Wednesday, 27 April 2011

HOW TO OVER COME FEAR

భయాన్ని తొలగించుకోవడం లేదా తగ్గించుకోవడం ఎలా?
    భయం అనేది ప్రతి మనిషికి ఉండే అతి సహజమైన భావోద్వేగం.  అయితే నియమిత పరిమాణంలో ఉండే భయం ఒకందుకు మంచిదే.  సామాజిక నియమాలు ఉల్లంఘించకుండా నలుగురి లో చెడ్డ అనిపించుకోకుండా మన జీవిత లక్ష్యాలను సాధించడానికి కొంత మొత్తంలో భయం ఉపకరించ్వచ్చును.  కాని భయం అనేది మన విధులు, చేయాల్సిన పనులు, సాధించాల్సిన లక్ష్యాలను  సాధించనీయకుండా మనకు ఆటంకపరుస్తుంటే తప్పనిసరిగా నివారణ గురించి ఆలోచించాల్సిందే.  భయానికి లోనయ్యేటపుడు మన ఆలోచనల వలన శారీరక స్థితి లో కూడా మార్పులు వస్తాయి.  వాటినే సైకాలజీ లో  సైకో సొమాటికీ డిజార్డర్స్  అంటారు.  క్రింది విషయాలను పాటించినట్లైతే భయం నుండి నివారణ  పొందవచ్చునని ప్రముఖ రచయిత డేవిడ్  ష్వార్జ్ చెబుతాడు

*  ఏ విషయాలైనతే భయాన్ని కలిగిస్తాయో అవే ముందు మొదలుపెట్టాలి.  భయపడే విషయాన్ని పదే పదే చేయడం వలన భయం పోతుందని ఇతని భావన. పోకిరి సినిమాలో మహేష్ బాబు అంటాడు నాకేదైతో భయమో అదే ముందు చేస్తానని.
* ఎటువంటి సమయం లో  నెగటివ్ ఆలోచనలకు చోటియ్యరాదు.  యద్భావం తత్భవతి  అన్నారు కదా. మనం ఏమి కాకూడదనుకుంటామో అదే జరిగే అవకాశం ఉంటుంది  ( what we resist that persist ) కాబట్టి సానుకూలంగా ఆలోచిస్తుండాలి.
* ఎదుటి వాళ్ళ గురించి ఏదో ఊహించుకుంటూ భయపడటం  సమంజసం కాదు.  కొంత మంది పై అధికారులను కలవాల్సి వచ్చినప్పుడు,  లేదా కొత్త వారితో మాట్లాడవలసి వచ్చినపుడు తెగభయపడుతూ ఉంటారు. వారు కూడా మనలాంటి వాళ్ళే. మనలాగే వాళ్ళకి భయాలు, ఆలోచనలు, అనుమానాలు ఉంటాయి.   కమీషనర్ కూతురికి మొగుల్లు రారా అని రవితేజ చెప్పలేదా?
* ఇతరుల సలహాల కన్నా, మీ పూర్వానుభవాలకన్నా మీ అంతరాత్మ ఏం ప్రభోదిస్తుందో అదే చెయ్యండి. మన అంతరాత్మను మించిన మార్గదర్శి మరెవరూ ఉండరని గుర్తించండి.
* నేను చాలా ఆత్మవిశ్వాసం తో ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో భయానికి లోను కాను. అంటూ స్వీయసూచనలు ఇచ్చుకోండి. రోజూ మనతో మనం సానుకూలంగా అనుకోవడం వలన మానసిక ఉప చేతనాస్థాయిలో అవి ముద్రించబడి సానుకూల నమ్మకాలు పెరుగుతాయి.
*  ఎక్కడికి వెళ్ళినా ముందువరసలో కూర్చోడానికి ప్రయత్నించండి.  మాట్లాడమని ఎవరైనా కోరితే ముందుమాట్లాడేవారు మీరే అవ్వాలి.
* ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. క్రింది చూపులు చూడటం భయానికి , అపరాధ భావనకు చిహ్నం.
* నడీచేటపుడు చేతులు కొంచెం పైకి విసురుతూ  వేగంగా నడవండి.  వేగంగా నడవడం  ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఆ రోజుల్లో గాంధీ గారు నడిస్తే  మిగిలిన వారు  ఆయనను అనుసరించడానికి  పరుగెట్టవలసి వచ్చేదట.
*  కొంచెం  పెద్ద స్వరం తో బిగ్గరగా  మాములు కన్నా  కొంచెం వేగంతో మాట్లాడండి.
* ఎప్పుడు  పెదాలపై  నవ్వును చెదరనీయకండి.  నవ్వుతూ ఉండటం కూడా ఆత్మ విశ్వాసానికి సంకేతం.
     పై సూచనలు  బాగున్నాయి  అని సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇప్పటినుండే పాటించడం మొదలు పెడదాం.  అజ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతే  అని గీతాకారుడు  ఊరికే చెప్పలేదు.

WISH YOU ALL THE BEST
trainerudaykumar@gmail.com

No comments:

Post a Comment