Wednesday, 25 December 2013

LIFE LESSONS FROM TEACHINGS OF JESUS CHRIST

             
   నేను నాలుగవ తరగతి నుండి ఏదవతరగతి చదుతున్న రోజుల్లో డాబాగార్డెన్స్ లో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంటి ఓనర్స్ క్రిష్టియన్స్. మమ్మల్నికూడా వాళ్ళ పిల్లలతో ఇంచుమించు సమానంగా చూసేవారు. జోసెఫ్ మామయ్యగారు, కోకిలామణి ఆంటీ ..వారితో పాటు ప్రతీ రోజూ కీర్తనలు, బైబిల్ చదవడం ప్రతీ ఆదివారం చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఉన్న చర్చి కి వెళ్ళడం  అలవా అలవాటు అయింది.

క్రిష్టమస్ సందర్భం గా జీసస్ బోధనలు నుండి నేర్చుకోవలసిన ఒక పది పాఠాలు..

LIFE LESSONS FROM   TEACHINGS OF JESUS CHRIST 

1.  LOVE OTHERS  AS YOU LOVE YOURSELF:

                  ఈ వాక్యం బాగా ఆలోచిస్తే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి.  ఒకటి ఇతరులను ప్రేమించడం. రెండూ అంతకు ముందు మనల్ని మనం ప్రేమించడం. నేడు జీవితం లో అనేకమంది ఎదుర్కుంటున్న సమస్యలకి మూలకారణం తమపై తమకు ప్రేమ లేకపోవడం. ప్రేమ అంటే ఆశించడం కాదు అంగీకరించడం. మనల్ని మనం పూర్తిగా అంగీకరించినపుడు మనలో లోపాలపై ధృష్టి పెట్టం. మనలో ఉన్న లోపాలను , మంచి విషయాలను సమానంగా అంగీకరిస్తాం. ఆత్మన్యూన్యతా భావం అనేది మన దగ్గరకు రాదు. తనను తాను ప్రేమించే వ్యక్తి ఇతరులను గౌరవించగలడు, అభిమానించగలడు ఇతరులకు  ప్రేమను పంచగలడు.  తనలో తాను ఒక ఆనందం లాంటి స్వర్గాన్ని సృష్టించుకోగలడు. తనను తాను ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించమంటారు జీసస్ .. ఇతరులను ప్రేమించేటపుడు వారినుండి ఏమీ ఆశించం . ఎప్పుడైతే ఇతరులనుండి ఆశించమో వారిలో లోపాలపై ధృష్టి పెట్టం. ఎదుటివారిని ప్రేమించే టపుడు మనలో అహాన్ని పూర్తిగా విసర్జించగలం.  

2. PRIDE GOES BEFORE FALL: 
     
           పతనానికి ముందు అహం నడుస్తుంది. అహంకారం అన్ని ఇబ్బందులకు మూల కారణం. అహంతో ఉన్న వ్యక్తి ఇతరులను పట్టించుకోడు. తనకు అన్ని తెలుసనే మొండిపట్టుదలతో ఉంటాడు. తెలివితక్కువ  నిర్ణయాలు  తీసుకొని బోర్లాపడతాడు.  తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చింపబడతాడు అని జీసస్ చెప్పింది అదే.  వినయం, అణుకువ పైకెదిగేవారి లక్షణాలు. అహం అనేది పతనమయ్యేవారి లక్షణం.  కోరుకొండ సైనిక్ స్కూల్ బిల్డంగ్ బయట ఒక మంచి కొటేషన్ రాసి ఉంటుంది. ..The bow bends more shoots the Arrow surer....

3. PRACTICE FORGIVENESS: 

           " love your enemies, bless those who curse you, do good to those who hate you, and pray for those who spitefully use you and persecute you.."  నీ శతృవులను ప్రేమించుము, నిన్ను శపించేవాళ్ళను ఆశిర్వదించుము, నిన్ను ద్వేషించేవారికి మంఅచి చేయుము, నిన్ను మోసగిస్తూ ఉప్యోగించేవాకోసం ప్రార్థించుము.    జీసస్ చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట.  దీనిని మనం కాని పాటించినట్లైతే ప్రపంచంలో పగ ప్రతీకారాలుండవేమో.   ఆఖరికి  బరబ్బానైనా విడిచిపెట్టండి కాని యేసుని శిలువెయ్యండి అన్న ప్రజలను క్షమిస్తూ వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని వారిని క్షమించే జీసస్ హృదయాన్ని అర్థం చేసుకుంటే మనం ఎదుటివారితో జివించాల్సిన విధానం తెలుస్తుంది. తెలిసినవారితోనే కాదు ముక్కు మొఖం తెలియని ఫేస్ బుక్ మితృలతో కారాలు మిరియాలు నూరుతూ కామెంట్స్ రాసే మన సోదరులును క్షమించేద్దాం.  

4. AS YOU SOW, SO YOU REAP: 

  మన మనస్సు అనేది ఒక క్షేత్రం లాంటిది ఏ విత్తనం నాటుతామో అదే ఫలం లభిస్తుంది. మంచి ఆలోచనలు చేసే మనస్సు ఎల్లప్పుడూ  పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైన మనస్సు వలన పరిశుద్ధమైన ఆత్మ కలుగుతుంది. మనాలోచన మంచి జీవితానికి దారితీస్తాయి. మనస్సు ను నియత్రించాలంటే ఆలోచనలను నియత్రించడమే.   you sow a thought, you reap  an action, you sow an action you reap a habit, you sow a habit you reap a character, you sow a character you reap your destiny.  

5. NEVER JUDGE:

       జీసస్ చెప్పిన అన్ని మాటలలో ముఖ్యమైనది  ఎదుటి వారు ఇలాంటి వారు  అలాంటి వారు అని నిర్ణయాలు చేయవద్దని. మార్క్స్ ట్వైన్ అంటాడు దేవుడు మనల్ని నిర్ణయించడానికి వంద సంవత్సరాలు ఆగుతాడు కొన్ని క్షణాల్లో ఎదుటివారు ఇలాంటి వారు అలాంటివారు అని తీర్పులు చెప్పడానికి మనం ఎవరమని.  ప్రతీ వ్యక్తి తన పరిస్థితులబట్టి, అవకాశాలబట్టి ప్రవర్తిస్తుంటాడు. వారు ఇలాంటి వారు అని నిర్ణయాలు చేయడం వలన అనవసర ఇక్కట్లు తెచ్చుకోవడమే గాక. ఇతరులను అంచనా వేస్తున్నకొద్దీ  వారిని మన మనసునుండి  దూరం చేసుకుంటాం 

 6. HAVE A HEART OF CHILD

   ఎల్లప్పుడు పసి హృదయాలను కలిగిఉండమని జీసస్ చెబుతాడు. పసి వాళ్ళకు ప్రతీ విషయం అద్భుతంగా కనబడుతుంది. అందరూ చాలా గొప్పవారిగా కనబడతారు. గతం గురించి లేదా భవిష్యత్తు గురించి చింత గాని ఆందోళన గాని ఉండదు ఎల్లప్పుడు వర్తమానం లోనే జీవిస్తారు. ఎవరి పై అకారణ కోపాలు కాని ద్వేషాలు కాని పెట్టుకోరు.  పసి  మనస్సులకు దేవుని  రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. పసి వారి మనస్తత్వం ఉన్న వారు అందరిని ప్రేమించగలుగుతారు. 

7.  THE POWER OF ASKING: 

      భగవంతుని రాజ్యంలో ఉన్న ప్రతీ విషయం లో అందరికీ హక్కు ఉంటుంది. కాని దానిని పొందేందుకు మానవ ప్రయత్నం అవసరం.  అడుగుడి ఇవ్వబడును, కోరుడి పొందబడును, తట్టుడి  తెరవబడును  అని జీసస్ చెబుతారు.  అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే నానుడి ఉంది. అది కోరుకునే ముందు, దానిని అడిగే ముందు దానిని పొందేందుకు కావల్సిన అర్హత, కృషి చేయాల్సి ఉంటుంది. 

8.  BELIEVE AND ACHIEVE : 

   విశ్వాసమే భగవంతుడు. నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటమంటే భగవంతుని ఉనికి పట్ల నమ్మకం కలిగిఉండటమే. మనసా వాచా కర్మేణా చేస్తున్న పని పట్ల, నమ్మిన విలువల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకమే విజయానికి దోహదకారి. సముద్రం నడిచివచ్చిన జీసస్ పీటర్ చుసి తాను నడవాలనుకుంటాడు రెండు అడుగులు నడిచిన తర్వాత మునిగిపోతానేమో అని సంశయపడతాడు మునిగిపోతుంటాడు. పీటర్ ని చేతి సహాయం తో లేపి నీపై నీకున్న విశ్వాసమే నిన్ను నీటిపై ణడిపించినడి, నీ అపనమ్మకమే నీటిలో ముంచినది అని జీసస్ అంటారు.  సంశయాత్మ వినాశ:  అన్న గీతాబోధన అదే...   A faith of mustard  seed will move away the mountains..  ఆవగింజంత విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది.

9. PRAYER IS THE KEY TO HARVEST: 

       త్రికరణ శుద్ధిగా చేసే ప్రార్థన నిన్ను అన్ని బంధాలనుండి విముక్తిన్ని చేస్తుంది. ఒక రైతు నిరంతరం వ్యవసాయం చేస్తేనే పంట ఎటువంటి కలుపు మొక్కలకి , చీడలకు బలి కాకుండా చేతికి వస్తుందో మనం కూడా మన చేస్తున్న పనులకు తగిన ఫలితం పొందాలంటే నిరంతరం భగవంతున్ని ప్రార్థించాలంటారు జీసస్. " నేను ఈ రోజు చేయాక్సిన పనులు చాలా ఉన్నాయి అందుకే ఈ రోజు ఒక గంట ఎక్కువగ ప్రార్థిస్తాను " అంటారు గాంధీజీ . ప్రార్థన మనతో భగవంతునికి గల బంధాన్ని, విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది. ఆత్మ, పరమాత్మ తో లయం అవకాశాన్ని మరింత దృఢవంతం చేస్తుంది. 

10.  SERVE THE MANKIND TO SERVE THE GOD

    సేవకుడు కానివాడు బోధకుడు కాలేడు.  చివరి రాత్రి విందుకు ముందు జీసస్ తన అనుచరుల కాళ్ళు కడుగుతాడు.  తోటివారిని సేవించడం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని తెలియచేస్తాడు. ఎదుటి మనిషి లో గల దైవాన్ని  సేవ ద్వారా తెలుసుకోవచ్చు. SREVENT LEADERSHIP  అనే కొత్త మేనేజ్ మెంట్ ధోరణి ఈ భావం నుందే పుట్టింది.  మథర్ థెరిస్సా  మానవసేవ అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా పునీతురాలైంది.. సెయింట్ థెరిసాగా మారగలిగింది. నీ సంపాదనలో కొంతభాగాన్ని అన్నార్తులకొరకు . దీనులకొరకు వెచ్చించగలిగితే దేవునిరాజ్యం ఈ భూమి మీదే ఏర్పడుతుంది.

                   విశ్వమానవ సౌభ్రాతృత్వభావనకు, శాంతి సాధన, ప్రేమకొరకు బోధించిన జీసస్ భావనలు మతం తో సంబంధం లేకుండా ప్రపంచశాంటి కోరేవారంతా పాటించినట్లైతే  జగమంతా క్రిస్మస్ వెలుగులు నిండుతాయి,  మానవత్వ పరిమళాలు పరిఢవిల్లుతాయి. మనిష్యల మనస్సుల ప్రేమపుష్పాలు విప్పారుతాయి. వికసిస్తాయి. 

    WISH  YOU A HAPPY AND MERRY CHRISTMAS  ..

 trainerudaykumar@gmail.com
    
            

Sunday, 1 December 2013

జీవిత పాఠాలు తెలిపే కవితలు - :"If - by Rudayard Kipling"


  మీరంతా  " హ్యాపీ డేస్ " సినిమా చూసారా? అందులో ఒక కథానాయకుడు  నిఖిల్  ఇంగ్లీష్ మేడమ్ వెనుక పడతాడు. ఆమే  ఆ అబ్బాయికి  ఒక ఇంగ్లీష్  Poem   ఇచ్చి  నేర్చుకొని రమ్మంటుంది.  ఆ కవిత ఏమిటో?  ఆ కవిత ద్వారా ప్రతీ యువకుడు తెలుసు కోవలసిన జీవిత  పాఠాలేమిటో తెలుసుకుంటే అనేక మందికి ఉపయోగ పడుతుందేమో....   నేను డిగ్రీ  సెకెండియర్  లో  ఉన్నప్పుడు  మాకు ఈ Poem   ఉండేది. సారాంశం బట్టీ పట్టడమే తప్ప  అర్థం చేసుకోడానికి అంతగా ప్రయత్నించలేదు.
  జంగిల్ బుక్  ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన రుడ్ యార్డ్ కింపింగ్  1895 లో  ఈ Poem   వ్రాసాడు. 1910 లో ముద్రించబడింది.  ఒక తండ్రి  తన కుమారుడికి  ఎలా జీవించాలో?  దాని వలన  వాడికి కలిగే ఫలితమేమిటో  ఈ  Poem   తెలియచేస్తుంది. ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలో, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో దీనిలో చెప్పబడింది.

ముందుగా  ఈ  Poem   ఏమిటో చూద్దాం.....
Ist Stanza 


IF you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don't deal in lies,
Or being hated, don't give way to hating,
And yet don't look too good, nor talk too wise:


తెలుసుకోవలసిన జీవిత పాఠాలుః    

1.  ఆత్మ విశ్వాసం - నమ్మకం;  ఇతరులకు నీ మీద నమ్మకం ఉండవచ్చు లేకపోవచ్చు లేదా నీలోనే లోపాలున్నాయని నిన్ను నిందించవచ్చు. నీ మీద ఇతరులకున్న నమ్మకం విశ్వాసం సడలిపోతుండవచ్చు.  కాని  ఎటువంటి పరిస్థితుల్లో నీ మీద నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు.  అసత్యాలతో, ద్వేషం తో నీపై ఇతరులు నిందించవచ్హు. ఎటువంటి పరిస్థుతుల్లో సహనాన్ని విడిచిపెట్టకుండా, అసహనానికి లోనుకాకుండా, నీలో ద్వేషానికి  చోటు ఇవ్వకుండా ఉండగలగాలి. అతి మంచివాడిగా కనబడవద్దు, అతి తెలివితేటలతో మాట్లాడవద్దు. 


II  nd Stanza  

 If you can dream - and not make dreams your master;
If you can think - and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build 'em up with worn-out tools: 


2. చెదరని సంకల్పం;   జీవితం గురించి కలలు  కను.  కాని కలల బేహారిగా  విహరించకు. ఆలోచించి పనులు చెయ్. కాని ఒట్టి ఆలొచనలతో  వాస్తవాలకు దూరంగా జీవించకు. 
ఓటమికి కృంగిపోవడం,  విజయానికి  ఉప్పోంగి పోవడం కాకుండా విజయాన్ని కాని  ఓటమిని గాని సమభావంతో స్వీకరించే తత్వాన్ని అలవరచుకో, నీవు పలికిన సత్యాలకు వక్రభాష్యాలు చేర్చి నిన్ను అందులో బలి చేసే  ఇతరుల  పన్నాగాలకు బలికాకు. జీవితాన్నే ఫణంగా పెట్టి సాధించిన విజయ సౌధాలు ఒక్కసారి కూలినా, ఆ శిధిలాల శకలాలతో నూతన విజయాలకు నాంది పలుకు . 

III  rd Stanza  
 
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: 'Hold on!'




3. ఓటమికి నిరాశ చెందకు;   ఓటమి అంటే ఉండే భయం   ఏ పని చేయడానికి  ముందడుగు వేయనీయదు. నీవు సాధించిన అన్ని విజయాలు  పెట్టుబడిగా పెట్టి, అవి పోయినా ఫర్వాలేదు  మొదలు నుండి మరలా జీవితం మొదలుపెట్టగలను అనే తెగువతో సాహస నిర్ణయాలు  తీసుకో. నీ ఓటమి గురించి ఎవరి వద్ద చర్చించకుండా ఓటమిని  మనసుకు పట్టించుకోకుండా సర్వం కోల్పోయినా సంకల్ప బలం తో నిగ్రహించుకుంటూ జీవించు.

IV th  Stanza 
 
If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings - nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds' worth of distance run,
Yours is the Earth and everything that's in it,
And - which is more - you'll be a Man, my son!


4. విలువల ప్రాతిపదిక  తో  జీవించు;   అతి  సాధారణ  జనాలతో  జీవిస్తున్నప్పటికీ   నీవైన విలువలను ఎన్నడూ  విడిచిపెట్టకు.   అలా అని గొప్పవారి తో స్నేహం చేసినప్పటికీ సాధారణ
ప్రజలతో  సంబంధాలను విడిచిపెట్టకు. నీ అగర్భ శతృవులైన, నీ గాఢ స్నేహితులైన నిన్నెప్పుడూ బాధపెట్టకలిగే  స్థితి కలిగించకు.  అందరితో కలిసి  ఉన్నప్పటికీ  నీ హద్దుల్లో నీవుండు.  నిమిషం లో  ఉండే ప్రతి  సెకెన్  విలువైనదిగా ఉపయోగించు. కాలం విలువైనదని గుర్తించు.  
        ఇలా నీవుండ గలిగితే నీకు కావల్సినవన్నీ కలిగియున్న నీదైన  ప్రపంచాన్ని పొందగలవు. మనిషి గా సంపూర్ణంగా తయారవ్వగలవు.
                              షుమారు వంద కు పైగా సంవత్సరాల క్రింద  కిప్లింగ్  చెప్పిన జీవిత పాఠాలతో కూడిన ఈ  Poem   ఈ నాటికి ఆచరణ యోగ్యం.  నాయకత్వ లక్షణాలకు ఒక కరదీపిక.  మన మనస్తత్వాల మార్పుకు, వ్యక్తిత్వాల నిర్మాణాలకు ఉపయోగమైన దీనిని ఆచరించగలమని నమ్ముతూ
trainerudaykumar@gmail.com