koodali.org,
గబ్బర్ సింగ్ సినిమా చూసి ఆనందిస్తున్న తెలుగు ప్రేక్షకులు తమ తమ అభిరుచులమేరకు ఆ సినిమాలోని అనేక అంశాలను మెచ్చుకుంటున్నారు.. ఈ సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా అని విమర్శించే వారు ఎప్పటిలాగే ఉన్నప్పటికీ ఈ సినిమా లో తెలుసుకోవల్సిన, పరిశీలించవల్సిన మనో విశ్లేషణా మరియు జీవితానికి ఉపయోగపడే అంశాల గురించి ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా నా అభిప్రాయలను నేను పరిశీలించిన అంశాలను తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు బిజినెస్ మేన్ సినిమా లో మేనేజ్ మెంట్ అంశాలను ఎలాగైతే అభినందించారో అదేవిధంగా ఈ వ్యాసం మీకు ఆనందం కల్గిస్తుందని ఆశిస్తున్నాను.
SIBLING RIVALRY: ప్రతీ కుటుంబంలో ఇద్దరు మగ పిల్లలుంటే తండ్రి లేదా తల్లి ఒకరివైపు ఎక్కువ అభిమానం చూపుతూ ఒకరి వలన రెండో వాడు చెడిపోతున్నడనే విమర్శించడం వలన అటువంటి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ. గారాబం చెయ్యబడ్డవాడు ఆ ప్రేమను దుర్వినియోగం చేస్తాడు. రెండోవాడు తనని తాను ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలను తరుచూ పోల్చడం, ఒకరి వలన మరొకరు పాడవుతున్నాడనే విమర్శ ఒకరిలో ప్రతీకారన్ని, మరొకరిలో తాను ఏమి చేసినా పర్వాలేదనే మొండితనాన్ని ఏర్పరుచుతుంది.
ACCEPTANCE OF CHILD AS HE IS; పిల్లలని వారి అభిరుచులను వారి ఆసక్తులను ప్రతీ తండ్రి లేదా తల్లి వారు ఎలా ఉంటున్నారో అలానే అంగీకరించాలి. తమ అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటే వారిని అర్థం చేసుకోవాలి. అంతే కాని వారిని హాస్టల్ లో ఉంచితే దూరంగా ఉండటం వలన తల్లిదండ్రుల ప్రేమకు దూరమై కుటుంబం పట్ల నిరాసక్తత ఏర్పరచుకోవచ్చు. ఎవరు ఎవరు లా ఉన్నా జీవించడం ముఖ్యం, బ్రతకడమ్ ముఖ్యం. కలిసి ఉండటమ్ ముఖ్యం. తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకోవడం ముఖ్యం. ముసలి కాలం ఆప్యాయత ఎలా మనకు అవసరమో పిల్లలకి ఆ వయస్సులో అభిమానం ఆప్యాయత, ప్రేమ చాలా అవసరం.
OEDIPUS and ELECTRA COMPLEX: ఈ సినిమాలో గుర్తించాల్సిన విషయాలు రెండు హీరో పవన్ కల్యాణ్ ఇడిపస్ కాంపెక్స్ అనే స్వభావం కలిగి ఉంటే హీరోయిన్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ అనే స్వభావమ్ కలిగి ఉంటారు. తల్లి పై తీవ్రమైన అభిమానం కలిగిఉండి ఆమె ప్రేమకోసం తహతహలాడటం, తనమీద వ్యామోహం పెంచుకొని వయ్యారాలు పోతున్న స్త్రీ మీద మోజు చూపకపోవడం, గౌరవంగా ఒక పద్ధతిగా ఉండే శృతిహసన్ పై అభిమానం పెంచుకొని ఆమె అభిప్రాయానికి గౌరవించడం ఇవన్నీ ఇడిపస్ కాంప్లెక్స్ స్వభావం అయితే తండ్రి బలహీనతలను కూడా గౌరవిస్తూ తండ్రి కోసం తన అభిప్రాయాలను కూడా కాదనుకోవడం శృతిహసన్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ స్వభావం కలిగిఉంటుంది.
FAMILY IS IMPORTANT: దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చాల ముఖ్యం . ఇదే విషయాన్ని శృతి హసన్ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పిస్తాడు. చివరికి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న వైరుధ్యాలున్న ఒకరినొకరు క్షమించుకోవడం పిల్లల సుఖాలే తల్లిదండ్రుల లక్ష్యం అని కోట శ్రీనివాస్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు.
( ఇంకాఉంది..) It will be completed soon.................
give feed back...if you like
trainerudaykumar@gmail.com