Tuesday 22 October 2013

SAVE PAWANISM


ఇదంతా కేవలం కల్పనలే కదా
ఏదో నాలుగు మాటలు ఫొగేసి
కాలం గడపటానికి
చేస్తున్న అవాస్తవ ప్రచారాలే కదా
విరిసిన మల్లెపూవులాంటి నీవు 
ఈ బురదలో దొర్లాలనుకుంటున్నావా?
ఎత్తైన శిఖరం లాంటి నీ వ్యక్తిత్వాన్ని
మరగుజ్జులతో కలిసి
మంటపెట్టాలనుకుంటున్నావా?
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత భాధ్యత ఉండాలని,  
సమాజంలో జీవించే అందరికీ 
సామాజిక భాధ్యత ఉండాలని
నీవు బల్ల గుద్ది చెబుతుంటే
పనీ పాటా లేకుండా
పైలా పచ్చీసుగా తిరుగుతున్న 
ఈ యువతరానికి
తమకే లక్ష్యం లేకుండా గమ్యమేదో, గమనమేదో తెలీక
గంగిరెద్దుల్లా, డూడూ బసవన్నల్లా   
బుర్రలూపుతున్న  
ఈ నవతరానికీ 
వేగుచుక్కలా, నవ చైతన్య దీపికలా
నీవు నిలబడతావని
కోటి ఆశలతో, క్రొంగొత్త కోరికలతో
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్న 
మాకు శరాఘాతం లా 
ఈ వార్తా కథనాలు ఏమిటి?
ఇదంతా ఒక అభూత కల్పన అయితే ఎంతబాగుణ్ణు
నీవు నిత్యం చదివే తత్వ శాస్త్రాలు
పాలు కు తేనెలా నీతో కలిసిన 
మాటల మాంత్రికుడు
నీ గురించి తెలుసుకునేందుకు 
నిత్యం నీవు చేసే ఆలోచనాలోచనలు
నీకు  ఈ బురదలో పడి దొర్లాలన్న
అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తాయని
గుంపులో ఓ గోవిందయ్యలా, సంతలో సీతయ్యలా
నీవు నిలిచిపోకూడదని
వ్యక్తిగత సంస్కరణ మనుషుల్లో
వచ్చేవిధం గా ఒక సరిక్రొత్త విప్లవానికి, 
మానసిక పరివర్తనోద్యమానికి 
నీవు శ్రీకారం చుడతావని
ప్రపంచమంతటా పరిమళిస్తున్న 
పవనిజం  వేచిచూస్తుంది
నీవు ఏమి చేయలేకపోయినా పరవాలేదుకాని
నీవు నీలా అయినా నిలిచిపో
ఈ బురద గుంటల్లో మునిగితేలాలనే
కోరికని, అకాంక్షని మొగ్గలోనే తుంచుకో.... 
మలినమంటని ఓ ఆణిముత్యం లా
మా గుండేల్లో మిగిలిపో...
                       .... అలజంగి ఉదయ కుమార్  
                    trainerudaykumar@gmail.com

No comments:

Post a Comment