipling"


  మీరంతా  " హ్యాపీ డేస్ " సినిమా చూసారా? అందులో ఒక కథానాయకుడు  నిఖిల్  ఇంగ్లీష్ మేడమ్ వెనుక పడతాడు. ఆమే  ఆ అబ్బాయికి  ఒక ఇంగ్లీష్  Poem   ఇచ్చి  నేర్చుకొని రమ్మంటుంది.  ఆ కవిత ఏమిటో?  ఆ కవిత ద్వారా ప్రతీ యువకుడు తెలుసు కోవలసిన జీవిత  పాఠాలేమిటో తెలుసుకుంటే అనేక మందికి ఉపయోగ పడుతుందేమో....   నేను డిగ్రీ  సెకెండియర్  లో  ఉన్నప్పుడు  మాకు ఈ Poem   ఉండేది. సారాంశం బట్టీ పట్టడమే తప్ప  అర్థం చేసుకోడానికి అంతగా ప్రయత్నించలేదు.
  జంగిల్ బుక్  ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన రుడ్ యార్డ్ కింపింగ్  1895 లో  ఈ Poem   వ్రాసాడు. 1910 లో ముద్రించబడింది.  ఒక తండ్రి  తన కుమారుడికి  ఎలా జీవించాలో?  దాని వలన  వాడికి కలిగే ఫలితమేమిటో  ఈ  Poem   తెలియచేస్తుంది. ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలో, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో దీనిలో చెప్పబడింది.

ముందుగా  ఈ  Poem   ఏమిటో చూద్దాం.....
Ist Stanza 


IF you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don't deal in lies,
Or being hated, don't give way to hating,
And yet don't look too good, nor talk too wise:


తెలుసుకోవలసిన జీవిత పాఠాలుః    

1.  ఆత్మ విశ్వాసం - నమ్మకం;  ఇతరులకు నీ మీద నమ్మకం ఉండవచ్చు లేకపోవచ్చు లేదా నీలోనే లోపాలున్నాయని నిన్ను నిందించవచ్చు. నీ మీద ఇతరులకున్న నమ్మకం విశ్వాసం సడలిపోతుండవచ్చు.  కాని  ఎటువంటి పరిస్థితుల్లో నీ మీద నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు.  అసత్యాలతో, ద్వేషం తో నీపై ఇతరులు నిందించవచ్హు. ఎటువంటి పరిస్థుతుల్లో సహనాన్ని విడిచిపెట్టకుండా, అసహనానికి లోనుకాకుండా, నీలో ద్వేషానికి  చోటు ఇవ్వకుండా ఉండగలగాలి. అతి మంచివాడిగా కనబడవద్దు, అతి తెలివితేటలతో మాట్లాడవద్దు. 


II  nd Stanza  

 If you can dream - and not make dreams your master;
If you can think - and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build 'em up with worn-out tools: 


2. చెదరని సంకల్పం;   జీవితం గురించి కలలు  కను.  కాని కలల బేహారిగా  విహరించకు. ఆలోచించి పనులు చెయ్. కాని ఒట్టి ఆలొచనలతో  వాస్తవాలకు దూరంగా జీవించకు. 
ఓటమికి కృంగిపోవడం,  విజయానికి  ఉప్పోంగి పోవడం కాకుండా విజయాన్ని కాని  ఓటమిని గాని సమభావంతో స్వీకరించే తత్వాన్ని అలవరచుకో, నీవు పలికిన సత్యాలకు వక్రభాష్యాలు చేర్చి నిన్ను అందులో బలి చేసే  ఇతరుల  పన్నాగాలకు బలికాకు. జీవితాన్నే ఫణంగా పెట్టి సాధించిన విజయ సౌధాలు ఒక్కసారి కూలినా, ఆ శిధిలాల శకలాలతో నూతన విజయాలకు నాంది పలుకు . 

III  rd Stanza  
 
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: 'Hold on!'
3. ఓటమికి నిరాశ చెందకు;   ఓటమి అంటే ఉండే భయం   ఏ పని చేయడానికి  ముందడుగు వేయనీయదు. నీవు సాధించిన అన్ని విజయాలు  పెట్టుబడిగా పెట్టి, అవి పోయినా ఫర్వాలేదు  మొదలు నుండి మరలా జీవితం మొదలుపెట్టగలను అనే తెగువతో సాహస నిర్ణయాలు  తీసుకో. నీ ఓటమి గురించి ఎవరి వద్ద చర్చించకుండా ఓటమిని  మనసుకు పట్టించుకోకుండా సర్వం కోల్పోయినా సంకల్ప బలం తో నిగ్రహించుకుంటూ జీవించు.

IV th  Stanza 
 
If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings - nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds' worth of distance run,
Yours is the Earth and everything that's in it,
And - which is more - you'll be a Man, my son!


4. విలువల ప్రాతిపదిక  తో  జీవించు;   అతి  సాధారణ  జనాలతో  జీవిస్తున్నప్పటికీ   నీవైన విలువలను ఎన్నడూ  విడిచిపెట్టకు.   అలా అని గొప్పవారి తో స్నేహం చేసినప్పటికీ సాధారణ
ప్రజలతో  సంబంధాలను విడిచిపెట్టకు. నీ అగర్భ శతృవులైన, నీ గాఢ స్నేహితులైన నిన్నెప్పుడూ బాధపెట్టకలిగే  స్థితి కలిగించకు.  అందరితో కలిసి  ఉన్నప్పటికీ  నీ హద్దుల్లో నీవుండు.  నిమిషం లో  ఉండే ప్రతి  సెకెన్  విలువైనదిగా ఉపయోగించు. కాలం విలువైనదని గుర్తించు.  
        ఇలా నీవుండ గలిగితే నీకు కావల్సినవన్నీ కలిగియున్న నీదైన  ప్రపంచాన్ని పొందగలవు. మనిషి గా సంపూర్ణంగా తయారవ్వగలవు.
                              షుమారు వంద కు పైగా సంవత్సరాల క్రింద  కిప్లింగ్  చెప్పిన జీవిత పాఠాలతో కూడిన ఈ  Poem   ఈ నాటికి ఆచరణ యోగ్యం.  నాయకత్వ లక్షణాలకు ఒక కరదీపిక.  మన మనస్తత్వాల మార్పుకు, వ్యక్తిత్వాల నిర్మాణాలకు ఉపయోగమైన దీనిని ఆచరించగలమని నమ్ముతూ
trainerudaykumar@gmail.com  

2 comments: