Monday, 3 October 2011

Don't Worry... Be Happy

Why do we suffer?

మన సమస్యలకి మూల కారణం ఏమిటని మనం సక్రమంగా ఆలోచిస్తే జీవితంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలు మనకు మనం తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ

. అరిషడ్వర్గాలు అని పిలవబడే

కామం ( LUST )
క్రోథం ( ANGER )
లోభం (GREED)
మోహం (DELUSION )
మదం ( DOGMATIC ATTITUDE)
మత్సరం (JEALOUSY)
వీనిలో కామం, క్రోధం సహజ లక్షణాలు వీటిని నియంత్రించుకోవాలి. మిగిలిన వాటిని నిర్మూలించుకోవాలి. దురాశ రాను రాను అధికమవడానికి చాలామంది భార్యయొక్క కోరికలు తీర్చాలి. ఆవిడను సంతోషంగా ఉంచడానికి మిగిలిన బంధువుల ముందు తగ్గకుండా తలదించకుండా ఉండాలంటే నగలు, ఆస్తి సంపాదించాలి. పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడానికి వారికి భారీగా వారసత్వ ఆస్తి సంపాదించి ఇవ్వాలని రేయనక, పగలనకా, సక్రమంగా అంత సంపాదించడం అవదు కాబట్టి కొంగెం అక్రమంగా వక్రమంగా సంపాదిచాలని చెబుతుంటారు. ఈ పరుగుపందెంలో లోభం పెంచుకోవడం. అనవసర వ్యామోహాలు పెంపొందించుకోవడం, సంపాదించే ఇఅతరులను చూసి మత్సరం చూపడం బాగా సంపాదించుకున్నా తర్వాత మదం ఏర్పరుచుకోవడం జరుగుతుంది. ఒకసారి ఈ అరిషడ్వర్గాల చక్రబంధంలో ఇరుక్కుంటే మ్రుత్యుపాశాన్ని ప్రేమించడమే... ఉన్న అరోగ్యం పాడవుతుంది, ఆనందం హరించవేయబడుతుంది. చివరకు జీవితం దుర్భరప్రాయమవుతుంది.
శంకరాఅచాఅర్యులవారు భజగోవిందం శ్లోకాలలో ప్రతి వ్యక్తి అవసరమైన ప్రాధాన్యత కన్నా అధికమైన attachments కలిగి ఉందకూడదని వివరంగా చెప్పారు. అంటే అందరినీ విడిచి సన్యాసించడం కాదు. అవసరమైన దానికన్నా అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎవరికోసమ్ శ్రమిస్తున్నాం. కూడబెడుతున్నామనే ఆత్మవంచన నీ బాధలకు దారితీస్తుంది అని ఈ శ్లోకం చెప్పారు.
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః

(ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.)
ఇదే విషయాన్ని కీ..శే.. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు రాసిన సత్యహరిశ్చంద్ర నాటకంలో శ్మశానంలో కాలుతున్న శవాలను చూసి హరిశ్చంద్రుడి ఇలా ఆలోచిస్తాడు.

మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నాయిల్లా లని నా కుమారుడని ప్రాణంబుండునందాక నెం
తో యల్లాడిన యీ శరీరమిపుందుంగట్టెలం గాలుచో
నా యిల్లలును రాదు పుత్రుడునుదోడైరాడు తప్పింపగన్

పిల్లలకోసం, భార్యకోసం కష్టపడుతున్నమనే దురాశతో భౌతిక విషయాల పట్ల వ్యామోహం పెంచుకోవడం వలన మన మనశ్శాంతి దూర్ం చేసుకొని రోగాలపడటం జరుగుతుంది. ఎంతవరకు ధర్మమో, తన భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే తప్ప అరిషడ్వర్గాల చక్రబంధనంలో ఇరుక్కోరాదు. మనం ఏమి చేసినా బ్రతికున్నంతవరకే.......... భజగోవిందం లో శంకరాచార్యులు మరికొంచెం ముందుకెళ్ళి మన కళ్ళు తెరుచుకునేలా మరో శ్లోకం చెప్పారు..
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ..

శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.
కాబట్టి జీవితం పట్ల కొంత వైరాగ్యం పెంపొందించుకొని Detached Attachment తో జీవించగలిగితే
లేనిపోని చింతలతో మన ఆనందం దూరం చేసుకోవల్సిన అవసరం ఉండదు.
wish you Happy Living
trainerudaykumar@gmail.com
9948992208

3 comments:

  1. Quite correct.
    Everybody has to accept it.

    ReplyDelete
  2. :)

    ఉదయ్ కుమార్ గారు మీ blog & మరి ప్రతి posts చాలా అర్థ వంతముగా విజ్ఞాన దాయకముగా ప్రేరణ నోనగూర్చేడివిగా ఉన్నాయి

    చాలా సంతోషం

    pls continue to give these kind of valuable stuff to us

    ధన్యవాదాలు

    శివ
    ?!

    ReplyDelete
  3. మీ బ్లాగ్ చాలా చాలా బాగుంది సర్. ఇలాగే కొనసాగించండి.

    ReplyDelete