Tuesday, 12 April 2011

If you were a bird - Be an early bird

ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు?
వేకువఝామునే నిద్రలేవడం మీకు అలవాటేనా? చాలా కష్టం బ్రహ్మతరం కూడా కాదు అంటున్నారా? నిజమే ఉదయం నిద్ర లేవడం చాలా కష్ట్మైనా దాని వలన కలిగే ఉపయోగాలు, నివారించదగ్గ ఇబ్బందులు ఒకసారి ఊహించుకుంటే వేకువఝామునే నిద్రలేవాలనే ఉద్ధేశ్యం మీకు కూడా కలుగుతుందనేది అక్షర సత్యం.
1. ఉదయం వేగంగా నిద్ర లేచేవారికి పనిచేసే సమయం ఎక్కువ ఉంటుంది. వేగంగా లేవడం వలన్ చేతిలో ఎక్కువ సమ్యం ఉంటుంది. ఆ సమయాన్ని ఆ రోజు ప్రణాళిక కొరకు, పూజకొరకు లేదా ధ్యానం చేసేందుకు ఉపయోగించుకో వచ్చు.
2. ఉదయాన్నే లేవడం వలన ఆలస్యమైందని వారి మీద, వీరి మీద, పిల్లల మీద చిరాకు పడనక్కరలేదు.
తెల్లవారే ఇంట్లో విసుక్కోవడం అరుచుకోవడం చేస్తే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది.
3. ఉదయం ఫ్లాహారం తీసుకోడానికి సమయం ఉంటుంది. చాలా మంది లేవడం ఆలస్యం అవడం వలన కేవలం టీ గాని, ఖాఫీ గాని త్రాగి ఆఫీసుకి లేదా కాలేజికి బయలుదేరుతారు. మరలా మధ్యాహ్నం వరకు తినడానికి సమయం ఉండదు కాబట్టి ఆకలితో గడపాల్సి ఉంటుంది. దీని వలన జీర్ణాశయం లో హైడ్రోక్లోరికాంలం స్రవిస్తూ ఉంటుంది. దీనివలన్ ఎసిడిటీ , అల్సర్లు రావడమే కాకుండా గ్లూకోజ్ అందక చాలా నీరసంగా ఉంటుంది. దానివలన చిరాకు, పనిలో ఉత్సాహం తగ్గుతుంది.
4. ఉదయాన్నే లేస్తే సూర్యోదయాన్ని, ఉదయం యొక్క ప్రశాంతతను ఆస్వాదించవచ్చు. యోగా, నడక లేదా వ్యాయామం చేయడానికి అవకాశం ఉంటుంది.
5. ఉదయాన్నే లేచి, మెయిల్, బ్లాగ్, అపాయింట్ మెంట్ సరిచూసుకోడానికి కావలసినంత సమయం చిక్కుతుంది. ఆ రోజంతా సక్రమంగా గడవడానికి వీలవుతుంది.
ఇవన్నీ బాగానే ఉంది కాని ఉదయం లేవడం ఎలా అనే సమస్యను పరిష్కరించడం ఎలా. ? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న క్రింది సూచనలు పాటించడానికి ప్రయత్నించండి.
1. అలారం, సెల్ ఫోన్ మొదలగునవి ఉప్యోగించండి. కాని వాటిని మంచానికి అందుబాటులో ఉంచవద్దు. దానిని ఆపి మన పని మనం కొనసాగిస్తాం.
2. ఒక్కసారిగా మీ అలవాటు మార్చడానికి ప్రయత్నించవద్దు. రోజు కొంచెం కొంచెం గా ముందులేవడం అలవాటు చేసుకోండి.
3. రాత్రి త్వరగా నిద్రపోడానికి ప్రయత్నించండి . నిద్ర పోయే ముందు టీ.వీ, కంప్యూటర్ తో గడపొద్దు.
4. నిద్రపోయే ముందు ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తూ ప్రశాంతత అనుభవించడానికి ప్రయత్నించండి. ఇది కంప్యూటర్ లో తాత్కాలిక ఫైళ్ళను ఎలా తొలగిస్తామో అలా ఉపయోగపడుతుంది.
5. ఉదయం వేగంగా లేచిన ప్రతీసారి మీకు మీరుగా ఏదైనా బహుమతి ఇచ్చుకోండి. వారానికి ఎన్నిసార్లు వేగంగా లేస్తున్నారో అలవాటు అయినంతవరకు కాలెండర్ పై రాయండి.
వేగంగా లేచిన ప్రతీసారి ఆ రోజు ఎలా గడిచింది పరిశీలించండి మీకే అది ఒక అలవాటు గా మారుతుంది. మన శరీరం ఒక బయోలాజికల్ క్లాక్ అన్న సంగతి మరచిపోవద్దు. మన అలవాట్లకు అనుగుణగా అదే సర్దుబాటు చేసుకుంటుంది.

విష్ యు ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయకుమార్

No comments:

Post a Comment