Thursday, 6 October 2011

స్టీవ్ జాబ్స్ -- జీవిత సత్యాలు

స్టేవ్ జాబ్స్. సాంకేతిక ప్రపంచంలో చెరిపివేయబడని పేరు. అతను స్థాపించిన ఫెయిర్ టేల్ కంపెనీ ఇప్పుడు ఆపిల్ కంప్యూటర్స్ గా పిలవబడుతుంది సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ రంగానికి చేసిన సేవ శ్లాఘనీయం.
ఈ రోజు అంటే 5-10-2011 ప్రపంచం శోక సముద్రం లో మునిగిన రోజు ఎన్నో రోజులుగా చావుతో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు వీరస్వర్గం పొందిన రోజు. ఈ సందర్భంగా తన్ జీవితం లో నమ్మిన, చుట్టుఉన్నవారితో తరుచూ చెప్పిన జీవిత సత్యాలను లేదా తాను పాటించిన నియమాలను తెలుసుకోవడం సందర్భోచితం. ఈ నియమాలను తాను పాటించడం వలనే విజయం సాధించగలగానని జాబ్స్ తరుచూ చెపుతూ ఉండేవాడు.
1. “Innovation distinguishes between a leader and a follower.”
నూతన ఆవిష్కరణలు మనల్ని అనుచరుని స్థాయినుండి నాయకునిగా మారుస్తుంది. మనకంటూ గిరిగీసుకొని చిన్న పరిథిలోనే ఆలోచనలు చేస్తే ఎప్పుడు ఎదగలేము. మార్పును ముందుగా ఊహించి నూతనత్వాన్ని ఆహ్వనించకపోతే కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాయిదా వేసే తత్వం, వేచి చూద్దాంలే అనే ధోరణి ఈ పోటీ ప్రపంచంలో పనికి రాదు. ఆఅవిష్కరణలే మనల్ని నాయకునిగా తీర్చిదిద్దుతాయి.

2. “Be a yardstick of quality. chase quality, quantity chases you
నాణ్యత విషయంలో రాజీ పనికిరాదు. ఎప్పుడైతే నాణ్యతకోసమై మన సామర్ధ్యాలను, వనరులను అవకాశాలను వినియోగిస్తామో మనం పొందే ఫలితాలు అదే స్థాయిలో ఉంటాయి. give your best to get your best.

3. చేసే పనిని ప్రేమిస్తూ చేయడమే విజయ రహస్యం.
చేసే పని పట్ల ఆసక్తి లేకుండా మొక్కుబడి చేయడం స్వీయ వినాశనానికి మరియు సంస్థ వినాశనానికి దారి తీస్తుంది. లక్ష్యాలు ఉన్నతంగా ఉంచుకోవడం వాటిని సాధించుకోడానికి మనసా, వాచా కర్మేణా పనిలో నిమగ్నమవడమే. ఒక ప్రయోజనం కొరకు పనిచేస్తున్నమని భావించడమే విజయ రహస్యం.

4. మనం చేసే పని ఇతరులలో మార్పు తీసుకురాబోతుందని నమ్ముతూ పనిచేయడమే అసలైన విజయ రహస్యం. మనం వాడే వస్తువులు, తినే తిండి ఇతరులు ఉత్పత్తి చేసిందే. అదే విధంగా మనం చేసేది మరొకరికి ఉపయోగపడుతుంది. నీవు నమ్మిన సిద్దాంతాలను బోధించాల్సిన పని లేదు. నీవు నమ్మి చేస్తూ, అనుసరిస్తూ ఉంటే అవి ఇతరులలో మార్పును తీసుకువస్తాయి. మన పనులే గుర్తింపు తీసుకువస్తాయి.
5. ఎల్లప్పుడు నేర్చుకోవడం ప్రారంభించే వాడిగా ఉండు. మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటపుడు ఎంతో ఆసక్తి కలిగి యుండి ఉత్సాహంగా ఉండాటమే కాకుండా అంతా తెలుసులే అనే అహం, లేదా మిడి మిడి జ్ణానం కలిగియుండటం చేయం. చిన్న పిల్లలు కొత్త విషయాల పట్ల ఎంతో చురుకుతనం హుషారు కలిగియుంటారు. ఈ తత్వాన్ని జీవితాంతం కలిగియుండాలి. ఇంకా నేర్చుకోవలసినది చాలా ఉంది అనే ధోరణి తో ఉండాలి.

6. మన మెదడును చచ్చుబరిచే పనికిమాలిన టెలీవిజన్ కార్యక్రమాలతో , సీరియల్స్ తో సమయం గడవకు. నిరంతరం మెదడును చురుగ్గా ఉంచే విషయాలలో లీనం కావాలి.

7 డబ్బు కన్నా శీల నిర్మాణమే ముఖ్యం. డబ్బు కోల్పోయినా ముఖ్యం కాదు. కాని విలువలు లేని జీవితం చాలా హీనం. విజయం సాధించిన వ్యక్తులు తప్పులు చేయలేదని కాదు కాని వారు వాటినుండి నేర్చుకోవడమే కాదు వాటిని మరలా మరలా జరగకుండా జాగ్రత్తపడేవారు. శీల నిర్మాణమే జీవితం.

8.సోక్రటీస్ వేదాంతం ఈ మానవాళికి ఆదర్శం. మేదావుల జీవిత గాధలు వారి తత్వవిషయాలను నిరంతరం అధ్యయనం చేస్తుండాలి. నీ కంటూ ఒక ఆలోచాఅ విధానం తత్వ విచారం ఉండాలి.

9. ప్రతీ వ్యక్తి తన జీవితంలోఒక ప్రత్యేక ప్రయోజనాన్ని సాధించాడానికి ఈ ప్రపంచం లోకి వచ్చారు. భగవంతుని చేత ఇవ్వబడిన ఆ మహాత్కర కార్యం ఏమిటన్నది నీకు ఏ ఉపాధ్యాయుడు గాని స్నేహితుడు గాని చెప్పడు. నీకు నీవుగా తెలుసుకోవాలి. నీ జీవితప్రయోజనాన్ని సాధించడమే నీ లక్ష్యం కావాలి.
10. కాలం చాలా ముఖ్యమైనది. కోల్పోతే తిరిగిరాననిది కాలం మాత్రమే. నీ ఆలోచనలు ఇతరులకి తెలియచెయడానికి వారి ఆమోదం పొండడానికి సమయం వ్రుధా చేయవద్దు. నీ అంతరాత ప్రబోధం ప్రకారం ఏది సరియైనది ఏది కాదో నిర్ణయించుకుంటూ ముందుకు సాగిపోవడమే. ధైర్యంగా నీ అంతరాత్మను అనుసరించడమే మిగిలినవి దానికవే అనుసరిస్తాయి

1 comment: