Saturday, 17 November 2012
Wednesday, 14 November 2012
పసి(డి) మనస్తత్వాలు
పిల్లలు దేవుడూ చల్లని వాళ్ళే.. కల్లాకపటం ఎఱగని కరుణామయులే..... ఈ మాట ఎందుకు అన్నారేమో గాని ...బాలల దినోత్సవం సందర్భం గా పిల్లలనుండి మనం నేర్చుకోవలసింది ఏదైనా ఉందంటే...
1. వర్తమానం లోనే జీవించడం ;
పిల్లలు గతాన్ని వేగం గా విస్మరించగలరు. భవిష్యత్ గురించి పెద్దగా భయం పెట్టుకోరు. ఎలా అంటే ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటే.. ఆ విషయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్తే ఆ రెండు ఇళ్ళ మధ్య జీవితాంతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంటుంది. కాని ఆ ఇద్దరు పిల్లలు కొంత సమయం గడవగానే అతి మామూలుగా కలిసిపోయి చెట్టాపట్టలేసుకొని ఆడుకుంటారు. వారి మధ్య జరిగింది వెంటనే మరచి పోతారు.. అంతే కాకుండా మరుసటి రోజు పబ్లిక్ పరీక్ష ఉన్నా ఏ మాత్రం జరగబోయే దాని గురించి ఆలోచించకుండా హాయిగా టీ వి చూడగలరు, క్రికెట్ ఆడగలరు. పెద్దవాళ్ళు మాత్రం ఇలా అయిత్ భవిష్యత్ ఏమయిపోతుందో అడుక్కొని తినాలి అదీ ఇదీ అని తెగ్ హైరానా పడిపోతుంటారు... పిల్లలనుండి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే వీలైనంత వరకు వర్తమానాన్ని ఆనందించడం.
2. సృజనాత్మక మరియు ఊహాశక్తిని వినియోగించడం;
పిల్లలనుండి మనం నేర్చుకోవలసిన మరో ముఖ్యమైన విషయం గానుగెద్దులా తిరిగిన చోటే తిరుగుతూ, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ అన్నట్టు ఒకే బాణీ కొనసాగించకుండా జీవితం లో మనం చేసే ప్రతి విషయం లోనూ నవీనత్వానికి సృజనాత్మకతకు ప్రయత్నించడం.. ముఖ్యంగా ఆడవాళ్ళు. వంకాయ కూర చేస్తే జీవితాంతం ఒకటైపే తప్ప. మరో రకంగా ప్రయత్నిద్దాం అని ఉండదు. చిన్న పిల్లలు కథ చెప్పినా, లేదా పాఠశాల లో జరిగిన విషయం చెప్పిన కావల్సినంత సృజనాత్మకత ఉంటుంది.
3. కావల్సింది పొందాలనే పట్టుదల కలిగి ఉండటం;
పిల్లలు ఏదైనా పొందాలనుకుంటే దాని యొక్క సాధ్యాసాధ్యాలు గురించి ఎలాగైనా పొందాలని కోరుకుంటారు . వారి మొండి పట్టుదల చూసి తల్లిదండ్రులు వీలైనంత ప్రయత్నించి కోరిక తీర్చడానికి ప్రయత్నస్తారు. చందమామ పొందాలన్న బాలరాముడి కోరిక కనీసం అద్దం లో ప్రతిబింబం అయినా దగ్గరనుండి చూడటానికి అవకాశం కలిగింది. మనం పెద్ద అవుతున్నకొద్దీ సాధ్యం కాదనే ఆలోచన పెంచుకొని మన కోరికల్ని అణచుకొని అసంతృప్తితో జీవించేస్తుంటాం.
4. సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉందటం
పిల్లలు తాము నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులుగాని మిగిలిన పెద్దవారు గాని చెప్పితే అది నిజమా కాదా ఎంతవరకు సాధ్యం అనే లేనిపోని లాజిక్కుల గురించి ఆలోచించకుండా సంపూర్ణమైన నమ్మకం కలిగియుంటారు. స్పైడర్ మేన్ అయినా శక్తిమాన్ అయినా ఏదైనా అవి నిజమే అనే నమ్మకాన్ని కలిగి యుంటారు. ఇలా నమ్మడం వలన పెద్ద వాళ్ళమైన మనం చీకటిని భూతాల్ని అవి ఇవి అని లేనిపోని భయాలు వారికి నేర్పిస్తామన్నది వేరే విషయం. పెద్దవాళ్ళమయితే ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఎలా అది ఎలా అని నమ్మాల్సిన విషయాలు నమ్మడం మాని బురిడీ బాబాల వద్ద, పొంగించి పబ్బం గడుపుకునే వాళ్ళ వద్ద బోర్లా పడుతుంటాం.
5. శాశ్వతమైన మమకారాలు పెంచుకోకూడదుః;
పిల్లలు తమ వస్తువుల్ని, బొమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు. అవి విరిగినా, పని చేసినా, పని చేయకపోయినా అన్నింటినీ ఒక బుట్టలో పెట్టి అతి జాగ్రత్తగా దాస్తారు. కాని అతి త్వరలోనే వాటికి తమకు ఏమీ సంబంధం లేదన్నట్టు ఒక మూలన పడేసి యోగిలా ఒక నవ్వు నవ్వుతారు. మనమో లేని పోని బంధాలు ఆఖరికీ అతి అశాశ్వతమైన ఫేస్ బుక్ లో కూడా మనకంటూ శతృవులు, వర్గాలు, కారాలు, మిరియాలు నూరడాలు ఒకటేమిటి. చెప్పుకుంటూ మరలా బాలల దినోత్సవం వచ్చేస్తుంది. ఎవరు కనపడినా వారు స్నేహితులైనా కకపోయినా తెలిసిన వారైనా తెలియని వారైనా నవ్వుమొహంతో పలకరిస్తారు. అంతే కాని ఎదుటివాడు ముందు పలకరిస్తాడులే అని వెర్రి చూపులు చూడరు.
బాలల దినోత్సవం రోజైన పసిడి లాంటి పసిమనస్తత్వం మనం అలవరుచుకొని పిల్లమనస్తత్వం వదులుకుంటామని ఆశిస్తూ....
haram, koodali, trainer uday kumar, jalleda,
Monday, 1 October 2012
6 థింకింగ్ హేట్స్..... ఎడ్వర్డ్ డి బనో
బహుముఖ, విశ్లేషణాత్మక ఆలోచనల తో ఉత్తమ నిర్ణయాల ఎంపిక
జీవితం లో అనుకోని సంఘటనలు ఎదురయ్యేటపుడు, సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తినపుడు మనిషికైన, ఒక వ్యవస్థకైన సరియైన, స్పష్టమైన, తప్పిదాలకు తావు లేని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒక సంస్థలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోడానికి సమావేశాలు జరిగినపుడు అందులో ఫాల్గొన్న ఒక్కొక్కరు ఒక విధమైన ఆలోచన చేయడం వలన, తమ విధానమే సరియైనదని భావించడం వలన అనవసరమైన వాగ్వివాదాలు జరగడం, సమావేశాలు వాయిదా వేయడం అర్ధాంతరం గా ఆగిపోవడం లేదా అమూల్యమైన కాలం వృథా అవడం జరుగుతుంది.
ఈ సమస్యలకు సరియైన పరిష్కారం ఎడ్వర్డ్ ది బనో ప్రతిపాదించిన 6 థింకింగ్ హేట్స్... ఆరు విభిన్నమైన ఆలోచనా సరళులు. ఇది రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
ఒకటి. సమాంతర ఆలోచనా విధానం ( parallel Thinking ). రెండు పార్శ్వముఖ ఆలోచనా విధానం ( Lateral Thinking)
సమాంతర ఆలోచన విధానమంటే.. విధాన నిర్ణయ ప్రక్రియ లో ఫాల్గొంటున్న ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత అహం లేదా అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి ఒకే విధమైన మార్గదర్శక ఆలోచన విధానాన్ని అనుసరించాలి. అంటే అందరూ ఒకే కోణం లో ఆలోచిస్తే ఆ విషయం పై మరింత లోతుగా, విస్తృతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది.
1 WHITE HAT
..ఈ కోణం లో ఆలోచించేటపుడు అంతా కేవలం సమాచారం, వాస్తవాలు గణాంకాలు గురిమ్చి మాత్రమే తెలియచేయాలి. ఏమిటి? ఎందుకు? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అనే ప్రశ్నలకు సంబంధించిన వివరాల సేకరణ మరియు వాటి వ్యక్తీకరణ మాత్రమే చేయాలి. నిర్ణయం తీసుకునేందుకు సమస్య గురించి ఉన్న విషయాలను మాత్రమే తెలియచేయాలి. వ్యక్తిగత అభిప్రాయాలు గాని నమ్మకాలు గాని తెలియచేయకూదదు. గతం గురించిన వాస్తవ విషయాలు , గణాంకాలు వ్యక్తపరచాలి. ఈ విషయాలన్నీ నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడతాయి.
తమకు తాము గా వేసుకోవలసిన ప్రశ్నలుః
ఈ సమస్య గురించి నాకు ఏమిటి తెలుసు?
ఈ సమస్య గురించి నాకు ఏమి తెలియదు
ఈ సమస్య వలన తెలుసుకోవలసినవి ఏమిటి?
దీనికి సంబంధించిన గణాంకాలు, వాస్తవాలు న వద్ద ఏమిటి ఉన్నాయి?
2. RED HAT
ఈ కోణం నుండి ఆలోచించేటపుడు మనసులో ఉన్న భావాలను బహిరంగంగా వ్యక్త పరచాలి. ఈ సమస్య పట్ల దానికి సంబంధించిన నిర్ణయం కు సంబంధించి ఏ భావాలు కలిగితే ఉద్వేగాలు కలిగితే వాటిని హేతువుకు సంబంధం లేకుండా బహిరంగంగా వ్యక్తపరచాలి. ఒక విషయం గురించి ఆలోచించేటపుడు అచేతనం గా కలిగే భావోద్వేగాలు తెలియచేయాలి.
ఈ ఆలోచన విధానం వలన తీసుకోబడే నిర్ణయం లో అంతర్గతం గా ఉన్న లోపాలు, అది వ్యక్తులలో కలిగించే తీవ్ర ప్రకోపాలను ముందుగానే తెలుసుకోడానికి ఉపయోగపదుతుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి.
ఈ సమస్య గురించి నాకు మనసులో ఏమి అనిపిస్తుంది?
దీనికి సంబంధించి నా భావాలు భావోద్వేగాలు ఏమిటి?
నా భావాలకు తగ్గట్టుగా మరోక పరిష్కారం ఏదైనా ఉందా?
నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం సరియైన పరిష్కారం ఏమిటి?
3. BLACK HAT
ఇది నకరాత్మక, రంధ్రాణ్వేషక ఆలోచన విధానం. తీసుకోబఓయే నిర్ణయం లో గల లోపాలు, ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే జరగబోయే అనర్థాలు, సమస్యలు ముందుగానే తెలియచేస్తూ సాధ్యమైనంత వరకు నిర్ణయం వెనక్కి తీసుకోడానికి సంబంధించిన అంశాలను, అవసరాలను తెలియచేసే ఆలోచనా సరళి.. భయం, అనుమానం, అసూయ. మరియు కోపం మొదలగు నెగటివ్ ఆలోచనలతో కూడుకున్న అభిప్రాయాలను తెలియచేసే విధానం.
అయితే ఈ ఆలోచనా విధానం ప్రమాదకరమైనది మాత్రం కాదు. నిర్ణయం తీసుకోక ముందే ఇలా లోపాలని అన్వేషించడం వలన జరగబోయే అనర్థాలను ముందుగా గుర్తించి సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికల లో గల అసంపూర్తి విషయాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి
ఈ నిర్ణయం వలన జరగబోయే గొప్ప అనర్థం ఏమిటి?
ఈ నిర్ణయం లో లోపాలేమిటి?
ఇది విఫలమవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి?
దీని వలన కలిగే విష పరిణామాలేమిటి?
ఈ నిర్ణయం అమలు కాకుండా ఎలా ఆపగలను?
YELLOW HAT
.................ఇంకా ఉంది.....
జీవితం లో అనుకోని సంఘటనలు ఎదురయ్యేటపుడు, సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తినపుడు మనిషికైన, ఒక వ్యవస్థకైన సరియైన, స్పష్టమైన, తప్పిదాలకు తావు లేని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒక సంస్థలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోడానికి సమావేశాలు జరిగినపుడు అందులో ఫాల్గొన్న ఒక్కొక్కరు ఒక విధమైన ఆలోచన చేయడం వలన, తమ విధానమే సరియైనదని భావించడం వలన అనవసరమైన వాగ్వివాదాలు జరగడం, సమావేశాలు వాయిదా వేయడం అర్ధాంతరం గా ఆగిపోవడం లేదా అమూల్యమైన కాలం వృథా అవడం జరుగుతుంది.
ఈ సమస్యలకు సరియైన పరిష్కారం ఎడ్వర్డ్ ది బనో ప్రతిపాదించిన 6 థింకింగ్ హేట్స్... ఆరు విభిన్నమైన ఆలోచనా సరళులు. ఇది రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
ఒకటి. సమాంతర ఆలోచనా విధానం ( parallel Thinking ). రెండు పార్శ్వముఖ ఆలోచనా విధానం ( Lateral Thinking)
సమాంతర ఆలోచన విధానమంటే.. విధాన నిర్ణయ ప్రక్రియ లో ఫాల్గొంటున్న ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత అహం లేదా అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి ఒకే విధమైన మార్గదర్శక ఆలోచన విధానాన్ని అనుసరించాలి. అంటే అందరూ ఒకే కోణం లో ఆలోచిస్తే ఆ విషయం పై మరింత లోతుగా, విస్తృతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది.
1 WHITE HAT
..ఈ కోణం లో ఆలోచించేటపుడు అంతా కేవలం సమాచారం, వాస్తవాలు గణాంకాలు గురిమ్చి మాత్రమే తెలియచేయాలి. ఏమిటి? ఎందుకు? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అనే ప్రశ్నలకు సంబంధించిన వివరాల సేకరణ మరియు వాటి వ్యక్తీకరణ మాత్రమే చేయాలి. నిర్ణయం తీసుకునేందుకు సమస్య గురించి ఉన్న విషయాలను మాత్రమే తెలియచేయాలి. వ్యక్తిగత అభిప్రాయాలు గాని నమ్మకాలు గాని తెలియచేయకూదదు. గతం గురించిన వాస్తవ విషయాలు , గణాంకాలు వ్యక్తపరచాలి. ఈ విషయాలన్నీ నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడతాయి.
తమకు తాము గా వేసుకోవలసిన ప్రశ్నలుః
ఈ సమస్య గురించి నాకు ఏమిటి తెలుసు?
ఈ సమస్య గురించి నాకు ఏమి తెలియదు
ఈ సమస్య వలన తెలుసుకోవలసినవి ఏమిటి?
దీనికి సంబంధించిన గణాంకాలు, వాస్తవాలు న వద్ద ఏమిటి ఉన్నాయి?
2. RED HAT
ఈ కోణం నుండి ఆలోచించేటపుడు మనసులో ఉన్న భావాలను బహిరంగంగా వ్యక్త పరచాలి. ఈ సమస్య పట్ల దానికి సంబంధించిన నిర్ణయం కు సంబంధించి ఏ భావాలు కలిగితే ఉద్వేగాలు కలిగితే వాటిని హేతువుకు సంబంధం లేకుండా బహిరంగంగా వ్యక్తపరచాలి. ఒక విషయం గురించి ఆలోచించేటపుడు అచేతనం గా కలిగే భావోద్వేగాలు తెలియచేయాలి.
ఈ ఆలోచన విధానం వలన తీసుకోబడే నిర్ణయం లో అంతర్గతం గా ఉన్న లోపాలు, అది వ్యక్తులలో కలిగించే తీవ్ర ప్రకోపాలను ముందుగానే తెలుసుకోడానికి ఉపయోగపదుతుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి.
ఈ సమస్య గురించి నాకు మనసులో ఏమి అనిపిస్తుంది?
దీనికి సంబంధించి నా భావాలు భావోద్వేగాలు ఏమిటి?
నా భావాలకు తగ్గట్టుగా మరోక పరిష్కారం ఏదైనా ఉందా?
నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం సరియైన పరిష్కారం ఏమిటి?
3. BLACK HAT
ఇది నకరాత్మక, రంధ్రాణ్వేషక ఆలోచన విధానం. తీసుకోబఓయే నిర్ణయం లో గల లోపాలు, ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే జరగబోయే అనర్థాలు, సమస్యలు ముందుగానే తెలియచేస్తూ సాధ్యమైనంత వరకు నిర్ణయం వెనక్కి తీసుకోడానికి సంబంధించిన అంశాలను, అవసరాలను తెలియచేసే ఆలోచనా సరళి.. భయం, అనుమానం, అసూయ. మరియు కోపం మొదలగు నెగటివ్ ఆలోచనలతో కూడుకున్న అభిప్రాయాలను తెలియచేసే విధానం.
అయితే ఈ ఆలోచనా విధానం ప్రమాదకరమైనది మాత్రం కాదు. నిర్ణయం తీసుకోక ముందే ఇలా లోపాలని అన్వేషించడం వలన జరగబోయే అనర్థాలను ముందుగా గుర్తించి సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికల లో గల అసంపూర్తి విషయాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి
ఈ నిర్ణయం వలన జరగబోయే గొప్ప అనర్థం ఏమిటి?
ఈ నిర్ణయం లో లోపాలేమిటి?
ఇది విఫలమవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి?
దీని వలన కలిగే విష పరిణామాలేమిటి?
ఈ నిర్ణయం అమలు కాకుండా ఎలా ఆపగలను?
YELLOW HAT
.................ఇంకా ఉంది.....
Sunday, 23 September 2012
బాల్యాన్ని ప్రేమిద్దాం రండి......
జడబారిన హృదయాల్లో జడివానలాంటి ఆలోచనలు రేకెత్తించే చిరు(గ)జల్లు.......
తండ్రి అడుగుజాడల్లో ప్రస్థానాన్ని ప్రారంభించిన తండ్రికి తగ్గ తనయ చిరంజీవి సంస్కృతి...
సంగీత మరియు సాహిత్య ప్రియులకు గజల్ శ్రీనివాస్ సుపరిచితులు. ఆలోచనాంబుధిలో ఓలలాడించే సరస సాహిత్య ప్రక్రియ అయిన గజల్ ను విదేశాలనుండి దిగుమతి చేసుకున్నప్పటికీ మన సంస్కృతి, మానవీయ విలువలతో ఒక వినూత్న గానసరళి లో తనదైన ప్రత్యేక శైలిలో తెలుగు గజల్ కు దశా దిశా నిర్దేశం చేసిన గజల్ శ్రీనివాస్ ఈ రచనా ప్రక్రియని పదిమందికి తెలియచేస్తూ ఎందరో గజల్ రచయితల గజల్లను తెలుగు శ్రోతలకు పరిచయం చేస్తూ కొత్త ఒరవడి ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగమే ఇటీవల విడుదల అయిన చిరు(గ)జల్లు ఆడియో సి.డి.
ఈ తెలుగు గజల్ అడియీ సి.డి. ప్రత్యేకత మరియు ఆయన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ మైలురాయి ఏమిటంటే ఈ సి.డి లో గజల్లను తన ముద్దుల కుమార్తే చిరంజీవి సంస్కృతి చే పాడించడం. విశ్వవ్యాప్తంగా గజల్ గానంతో స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ గజల గాన వైతాళికుని వారసురాలుగా సంస్కృతి పాడిన తీరు, మధురమైన, గుండెల్లో మెళికలు తిప్పే కొన్ని సున్నితమైన భావాలను పలికిన తీరు మంద్రమైన స్వరం లో కొన్ని భావాలను వ్యక్తపరచిన తీరు సంగీతం లో ఏ మాత్రం ప్రవేశం లేని వారితో సైతం శభాష్ అనిపిస్తాయి. సంగీతం తెలిసినవారికి రాగయుక్తం గా ఎక్కడా శృతితప్పకుండా పాడిన విధానం ఔరా అనిపించి నిండైన మనసుతో ఈ చిన్నారి దీవెనల పెనుజల్లు కురిపిస్తాయి.
గజల్ శ్రీనివాస్ గారి పరిచయ వాక్యాలతో ప్రారంభమయ్యే ఈ సి.డి లో మొత్తం 7 గజల్లు ఉన్నాయి. మొట్ట మొదటి గజల్ గురుదేవులు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రచించిన '' మంచుపొగలుండేవి మరికొద్ది క్షణాల్లే - ఆ పిదప నిండేవి ఆదిత్య కిరణాలే '' అనే గజల్ నిండైన వ్యక్తిత్వపు నమూనా ను ఆవిష్కరిస్తుంది. ఇదే పంథాలో మంచి సహితీ విలువలతో కూడిన భావపరంపర ను కలిగించే '' జీవిత సత్యాల గురించి చెట్టేమని అంటుంది" అంటూ డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారి గజల్, " నమ్మదగిన మనిషేది అమ్మ తప్ప " అంటూ శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు గారి గజల్ మరియు " ఎంత గాయం చేసినా " అంటూ శ్రీ సురారం శంకర్ గారి గజల్ తెలుగు భాష లో గజల్ ప్రక్రియ ద్వారా తేలికైన పదాలతో బరువైన భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి.
ఈ చిరు గజల్లు ఆడియో సి.డి ప్రత్యేకత మరియు తలమానికంగా చెప్పే గజల్లు ఏమిటంటే మన చిన్నారులు కార్పోరేట్ విద్యా విధానం వలన, బిజీ బిజీ బ్రతుకుల్లో బానిసలమవుతూ మనం విస్మరిస్తున్న అరుదైన బాల్యం పడుతున్న గాయాల గురించి తెలియచేయడమే కాకుండా వింటున్న ప్రతీ తల్లిదండ్రులు భుజాలు తడుముకునే విధంగా , తాము వెంటనే తెలుసుకోవలసిన తమ పిల్ల హృదయాల వేదన గురించి కర్తవ్య బోధన చేస్తాయి. ముఖ్యంగా డాక్టర్ తటపర్తి రాజగోపబాలం రచించిన " అమ్మ చేతి ముద్దలు" అనే గజల్ హాస్టల్ లో ఉండే పిల్లల అవ్యక్త వేదనను కన్ను చమర్చేలా వివరిస్తుంది. డాక్టర్ ఎం.బీ.డి. శ్యామల గారు రచించిన " అందమైన బాల్యానికి గాయం అయిందా?" అనే గజల్ నేటి విద్యా వ్యవస్థ లో నలుగుతున్న పిల్లల అత్యంత విలువైన సహజ హక్కు అయిన బాల్యం పడుతున్న వేదన మనలో మానని గాయాలను రగిలిస్తుంది.
ఈ ఆడియో సి.డి లో చివరి గజల్ ప్రేమాభిమానలతో, ముద్దు ముచ్చట్లతో కోలాహలంగా ఉండాల్సిన ఇంట్లో చిన్న పిల్లలు ఒంటరి తనాన్ని ఎందుకు ఎలా అనుభవిస్తున్నారో తెలియచేస్తుంది. నీ పిల్లలకు నీవిచ్చే గొప్ప బహుమతి ఒక గంట వారితో గడపటం అనే మాట నిజమనిపిస్తుంది. ప్రేమాభిమానాలనే నీరుపోసి పెంచాల్సిన ఈ పాదులు ఎలా ప్రేమరాహిత్యమనే ఎడారికి ఎలా బలవుతున్నాయో తెలియచేస్తుంది. తల్లిదంద్రుల ప్రధమ కర్తవ్యం మంచి భవిష్యత్తు ఇవ్వడం మాత్రమే కాదు బంగారు బాల్యాన్ని ఆనందంతొ తనివితీరా అనిభవించే అవకాశం కలిపించాలనే కర్తవ్య బోధన చేస్తాయి.
ఈ గజల్లు వింటే పన్నెండు సంవత్సరాల లే లేత ప్రాయం లో ఉన్న ఒక పసిగొంతు పాడిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.. '' ఇలా తయారు చేసారు దేశాన్ని ఏం త్రాగి బ్రతకాలి కంటి చెమ్మ తప్ప ?'' ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకు.. ఏం పట్టుకొచ్చారు జన్మ తప్ప ? అని ఆరిందలా ప్రశ్నిస్తుంటే భావ వ్యక్తీకరణలో ఆ గొంతు గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
బాల్యం ఎదుర్కుంటున్న సమస్యల పట్ల వారి బాల్యాన్ని వారు అనుభవించాల్సిన ప్రాధాన్యత ను గుర్తు చేసే
అంశాలతో కూడిన గజల్లను ఎన్నుకోవడం హర్షించతగ్గ విషయం. ప్రతీ తల్లిదండ్రులు తప్పక వినాల్సిన ఆడియో సి>డి. పుట్టినరోజు లకు కానుక ఈ ఆడియో సి.డి ఇస్తే అంతకు మించిన విలువైన కానుక ఏదీ ఉండదు.
చిరంజీవి సంస్కృతికి హార్ధిక అభినందనలు. తండ్రి వారసత్వానికి తొలి అడుగు వేల వేల మైళ్ళ ప్రయాణం కావాలని సంగీత ప్రపంచం లో చిరస్థాయి స్థిర స్థాయిగా నిలవాలని ఆశీర్వదిస్తూ.....
అలజంగి ఉదయ్ కుమార్
koodali.org, haaram, jalleda, telugu gazels, gazal srinivas, trainer uday kumar
Friday, 21 September 2012
MANAGEMENT LESSONS FROM THE GREAT POEM DESHAMUNU PREMINCHUMANNAA WRITTEN BY SRI GURAJADA APPA RAO GARU
కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావు గారు షుమారు 102 సంవత్సరాల క్రితం రాసిన అజరామరమైన ఈ గీతం నుండి గ్రహించ వలసిన పాఠాలు, జీవిత సత్యాలు అనేకం....
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
1. BE A TRUE PATRIOT
2. WORK FOR THE EXPANSION OF GOOD AMONG THE PEOPLE
3. STOP TALKING THE THINGS WHICH ARE NOT USEFUL TO ANY
4. DO CONSTRUCTIVE HELP TO OTHERS
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
కండ కలవాడేను మనిషోయ్
5. DEVELOP THE AGRICULTURAL PRODUCTS
6. TAKE HYGIENIC FOOD FOR SOUND BODY
7. STRONG BODY IS ASSET FOR PEOPLE
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
8. COUNTRY WILL NOT FETCH WITH THE LAZY AND WEAK PEOPLE
9. DEVELOP YOUR ARTS AND SKILLS
7. STRONG BODY IS ASSET FOR PEOPLE
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
8. COUNTRY WILL NOT FETCH WITH THE LAZY AND WEAK PEOPLE
9. DEVELOP YOUR ARTS AND SKILLS
10 PRODUCE INDIGENOUS GOOD
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
11. PROMOTE THE SALES OF INDIGENOUS GOODS
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
11. PROMOTE THE SALES OF INDIGENOUS GOODS
12. MONEY BRINGS YOU FAME AND PROSPERITY
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
13. DONT LIVE IN YOUR PAST
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
13. DONT LIVE IN YOUR PAST
14. FOCUS ON FUTURE
15. NEVER BE COMPLAISANT
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
16. HAVE COMPETITION IN EDUCATION
17. HAVE FIGHTING SPIRIT IN BUSINESS
18. NEVER HAVE GRUDGES AND ENEMITY
19. AVOID WARS AND ENEMITY
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
20. NEVER EX AGGREGATE YOUR PATRIOTISM
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
20. NEVER EX AGGREGATE YOUR PATRIOTISM
21. DO SOMETHING GOOD FOR THE PEOPLE
21. YOUR DEED SHOULD SPEAK NOT THE WORDS
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
22. IMPATIENCE IS DANGEROUS FOR COUNTRY
23. ENJOY OTHERS SUCCESS
24. LEARN TO BE UNITED
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
25. JEALOUS MAN NEVER BE HAPPY
26. ONE FEELS OTHERS GOOD AS HIS WILL HAVE LOT OF GOOD
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
27. SACRIFICE YOUR PROFIT TO HELP THE OTHER
28.COUNTRY IS MADE BY THE PEOPLE NOT BY LAND
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
29. LIVE WITH CO OPERATION AND CO EXISTENCE
30 FRATERNITY AMONG THE RACES AND RELIGIONS
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
31. DEVELOP UNITY AMONG THE MINDS OF ALL RELIGIONS
32. NATIONAL INTEGRITY FETCHES SUCCESS
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
33. DEVELOP LOVE AMONG THE NATION
34. PERSPIRE IN ORDER TO PROSER
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
35. LITERATURE AND POETRY SHOULD BE DEVELOPED
36. ART AND LITERATURE SHOULD BRING NAME AND FAME TO THE NATION
ఇవి నాకు అర్థమైన భావాలు. మీరు విభ్ధించినా పరవాలేదు. కేవలం ఒక పాటగా కాకుండా కర్తవ్యోణ్ముఖుల్ని చేసే ఒక అభ్య్దయ గీతం గా గురజాడ గారి పాటను స్మరిస్తూ పాటిస్తే అదే మనం ఆ మహానీయునికిచ్చే గొప్ప నివాళి..
Wednesday, 19 September 2012
వినాయక రూపం చెప్పే వివిధ జీవన విధానాలు
మితృలందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నీ విఘ్నాలు, ఆటంకాలు తొలిగిపోయి మనం
చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని ప్రతీ కార్యక్రమాన్ని
వినాయక పూజతో మొదలుపెట్టడం ఆనాదిగా వస్తున్న ఆచారం.
అన్నీ
దేవతా విగ్రహాలకన్నా వినాయక విగ్రహానికి ప్రత్యేకత ఉంది. సామాజిక
అడవులంటూ పర్యావరణ్ వేత్తలంతా చెబుతున్న విషయాలు వినాయక పూజలో మనం
ఉపయోగించాల్సిన పత్రులు చూస్తే ఎన్ని రకాల చెట్లు మన ఊరి సమీపంలో ఉండేవో
మనకు అర్థం అవుతుంది. అంతే కాకుండా వినాయక విగ్రహ రూపాన్ని నిశితంగా
పరిశీలిస్తే.................. సింబాలిక్ గా మనం జీవించాల్సిన విధానాన్ని
చెప్పారనికూడా ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు.
1. భారీ పరిమాణంలో
ఉండే తలః ప్రతీ విషయాన్ని పెద్ద గా ఆలోచించాలని జీవితంలో తలకు దానితో
ఆలోచించాల్సిన ప్రాధాన్యతను తెలుపుతుంది. Low Aim is Crime అని అబ్దుల్
కలాం గారు అన్నట్టు. ఉన్నత లక్ష్యాలను ఉన్నత ఆలోచనలతో చేధించాలని పెద్ద తల
చెబుతుంది.
2. ప్రతీ విషయాన్ని
నిశితం వినాలని చెప్పే పెద్ద చెవులు.మనం మాట్లాడటానికి ఇచ్చే ప్రాధాన్యత
వినడానికి ఇవ్వం. అనేక సమస్యలకు మూల కారణం అసలు వినకపోవడం, సరిగా
వినకపోవడం, పూర్తిగా వినకపోవడం. వినాయక విగ్రహ రూపం మనకు చెప్పే గొప్ప
విషయం వీలైనంతగా వినమనే.
3. సూక్ష్మ దృష్టి తో పరిశీలించమని
చెప్పే చిన్న కళ్ళుః ఏ విషయాన్నైనా నిశితంగా, పూర్తి ధృష్టిని పెట్టి
చూడాలి. కేవలం విని నిర్ణయానికి రాకుండా సూక్ష్మపరిశీలనతో స్వయంగా
తెలుసుకోవాలని చిన్న కళ్ళు చెబుతుంటాయి.
4. తక్కువమాట్లాడమని
చెప్పే చిన్న నోరు. నోరు ఉంది కదా అని, వినే వాళ్ళు దొరికారు కదా అని ఏది
పడితే అది మట్లాడకుండా ఉపయోగమైనవి మాత్రమే పరిమితంగా మాట్లాడాలని చిన్న
నోరు చెబుతుంది.
5. ఇఅతురులకు మంచి జరుగుతుందంటే నీ కున్న ఆయుధాలలో లేదా సంపత్తి లో సగం వదులుకొని మిగిలిన సగంతో జీవించు అని చెప్పే ఏక దంతం.
6. భారీ గా, సమర్థవంతంగా, సంకోచ వ్యాకోచాలతో కోరుకున్న దాన్ని కదలకుండా
పొందగలిగేందుకు వీలుగా ఉన్న తొండం మనం చేయాల్సిన కృషి ఎలా ఉండాలో
చెబుతుంది.
7. విశాలంగా భారీ గా ఉన్న ఉదరం మనం సంపాదించింది అంటా
ఖర్చుపెట్టకుండా దాచుకోవాలని చెబుతుంది. ఎంత మొత్తం మనకు అందుబాటులో
ఉంటే అంత విశ్వాసంతో, నమ్మకంతో దర్పంగా మనం జీవించగలుగుతాం.
8.
చేతుల్లో ఉండే పలు రకాల ఆయుధాలు, ఉండ్రాళ్ళు మనల్ని మనం కాపాడుకునేందుకు
ఉప్యోగపడే ఆయుధాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని, శక్తినిచ్చే ఆహారాన్ని
ఎప్పటికప్పుడు తీసుకుంటుండాలని చెబుతుంటాయి.
9. జీవితంలో మనం
రకరకాల కోరికలపై స్వారీ చేస్తుంటాం. ఎలుకల్లా మన కోరికలు మన ఆధీనంలో
ఉన్నాయా లేదా కోరికలే గుర్రాలై మనల్ని పరిగెత్తెస్తున్నాయా అనేదే ముఖ్యం.
ఎంత చిన్న కోరికలుంటే మనం ప్రయాణం అంత సాఫీగా జరుగుతుంది అనేది మూషిక
వాహనం చెబుతుంది.
10. ఎల్లప్పూడూ చిరు మందహాసం తో, అందరి మేలు కోరుతూ ఆశీర్వదిస్తూ ఉండమని అభయ హస్తం చిరు మందహసం చెబుతాయి.
దీంట్లో లాజిక్ ఎంత? ఎంతవరకు సత్యమ్ ఎంతవరకు కల్పితమనే
ఆలోచనలు మాని పండుగని ఉత్సాహం తో, ఆనందంతో జరుపుకుందాం... మన
కార్యాల్లో మన లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నత జీవనం వైపు
పరిశ్రమించాలని మన యత్నాలని విజయవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.
3. సూక్ష్మ దృష్టి తో పరిశీలించమని చెప్పే చిన్న కళ్ళుః ఏ విషయాన్నైనా నిశితంగా, పూర్తి ధృష్టిని పెట్టి చూడాలి. కేవలం విని నిర్ణయానికి రాకుండా సూక్ష్మపరిశీలనతో స్వయంగా తెలుసుకోవాలని చిన్న కళ్ళు చెబుతుంటాయి.
4. తక్కువమాట్లాడమని చెప్పే చిన్న నోరు. నోరు ఉంది కదా అని, వినే వాళ్ళు దొరికారు కదా అని ఏది పడితే అది మట్లాడకుండా ఉపయోగమైనవి మాత్రమే పరిమితంగా మాట్లాడాలని చిన్న నోరు చెబుతుంది.
5. ఇఅతురులకు మంచి జరుగుతుందంటే నీ కున్న ఆయుధాలలో లేదా సంపత్తి లో సగం వదులుకొని మిగిలిన సగంతో జీవించు అని చెప్పే ఏక దంతం.
6. భారీ గా, సమర్థవంతంగా, సంకోచ వ్యాకోచాలతో కోరుకున్న దాన్ని కదలకుండా పొందగలిగేందుకు వీలుగా ఉన్న తొండం మనం చేయాల్సిన కృషి ఎలా ఉండాలో చెబుతుంది.
7. విశాలంగా భారీ గా ఉన్న ఉదరం మనం సంపాదించింది అంటా ఖర్చుపెట్టకుండా దాచుకోవాలని చెబుతుంది. ఎంత మొత్తం మనకు అందుబాటులో ఉంటే అంత విశ్వాసంతో, నమ్మకంతో దర్పంగా మనం జీవించగలుగుతాం.
8. చేతుల్లో ఉండే పలు రకాల ఆయుధాలు, ఉండ్రాళ్ళు మనల్ని మనం కాపాడుకునేందుకు ఉప్యోగపడే ఆయుధాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని, శక్తినిచ్చే ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటుండాలని చెబుతుంటాయి.
9. జీవితంలో మనం రకరకాల కోరికలపై స్వారీ చేస్తుంటాం. ఎలుకల్లా మన కోరికలు మన ఆధీనంలో ఉన్నాయా లేదా కోరికలే గుర్రాలై మనల్ని పరిగెత్తెస్తున్నాయా అనేదే ముఖ్యం. ఎంత చిన్న కోరికలుంటే మనం ప్రయాణం అంత సాఫీగా జరుగుతుంది అనేది మూషిక వాహనం చెబుతుంది.
10. ఎల్లప్పూడూ చిరు మందహాసం తో, అందరి మేలు కోరుతూ ఆశీర్వదిస్తూ ఉండమని అభయ హస్తం చిరు మందహసం చెబుతాయి.
దీంట్లో లాజిక్ ఎంత? ఎంతవరకు సత్యమ్ ఎంతవరకు కల్పితమనే ఆలోచనలు మాని పండుగని ఉత్సాహం తో, ఆనందంతో జరుపుకుందాం... మన కార్యాల్లో మన లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నత జీవనం వైపు పరిశ్రమించాలని మన యత్నాలని విజయవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.
Sunday, 9 September 2012
Subscribe to:
Posts (Atom)
