విమర్శలను ఎదుర్కోవడం ఎలా?
ప్రపంచం లో అనేకమంది సతమతమౌతున్న సమస్యల్లో విమర్శించబడటం అనేది చాలా ముఖ్యమైనది. విమర్శకుల బారిన పడకుండా ఉన్న మానవుడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఐనిస్టీన్ అంటారు విమర్శింపడనివాడెవడైనా ఉన్నాడంటే వాడు ఏమీ చేయకుండా ఉన్నవాడైయుంటాడు అని. నలుగురూ నడిచే దారిలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నమ్మి తనకు నచ్చిన దారిలో నడవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఈ విమర్శలు తప్పవు.
విమర్శలకు జడిసి మనసు చంపుకొని తాము చేయాలనుకున్నవి చేయలేక జీవచ్చవాలై జీవించే వారు నూటికి తొంభైకి పైగా ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు
కాని ఒక్కసారి ఇతరులను విమర్శించేవారి మానసిక వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకుంటే వారు తమలో తామే ఎంతటి అసంత్రుప్తితో జీవిస్తున్నారో తెలుసుకుంటే వారి పట్ల కోపం కన్నా జాలి పుట్టి వారికి మంచి మనసు ప్రసాదించమని వారి తరుఫున దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. నమ్మరు కదా ..... సరే మీ కోసమే ........... ఈ ఆర్టికల్......
విమర్శించే వారి మానసిక స్థితిః
* విమర్శించే వారి గతంః సాధారణంగా ఇతరులను అకారణంగా విమర్శించేవారి గతం అనేక బాధలతో కూడి ఉంటుందని మానసిక విశ్లేషికుల అభిప్రాయం. వారి జీవితంలో తరుచూ తల్లిదండ్రుల దూషణలకు, బందు మిత్రుల హేళనలకు గురై యుంటారు.
* విమర్శించే వారు పొగడ్తలకోసం అర్రులు చాస్తూ ఉంటారుః వీరు ఇతరులనుండి పొగడ్తలు ఎక్కువగా ఆశిస్తుంటారు. తమకు సరియైన గుర్తింపులేదని తరుచూ అంతర్గతంగా బాధపడుతుంటారు. తాము చేసిన చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండంతలు చేస్తూ తమ గొప్పలు తరుచూ చెప్పుకుంటూ ఉంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ దిజార్డర్ అనే మానసిక సమస్యతో మధన పడుతుంటారు.
* విమర్శించే వారు మన స్నేహాన్ని, మన ప్రేమను ఎక్కువ మొత్తంలో ఆశించినవాలై యుంటారు. ఎప్పుడైతే మనం వారు ఆశించినంత సన్నిహితంగా మెలగటం లేదో మన ద్రుష్టిని ఆకర్షించేందుకు విమర్శిస్తుంటారు.
* విమర్శించే వారికి భావోద్వేగాలు సమతౌల్యం చేసుకొనే అవకాశం ఉండదుః ప్రతీ వారికి తమ యొక్క కోపాన్ని గాని, భావోద్వేగాలను వ్యక్తపరచేందుకు, సమతౌల్యం చేసుకొనేందుకు ఎదో ఒక వీలు అవకాశం ఉంటుంది. వీటినే EMOTIONAL VENTILATORS ఆంటాం. వీరికి ఈ అవకాశం లేకపోవడాం వలన ఎవరు దొరుకుతారా వారిపై తమ కడుపులో ఉన్న అక్కసు కక్కేద్దామని ఎదురుచూస్తుంటారు. ఎదుటివారి మీద కోపం కన్న తమ కడుపులో కుళ్ళు బయటకు పంపడానికే అకారణం గా విమర్శిస్తుంటారు.
*విమర్శించే వారికి భవిష్యత్ పై ఆశ చాలా తక్కువగా ఉంటుందిః తరుచూ ఇతరులను అకారణంగా విమర్శించే వారికి తమ భవిష్యత్ మీద ఆశ ఉండదు. నిరాశావాదం తో క్రుగిపోతుంటారు. ఇతరులు తమను ఎక్కడ అధిగమిస్తారో అనే భయం తో తరుచూ మధన పడుతుంటారు.
విమర్శించేవారు అతి ఎక్కువ అసూయ, అతి తక్కువ ఆత్మ గౌరవం కలిగియుంటారు. ః ఇతరులను విమర్శించే వారు తమపై తమకు తక్కువ అబ్జిప్రాయం కలిగియుంటారు. తరుచూ మనలాంటి వాళ్ళకి అది సాధ్యమా, మన బ్రతుకులకి అలా వీలవుతుందా అనే మాటలతో మనల్ని కూడా వాళ్ళలాగే దద్దమ్మలగా లెక్క కట్టి మాట్లాడుతుంటారు. ఇతరులమీద అసూయ ఇక్కువ మొత్తంలో కలిగియుంటారు.
విమర్శలను ఎదుర్కోవడం ఎలా?
రాముడులాంటి వాడే విమర్శలను ఎదుర్కోలేక సీతను త్యజించాడని రామాయణంలో చెబుతారు. ఈ సారి మిమ్మల్ని ఇతరులు విమర్శిస్తున్నపుడు వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా వారి బలహీన మానసిక స్థితిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి.
1. మీరు ఏదైనా ఒక పని చేసేటపుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వారు ఆ రంగంలో లేదా ఆ పనిలో అనుభవం ఉన్నవారా? కాదా? ప్రశ్నించుకోండి. ప్రతీ దద్దమ్మ చెప్పే కబుర్లు పట్టించుకోనవసరం లేదని గుర్తించండి. వికెట్లమధ్య ప్రుగెత్తడం చేతకాక 38 సార్లు రన్ అవుట్ అయిన సంజయ్ మంజ్రేకర్ సచిన్ టెండుల్కర్ ని ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తుంటాడు. అంత పోటుగాడు అయితే ఆడి చూపించవచ్చుగదా....
2. మన లక్ష్యం, మన కల ఎప్పుడూ ఇతరుల విమర్శకన్నా బలంగా ఉండాలి.; ఇతరుల విమర్శకు జడిసి మనం చేస్తున్న పనిని వదిలివేసామంటే మన లక్ష్యం చాలా బలహీనంగా ఉందన్నమాట. ఎవరైతే స్థిరమైన ఖచ్చితమైన బలమైన కోరిక కలిగిఉంటారో వారు ఇతరులు కడుపుమంటతో చేసిన విమర్శలను పట్టించుకోరు.
3. మనల్ని విమర్శించే వారు మనం చేస్తున్న పనిలో లోపాలు, తప్పులు గురించి చెప్పేటపుడు ఎలా చేస్తే, ఏమి చేస్తే బాగుంటుందో అని వారిని ఒక సారి ప్రశ్నించండి. వారి వద్ద సమాధానం ఉండదు సరికదా అక్కడనుండి పలాయనం చిత్తగిస్తారు. ఈ సారి ప్రయత్నించి చూడండి.
4.విమర్శకులకు దూరంగా ఉండండి లేదా వారిని దూరంగా ఉంచండి; ఎలాంటి వారైన విమర్శల బాణాల వాడిని వేడిని తట్టుకోలేరు. వారిని దూరంగా ఉంచడం లేదా మనం దూరంగా ఉండటం అన్నిటికన్నా మంచిది. రోడ్డుమీద దారి పొడుగునా ముళ్ళు ఉన్నప్పుడు వాటిని పీకి వేస్తూ సమయం దుర్వినియోగం చేసుకోవద్దు. మంచి చెప్పులు వేసుకుంటే పోలా.
5.ఇంకా వివరాలు, చిట్కాలు అనవసరం మౌలా నజిరుద్దీన్ కి ఎదురైన ఒక అనుభవం చూడండి. విమర్శకుల గురించి, మనకు బాగా అర్థం అవుతుంది.
ఒక సారి మౌలా నజిరుద్దీన్ తన కుమారుడి తో కలసి సంతకు వెళ్ళి ఒక గాడిద కొన్నాడట్. ఎందుకంటే ఆ రోజుల్లో గాడిదలే ప్రధాన ప్రయాణ సాధనాలు. గాడిద కొని దాని పైన తన కుమారుడిని కూర్చోపెట్టి ప్రక్కన్ నడుస్తూ వస్తున్నాడట. కొంతమంది అది చూసి ఏమయ్యా నజిరుద్దీన్ మీ అబ్బాయికి గారాబం చేస్తున్నావు. పిల్లడికి కష్టం అంటే తెలీక పోతే రేపు పెద్దయ్యాక సమస్యలు ఎదుర్కుంటాడు. నీవు చేస్తున్న ఏమీ బాగో లేదు అని విమర్శించారట్. దానితో నజీరుద్దీన్ పిల్లవాడిని దించి తను కూర్చొని ప్రయాణం సాగించాడట. దార్లో కొద్ది మంది అది చూసి ఏమయ్యా నజిరుద్దీన్ నీకు ఏమైనా బుర్ర ఉందా చిన్న పిల్లవాడిని నడిపిస్తూ ఇంత ఎదిగావు ఆ మాత్రం తెలీదా అని విమర్శించారట. దాంతో నజిరుద్దీన్ తాను మరియు తన కొడుకు ఇద్దరు కలసి గాడిద మీద కూర్చొని ముందుకు సాగారు. దార్లో కొద్ది మంది చూసి అసలు మీలో మానవత్వం ఉందా ఇద్ద్రరు కలసి కూర్చుంటే అది మొయ్యగలదా? మీలో సైతాన్ ప్రవేశించాడా అని శాపనార్థాలు మొదలెట్తారట. దాంతో నజిరుద్దీన్ వెంటనే తాను తన కుమారుడు గాడిద పైనుండి దిగి ఇద్దరు కలసి గాడిద తో పాటు నడవడం మొదలెట్టారట. దార్లో మరికొందరు చూసి ఏమయ్యా నజిరుద్దీన్ ఏమి మనిషివయ్యా ఉన్న అవకాశం ఉపయోగించుకోడం చేతకాక పోతే ఎలాగయ్యా? గాడిద కొని దానిని నడిపిస్తే అది ఎందుకు కొన్నావయ్యా? దానిమీద కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చుకదా అని విమర్శల వర్షం మొదలెట్టారట. ఇప్పుడు నజీరుద్దీన్ దగ్గర ఒకటే అప్షన్ ఉంది. దానిని తండ్రి కొడుద్కులిద్దరూ మొయ్యడం లేదా గాడిద ను వదిలి పారిపోవడం.
ఇతరులను సంత్రుప్తి పరచాలని ప్రయత్నిస్తే ఎవరినీ సంత్రుప్తి పరచలేము. ఇతరులు మనల్ని విమర్శిస్తున్నారంటే మనలో ఏదో విషయం ఉందన్నమాట. కాబట్టి విమర్శలకు వెఱవకుండా మనం ఎంచుకున్న రంగం లో జైత్రయాత్ర మొదలెడుదామా.
ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయకుమార్
trainerudaykuma@gmail.com

అన్నయ్య బావుంది. సింపుల్ గా, చక్కటి భాషతో చెప్పారు.నిజంగా ఇలాంటివి అందరూ చదవాలి.
ReplyDeletesir excellent
ReplyDeletesuper sir
ReplyDelete