Wednesday, 13 April 2011

anger management

కోపాన్ని నియత్రించుకోవడం ఎలా?

కామ, క్రోధ,మద,మత్సర,లోభ, మోహాలనే అరిషడ్వర్గాలలో మొదటి రెండు భగవంతుని నుండి మానవునికి నేరుగా సంక్రమించాయని పెద్దలు చీబుతారు. కోపమనేది అతి సాధారణమైన ప్రతిస్పందన.మనజీవితంలో మన ఆలోచనలకు, భావాలకు, అంచనాలకు, అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎదైనా జరిగినపుడు తక్షణ ప్రతిస్పందనే కోపం. మనకు ఒక రక్షణ తంత్రంగా కోపం ఉప్యోగపడుతుంది.
కోపం మంచిదా చెడ్డదా? అంటే ఒకసారి మంచిదే. అరిస్టాటిల్ మహాశయుడు కీ.శ. 324 లో " కోపం రావడం అతి సహజం కాని సరియైన సమయంలో, సరియైన వ్యక్తిపై, సరియైన మోతాదులో, సరియైన కారణానికి, సరియైన మార్గంలో కోపం రావడం చాలా కష్టం అని అన్నాడు. అది 2335 సంవత్సరాలైనా అలా కోపం అవడం చాలా కష్టమని తెలుస్తుంది. కోపం, అసహనం అర్థం చేసుకోడానికి శతృవులని గాంధీజీ పేర్కొన్నాడు.
దేవుళ్ళు కూడా కోపం చూపించే వారు. జీసస్ కూడా పవిత్ర ప్రదేశాలను వ్యాపార గుడారులుగా మార్చారని కోపమవడమే కాకుండా అక్కడవున్న సరంజామా అంతా విసిరి వేస్తారు. రాక్షస సంహారాలలో ప్రతి హైందవ దేవుడు ఆగ్రహాన్ని చూపించడం తెలిసిందే.
కోపం వలన నష్టాల గురించి కన్నా కోపం అదుపులో ఉంచుకోవడం గురించి మితృలు అడిగారు. క్రింది చిట్కాలు పాటిస్తే కోపం నిగ్రహించుకో వచ్చు.
1. ప్రతిస్పందనను వెంటనే కాకుండా కొంచెం వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. 1 నుండి 10 వరకు లెక్కించడం అలాంటివి చేయడం
2. వెంటనే అక్కడ నుండి నిష్క్రమించడం.
3. కోపం బదులు వెంటనే ఆ వ్యక్తిపై ఏదైనా సరదా గా హస్యస్పూరకంగా మాట్లాడం
4. కోపాన్ని ఆ వ్యక్తి పై కాకుండా వేరేగా బయటకు వ్యక్తపరచడం ( జపాన్ లో ప్రతి కార్యాలయంలో పై గదిలో ఏంగర్ రూం అంటూ ఒకటి ఉంటుందట. అక్కడ పెద్ద బ్యాగ్ ఉంటుంది దానిని బాదుతుంటారట. పిల్లలు కూడా కోపం వ్యక్తపరచడానికి తలగడ ని కొడుతుంటారు. అలా అన్నమాట.
5. ఎదుట వ్యక్తి ఏ కారణం గా కోపమవుతున్నాడో దానిని యధాస్థితి గా ఉంచడం.
6. ఎదుట వారి కోణం నుండి అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం.
7. జరిగిన విషయాన్ని వీలైనంత త్వరగా మరచిపోవడం, క్షమాగుణాన్ని పెంచుకోవడం
8. ఎదిటివారు ఒకవేళ కోపంగా ఉంటే ఆకస్మాత్తుగా ఏదైనా బహుమతి ప్రకటించడం
9. ధ్యానం, యోగా లాంటివి సాధన చేయడం
10. ఏ విషయం పట్ల అతిగా అటాఛ్మెంట్ లేకుండా చూసుకోవడం.
ఇవి సాధారణంగా ప్రతీ వారు చెప్పే అతి సాధారణమైన విషయాలు కేవలం ఆథ్యాత్మిక ఆలోచనాధోరణి పెంచుకోవడం, పరిణితితో ఎదుటివారి పట్ల ప్రేమభావం పెంచుకోడం ఒక్కటే సరియన పరిష్కారం. ఉధాహరణకి ఇంట్లో టీ.వీ ఎవరో పగలుకొట్టారనుకోండి. వెంటనే కోపం వస్తుంది. పగలుగొట్టింది పనిమనిషి అయితే ఇంకా కోపం వస్తుంది. ఒకవేళ రెండేళ్ళ ముద్దుల మనుమడైతే...... కోపం ఎక్కడికి వెళుతుంది.....
ధర్మాగ్రహలు, సత్యాగ్రహాలు దేశగతులనే మార్చాయని మరవకూడదు.
విష్ యు ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయకుమార్
trainerudaykumar@gmail.com

1 comment: