Wednesday, 2 May 2012

వేసవి సెలవల్లో ....వినోదమే కాదు వికాసం కూడా......

వేసవి సెలవల్లో   ....వినోదమే కాదు వికాసం కూడా......

     హమ్మయ్యా!  పరీక్షలు అయిపోయాయి ఇక సెలవలే తెగ ఆడుకోవచ్చు.. ఇటువైపు పిల్లల కేరింతలు
   అయ్య బాబోయ్ వేసవి సెలవలొచ్చేసాయ్... వీరిని ఎలా కంట్రోల్ చెయ్యాలి దేవుడా.. అటు తల్లిదండ్రుల  తీరని చింతలు ..

  ఇది వరకటి రోజులలో సెలవలు ముఖ్యంగా వేసవి సెలవలు వస్తే చాలు తాత 
గారి ఊరు వెళ్ళడం అక్కడ మామిడి తోటలో మామిడికాయలు తెంపుకోవడం
వాటిని ఊరబెట్టడం, పళ్ళు  ముగ్గబెడితే ఎవరికీ తెలీకుండా దొంగలించడం
ఊరు చివర ఏటి ఒడ్డుకు స్నానాలకు వెళ్ళడం...  ఇదంతా గతం మాత్రమే..  ఆధునిక జీవన ప్రభావ ఫలితంగా పలుచబడుతున్న మానవ సంబంధాలు ఒకవైపు, పరిమిత సంతాన భావన ఒకవైపు పిల్లలు ఇతర ఊళ్ళకు వెళ్ళడం గాని లేదా పిల్లలను విడిచి తల్లిదండ్రులు ఉండలేకపోవడం వలన గాని పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు.
   అయితే ఇంటర్మీడియట్ మరియు పదవతరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కార్పోరేట్ పాఠశాలలు సెలవలు ఇవ్వడం లేదు. ఇతర తరగతుల పిల్లలకు సమ్మర్ కాంప్ లు నిర్వహిస్తుంటారు
   ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తీసుకోవలసిన  జాగ్రత్తలేమిటి ?  ఈ సెలవుల్ని మరింత ఉపయోగ పరం గా  ఎలా  వినియోగించుకోవచ్చో   వివరంగా చర్చిద్దాం. 
వేసవి శిక్షణా శిబిరాలు    ఈ రోజుల్లో ప్రతి ఊరిలో,  ప్రతి పాఠశాలల్లో  వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు.  అవకాశం ఉన్న తల్లిదండ్రులు  వీటిలో ఏ ఏ అంశాలు చెబుతున్నారు. నేర్పించేవారు ప్రొఫెషనల్ కోచ్ లా లేదా నామమాత్రం గా పేరుకోసం లేదా డబ్బులు కోసం నిర్వహిస్తున్నారో పరిశీలించి తమ పిల్లలను జాయిన్ చెయ్యాలి.  ఈ శిబిరాలు కూడా ఒకటి రెండు వారాల పాటు రోజుకి రెండు మూడు గంటలకన్నా  ఎక్కువ ఉండవు. ఉండకూదదు కూడా.   ఇంట్లో పిల్లలు ఉంటే  టీ.వీ చూసి పాడైపోతున్నారనో పిల్లలమీద విసుక్కోవడం. మరలా స్కూలు ఎప్పుడు తెరుస్తారంటూ ఎదురుచూడటం కాదు.  వేసవి సెలవల్లో వినోదం మరియు వికాసం పిల్లలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
1) చదువుకు సంబంధించిన అంశాలు;  ప్రతీ రోజు చదువుకి , ఆటలకి, టీ,వీ చూడటానికి ఇతర అంశాలకి ఎంతసమయం కేటాయించాలి  ఒక  టైం  టేబుల్  పిల్లలతో   చర్చించి  తయారుచేయాలి.  సెలవలంటే  చదువుని  పూర్తిగా  వదిలివేస్తే ముందు తరగతిలో నేర్చుకున్నది మరచిపోయే అవకాశం  ఉంటుంది.  ముందు  తరగతి  వార్షిక  పరీక్షల్లో  ఏ సబ్జెక్ట్ లో  వెనుకబడి  ఉన్నాడో  గుర్తించి ఆ  సబ్జెక్ట్ మరల రివిజన్ చెయ్యాలి. సెలవల అనంతరం ఏ క్లాస్ చదవబోతున్నాడో ఆ క్లాస్ కి సంబంధించి ముఖ్యమైన సబ్జెక్ట్స్ చదవడం కొంత మంచిది. ఇది రోజుకి రెండు లేదా మూడు గంటలు మాత్రమే. 
2) భాషా నైపుణ్యాలు పెంపొందించ డానికి సంబంధించిన అంశాలుః నేటి కాలం లో  విద్యార్థులు   లాంగ్వేజ్ లలో బాగా వెనుకబడి ఉంటునారు.  వారికి ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన  కథల పుస్తకాలు,చంద్ఫమామ, బాలమిత్ర,  కామిక్స్, జనరల్ నాలెడ్జ్  మొదలగు పుస్తకాలు కొని చదివించాలి.  వారికి నచ్చిన సినిమా పాటలు  విని రాయమని చెప్పడం,  ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బిగ్గరగా చదివించడం చేయించాలి.  వారు చూసిన సినిమా వారికి వచ్చిన భాషలో క్లుప్తంగా రాయమని చెప్పాలి.  అంతే కాకుండా వారి ఇంగ్లీష్ పెంచుకోడానికి  వీలైతే కమ్యూనికేషన్  స్కిల్స్ నేర్పిస్తున్న సంస్థలకు పంపించడం గాని , ఇతర పిల్లలతో కలసి వర్డ్ గేమ్స్ , పజిల్ నింపడం మొదలగు ఆటలు ఆడేటట్టు చూడాలి.   వారిని దగ్గరున్న పుస్తకాల షాప్ కి తీసుకెళ్ళి  కొన్ని పుస్తకాలు వారు ఎంచుకుని కొనేటట్టు చేయాలి. 
3) మెదడుని చైతన్యం చేసే అంశాలుః  వేసవి కాలంలో తగిన సమయం ఉంటుంది కాబట్టి  సుడోకు, చదరంగం, పజిల్స్, అబాకస్,  రుబిక్స్ క్యూబ్ మొదలగు  పిల్లలతో ఆడిస్తుండాలి. సుడోకు   సెల్ ఫోన్ లో  కాకుండా  పేపర్  మీద  నింపించాలి. రుబెక్స్ క్యూబ్ వలన లాజికల్  థింకింగ్ ,  లాటరల్  థింకింగ్  పెరుగుతుందని   నిరూపించబడింది. అవే కాకుండా క్యారమ్ బోర్డ్ కొని ఇంట్లో ఉంచితే ఎండలో తిరగరు సరికదా అది ఆడటం వలన బాడీ మైండ్ సమన్వయం పెరుగుతుంది. దగ్గరలో కంప్యూటర్ నేర్పే సంస్థలుంటే అందులో చేర్పించడం మంచిది.
4)  ఆటలు, శారీరక కృత్యాలుః వేసవి కాలంలో పిల్లల ఆటలకి అడ్డూ అదుపూ ఉండదు అంటారు. నిజమే వారు ఆడే ఆటలు లేదా ఇతర శారీరక కృత్యాలు వారికి తరువాత కూడా ఉపయోగపడాలి. కేవలం క్రికెట్ అంటూ ఎండలో మాడిపోకుండా.  ఉదయం పూట మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్ళడం, యోగా లేదా మెడిటేషన్ సెంటర్ దగ్గరలో ఉంటే అందులో జాయిన్ చెయ్యడం
  స్విమ్మింగ్ , సైక్లింగ్ నేర్పించడం, కొంచెం పెద్దవారైతే  గేర్లు లేని మోపెడ్ లేదా మోటార్ వెహికిల్స్ నేర్పించడం చెయ్యాలి. ఇండోర్ గేమ్స్ తో పాటు బయట ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  చిత్రలేఖనం, క్లే మౌల్డింగ్, నృత్యాలు మొదలగునవి వారిలో అభిరుచిని ఆసక్తిని పెంపొందింపచేస్తాయి.
5) ప్రయాణాలుః  చాలామంది వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు కాని ఇతర సందర్శనా ప్రదేశాలకు వెళుతుంటారు.  వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేసే టట్టు చూడండి.  వారు ప్రతీ రోజు టూర్ డైరీ రాయడం, అక్కడ ఉన్న విశేషాలను తెలుసుకోవడం వారిలో ఆసక్తి పెంపొందించడం ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలే.  ప్రయాణాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వారిని విసుక్కోవడం  కసరుకోవడం చేయరాదు.  ఆ ప్రదేశాల్లో ప్రకృతి, అక్కడ ప్రజల జీవన విధానం, సంస్కృతి తెలుసుకునేటట్టు చూడాలి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలకు తీసుకువెళ్ళి వారు అవి తెలుసుకునేటట్టు చూడాలి. 
6) ఇంట్లో పనులు నేర్పించడం; పిల్లలకి  వారి పనులు వారు చేసుకునేటట్టు నేర్పించే బాధ్యత ఇంట్లో ఆడవారిదే. అమ్మాయైనా  అబ్బాయైనా, లేచిన వెంటనే పక్క సర్దుకోవడం,  బీరువాలో బట్టలన్నీ మరలా సర్దుకోవడం. ఇంట్లో ఉన్న గ్రోసరీ మరలా సర్దుకోవడం, డ్రాయింగ్ రూం  ఫర్నీచర్ సర్దడం, శుభ్రంగా ఉంచడం  పిల్లలకి ఈ వయసులోనే నేర్పించాలి.  వారు చేసే ప్రతీ పనికి తగిన బహుమానం ఉండాలి. పాలు మరగించుకోవడం, ఆమ్లెట్ వేయడం, టీ తయారుచేయడం, ఇంట్లో గెస్ట్స్ వస్తే  మమ్చినీళ్ళు, స్నాక్స్, టీ  అందించడం నేర్పించాలి. గెస్ట్స్ వచ్చినపుడు వచ్చి బాగున్నారా అని పలకరించడం ఇటువంటు మర్యాదలు నేర్చుకునేందుకు వేసవి కాలమే సరియైన  సమయం. పిల్లలతో ఐస్ క్రీం తయారుచేయడం, జ్యూస్ తయారు చేఅడం వంటల్లో ప్రయోగాలు ఇంట్లో చక్కని స్నేహపూరిత వాతావరణం ఏర్పరుస్తుంది, మా అమ్మాయి చేసిన కేక్,   ఐస్ క్రీం అంటూ చ్ట్టు పక్కల వాళ్ళకి పంచుతుంటే   వచ్చే ఆనందం చెప్పలేనిది కాక పోతే కాస్త రుచి చూసాక పంచండి. 
7) భక్తి, పూజా కార్యక్రమాలు;  పిల్లలో భక్తిశ్రద్ధలు  పెంపొందింప చేసేందుకు  తగిన  సమయం ఇదే. పుణ్యక్షేత్ర దర్శన, ఉదయం శ్లోకాలు చదివించడం, పూజా విధానం నేర్పించడం.  పిల్లలలో చాలా మార్పును తీసుకువస్తుంది. పెద్దల్పట్ల గౌరవమర్యాదలు ఇవన్నీ వారికి నైతికాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. 
8 ) ప్రకృతి పై అవగాహన కల్పించడం;   పెరడులో గాని ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే కుండీలలో లేదా నేల పై మొక్కలు పెంచడం,  కొన్ని ధనియాలు వారికి
ఇచ్చి  నేలపై నాటిస్తే కొన్ని రోజులకి అవి కొత్తిమీరగా వస్తే ఎంత ఆశ్చర్యపోతారో మీరే చూడండి.  అవకాశం ఉన్న   వాళ్ళు  కాయగూరలు  పండించండి. అదేదో వ్యాపారం  లేదా వ్యవహారం  కాదు  అలా  చేయడం  వలన  కాయగూర  బోజనం అంటే చిరాకు పడకుండా ఉంటారు. అవి పండించిన వారి కష్టం గుర్తిస్తారు.  జూకి, బీచ్ కి తీసుకెళ్ళడం వలన వారికి ప్రకృతి పట్ల ఇష్టం ఏర్పడుతుంది.  వీలైతే దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోం కి , అనాథాశ్రమం కి తీసుకెళ్ళండి. తరువాత వారి ప్రవర్తనలో కలిగే మార్పులు చూడండి.
9) ప్రేమాభిమానాలు పంచుకునేందుకు, పెంచుకునేందుకు తగిన సమయం ;  పిల్లలతో తప్పనిసరిగా కల్సి భోజనం చెయ్యాలి. సెలవల్లో వారానికి రెండుసార్లు  బయటకు వెళ్ళాలి.   చిరాకు పడటం, కోపించడం మానివేయాలి.  వారు గీచిన  చిత్రాలకు,   చేసిన వంటకు ఎలాగున్నా మెచ్చుకోవాలి తగిన బహుమతులివ్వాలి.  వారి ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిపించుకొని ఆడుకొనే స్వేచ్చ నివ్వాలి. వారి ముందు ఎటువంటి పరిస్థితుల్లో  కలహమాడరాదు. ఇతరులని దూశించరాదు.
             ఇవన్నీ ఆచరణ  సాధ్యమా    అంటూ దీర్ఘాలు తీయకండి.   ప్రయత్నిద్దాం.   మన పిల్లల గురించే కదా....... మామూలు రోజులలో చదువు, మెదడు ఈ రెండింటికి తప్ప  మిగిలిన వాటికి పని ఉండదు. అభివృద్ధి ఉండదు. ఈ వేసవి సెలవుల్లో పిల్లల మానసిక, శారీరక, భావోద్వేగ, ఆథ్యాత్మిక మరియు నైతిక అంశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోడానికి కాస్త సమయం ఉంటుంది.   స్కూల్ లో  సెలవలు ఇవ్వలేదని మీరు వారిని నిందించకండి.   మీ బట్టే వాళ్ళు .. నిలదీయండి..  పిల్లల్ని ఎదగనీయండి..    పిల్లలనే మొక్కలు ఏ చీడపడకుండా పెంచే తోటమాలులు మీరేనన్న సత్యం విస్మరించకండి
  ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com


(ఇంకా ఉంది)

Sunday, 19 February 2012

Time Management

                Time Management అనేది ఈ రోజుల్లో అత్యంత తరుచుగా చర్చించబడే విషయం అయిపోయింది. ఇంతకు ముందు ఈ విషయం కేవలం కార్పోరేట్ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులకు, కార్యనిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విషయంగా పరిగణించే వారు.
నర్సరీ పిల్లాడి నుండి విశ్రాంత జీవనం గడిపేవారి దాక ఈ రోజుల్లో అందరినోటినుండి వచ్చే మాట ఒక్కటే. సమయం చాలడం లేదు.                               ఒక్కోసారి పిల్లలు తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు '' రోజుకి ఇరవై నాలుగంటలే ఎందుకు మరో రెండు గంటలు ఎక్కువ చెయ్యవచ్చు కదా.'' అని. మనలో కొందరికి నిజమే కదా అనే ధర్మసందేహం కూడా వస్తుంది. పూర్వం వ్యవసాయ ప్రధాన మరియు ఉమ్మడి కుటుంబాలు ఉండే సమయాలలో ఉన్న సమయం అందరికీ సరిపోయేదేమో కాని నేటి ఆధునిక, పారిశ్రామిక, వ్యష్ఠి కుటుంబాల కాలం వచ్చే సరికి రోజు రోజుకి విస్తృతమౌతున్న పని ఒత్తిడి ఏ పని సమయానికి అనుకున్నట్టు గా జరగనీక తీవ్ర నిరాశకు నిస్పృహలకు అంతే కాకుండా పలుచనైపోతున్న ఆత్మీయ బంధాలకు దారి తీస్తుంది.
                   ఇంతకీ టైం మేనేజ్ మెంట్ అంటే ఏమిటి ? అందులో ప్రధానమైన విషయాలేమిటి ? మనకు దైనందిన వ్యవహారాల్లో  ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. బయట కంపెనీల్లో పనిచేసేవారికైనా లేదా ఇంట్లో ఉండే గృహుణులైనా తాము అయినా చేయవలసిన పనులను శాస్త్రీయంగా ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం. దీని వలన మాకేమి ఉపయోగం ? ఇలా అయితే పనులు తగలడి నట్టే అనే ఆలోచన వస్తుందా? ముందు మనస్సులోంచి తొలగించి సానుకూలంగా ఆలోచిస్తూ మీకు ఉపయోగపడేవి మరియు పాటించడానికి వీలున్నవి వీలైనంత వరకు పాటించండి. 
టైం మేనేజ్ మెంట్  నిర్వచనం; 
    టైం మేనేజ్ మెంట్ ( సమయ పాలన) అంటే నిర్ధిష్టమైన పనులను చేపట్టేడపుడు అందుబాటులో ఉన్న సమయాన్ని, సక్రమంగా వినియోగించుకునేందుకుతగిన పద్ధతులు, నైపుణ్యాలు, చిట్కాలు, విధానాలు వినియోగించడమే. 
                అంటే మనం ఏదైనా పనిని చేపట్టేడపుడు మనకు అందుబాటులో ఉన్న సమయం లో ఆ పని ఎలా పూర్తి చేయాలో అందుకు ఏ పద్ధతులు అనుసరించాలో తెలియచేసే కార్యనిర్వాహక ప్రణాళిక.

టైం మేనేజ్ మేంట్ లో ప్రధానమైన అంశాలు
planning, ; ప్రణాళిక     
  Division of work ; పని విభజన     
   allocating, ; పనిని కేటాయించుట 
  setting goals, ; లక్ష్య నిర్దేశన      
 delegation, ;అధికారాన్ని బాధ్యతలను బదిలీ చేయుట     
analysis of time spent, ; పూర్తయిన సమయాన్ని పున; పరిశీలించుట ·
 monitoring, పర్యవేక్షణ  
  organizing, నిర్వహణ       
   scheduling, సమయాన్ని పనులకు అనుగుణం గా కేటాయించుట 
    prioritizing. పనుల ప్రాధాన్యతలను బట్టి వర్గీకరించుట

పైన పేర్కొన్న మేనేజ్ మెంట్ పదాలను చూసి ఇదేదో మనకు సంబందించని లేదా మనకు సంబంధం లేని విషయాలు అనుకోకండి. ఇవన్నీ మీరు నిత్యం ఇంట్లో  బయట  అన్ని విషయాలలో పాటిస్తున్నవే.

OBSTACLES : ఆటంకాలు ; ప్రతి ఒక వ్యక్తి సమయానుకూలంగా తన పనులను, సమయానికన్నా ముందుగా చేయాలనుకుంటాడు. కావాలని సమయాన్ని ఎవరూ వృథా చేసుకోడు. అయినప్పటికీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల ప్రభావం వలన లేదా తన చేతిలో లేని బయట కారణాల వలన తన ప్రమేయం లేకుండా సమయం వృథా అవడమే కాకుండా అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి.   ఈ  ఆటంకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి. 
            A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles                                        B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles                                వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.  
A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles ; 
బహిర్గత ఆటంకాలంటే  మన ప్రమేయం లేకుండా మన పనులకు ఆటంకం కలిగించేవి.   అవి.                                                                                  1. అంతరాయాలుః (Interruptions):   మెయిల్స్,  చాటింగ్, ఫేస్ బుక్, ఫోన్స్ మొదలగునవి మనం చేసే పనిని నిలుపుదల చేసి  అసలు పని మాని లేనిపోని విషయాలతో సమయాన్ని వృథా పరుస్తుంటాయి.
2. బాతాఖానీలు (Socializing conversations): ఆఫీస్ లో గానీ  ఇరుగు పొరుగు తో ఖానీ  అదేపని గా  ప్రపంచంలో అన్ని విషయాలు, రాజకీయాలు, వార్తా పత్రికల్లో విషయాలు, క్రికెట్ మ్యాచుల పై  విశ్లేషణలు, టీ.వీ. సీరియళ్ళ పై వ్యాఖ్యానాలు ఒకటేమిటీ  అనేకరకాలైన పిచ్చాపాటి కబుర్లతో గంటలు గంటలు భోంచేస్తూ బ్రేవ్ మని తేన్చుతుంటారు.  తీరా  సమయం వృథా అయిన తర్వాత తీరిగ్గా ఎదుటివారివలనే  సమయం పాడయిపోయిందని బాధపడుతుంటాం.  వాళ్ళుకూడా అలాగే భావిస్తుంటారని మనకు తెలియకపోవడం ఒకవిధం గా మన అధృష్టమే. 
౩. అనేక పనులు  ఒకేసారి చేయడం ( Multi Tasking):  సవ్యసాచుల్లా రెండు చేతులతో నాలుగు పనులు ఒకేసారి నెత్తిన వేసుకోవడం వలన ఏ పని పూర్తికాకుండా అన్ని పనులు చెడగొట్టుకుంటుంటారు చాలామంది.  ఇలా అనేక పనులు ఒకేసారి చేయాలనుకోవడం కూడా ఒకవిధంగా పనులు సమయానికి జరగడానికి ఆటంకమే.
4. అనుకోకుండా వచ్చే అతిథులు (Unscheduled Visitors): తిథి, వారం, నక్షత్రం చూడకుందా వచ్చే వాళ్ళే అతిథులంటారట.  కాని మనం ఏదైనా పనికోసం బయలుదేరుతున్నప్పుడు అతిథులు గాని ఎవరైనా మనతో పని కోసం వస్తే  తప్పనిసరిగా మన పనిని వాయిదా వేసుకొని వాళ్ళకు మనం సమయం కేటాయించవలసి వస్తుంది. అలా అని మన పనులకోసం వాళ్ళతో సమయం గడపకపోతే మన మర్యాదకే లోపం ఏర్పడుతుంది.  మన పనులు సమయానికి జరగకపోడానికి మనింటికి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే సందర్శకులు కూడా ఒక కారణమే.
5. అస్తవ్యస్తంగా ఉన్న పని పరిస్థితులుః (Poor Work Environment) కంపెనీలో గాని. ఆఫీస్ లో గాని ఇంట్లో గాని పరిసరాలు సరిగా లేకపోతే  చేసే పని సమయానికి జరగకపోవచ్చును.  అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలు చికాకు పెడుతూ, ఏ వస్తువు సమయానికి దొరకక, నిత్యం కావలసిన వస్తువుల కోసం వెతుక్కుంటూ సమయం వృథా అవుతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉందో, కాళ్ళకు  ఏదో వస్తువు తగులుతూ ఉంటే అరికాలమంట తలకెక్కుతూ ఉంటుంది. కాలుష్యం, వేడి, దుర్గంధం మొదలైనవి శ్రామికుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఎల్టన్ మేయో అనే మేనేజ్ మెంట్ నిపుణుడు ఎప్పుడో నిరూపించాడు. 
6. అస్పష్టమైన లక్ష్యాలు ( Unclear Goal):  చేయవలసిన పని మీద సరియైన స్పష్టత లేకపోతే, ఒక పని ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలో ఒక అవగాహన మరియు స్పష్టత ఉంటే ఆ పని సమయానికి జరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి వంద తప్పులు చేస్తే  లక్ష్యం లేని వ్యక్తి వేయి తప్పులు చేస్తాడని స్వామి వివేకానంద అన్నాడు. అస్పష్టమైన లక్ష్యాలు మన పనులు సమయానికి జరగక పోడానికి సమయం వృథా కాడానికి ఒక కారణం మరియు అతి ముఖ్యమైన ఆటంకం.
7. ఇతరుల సహకారం పై అతిగా ఆధారపడటం ( Too much dependency on others' cooperation):  మన పనులు మనంతట మనం చేసుకోవడం మాని ఇతరుల సహకారం మీద అతిగా ఆధారపడటం కూడా సమయం వృథా అవడానికి ఒక కారణం.  కంపెనీ లో అన్ని విభాగల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే పనులు సకాలం లో జరగక పనుల్లో స్తబ్దత ఏర్పడి కాలహరణం జరుగుతుంది.
8. ఉద్యోగ స్వామ్యం ( Bureaucratic Red Tape) : ఇది సంస్థలలో పనులు  జరగడానికి  వ్యవస్థాపితమైన క్రమానుగత శ్రేణిని అనుసరించి నియమాలకు  అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఫైల్ అన్ని విభాగాలకు వెళ్ళి రావాలంటే చాలా సమయం పడుతుంది.  అలా అని నియమాలను ఉల్లఘించినట్లైతే అది అధికార దుర్వినియోగమవుతుంది.  ఇది చాలా కాలయాపనకు ,జాప్యతకు దారి తీస్తుంది.   
B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles : 
అంతర్గతమైన ఆటంకాలంటే కేవలం మన అలవాట్లవలన, ప్రవర్తన వలన మన దృక్పథాల వలన మన పనుకు జరగడానికి ఏర్పడే ఆటంకాలు.
1. వాయిదా వేసే గుణం ( Procrastination): కొంతమంది పనులను తీరిగ్గా వాయిదా వేస్తూ, తీరా గడువు సమీపించేసరికి హైరానా పడుతుంటారు. " కొండలా కోర్సు ఉంది. ఎంతకీ తగ్గనంది, ఏందిరా వింత గొడవా? ఉందిలే సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతుంది దేనికైనా" అని అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాలో ఒక పాట ఉంటుంది. అలా ప్రతి పని పని వాయిదా వేస్తుంటారు. దీనివలన చివరి నిమిషంలో పని జరగకపోవడం లేద పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించవలసి రావడం జరుగుతుంది. చాలామంది ప్రయాణాలు ముందుగా వెళ్ళలని తీర్మానించుకున్నప్పటికీ చివరి నిమిషం వరకు రిజర్వేషన్ చేయించరు. ఈ వాయిదా గుణాన్ని బాగా అర్థం చేసుకున్న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  తత్కాల్ స్కీమ్  ప్రవేశపెట్టి ఇండియన్ రైల్వేస్ ని లాభాల బాట పట్టించారు.  విమానంలో ప్రయాణించేవారు కూడా ముందుగా రిజర్వ్ చేసుకుంటే చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాని చాలా మంది  చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూ ఆయా విమానయాన సంస్థలను పోషిస్తూ ఉంటారు.
    ఈ వాయిదా వేసే తత్వం మన వాళ్ళల్లో ఎంత పురాతనమైనదో చెప్పడానికి కబీర్ మహశయుడు   ఒక చక్కని దోహే లో ఇలా చెప్పాడు.
కల్ కరే సో ఆజ్ కర్  ఆజ్ కరే సో అబ్ కర్                                                    పల్ మే పర్లయ్ హోయేగీ  బహురీ కరోగే కబ్                                             దీని అర్థం ఏమిటంటే రేపు చేయాలనుకున్నదీ  ఈ రోజే  చెయ్యు. ఈ రోజు  చెయ్యాలనుకున్నది ఇప్పుడే  చెయ్యు.  క్షణకాలంలో  ప్రళయం రావచ్చు.  తర్వాత  ఏమి చెయ్యగలవు.  కాబట్టి  వాయిదా  వేసే తత్వం  మంచిది  కాదని.  అతని అభిప్రాయం. 
2. ప్రణాళిక లేక పోవడం ( Lack of Planning) : ఏదైనా  పని  చేసే ముందు  పని  ఎలా  చెయ్యాలి. దానిని వివిధ భాగలుగా విభజిస్తూ ఒక ప్రణాళిక  అవసరం.     If you fail to Plan, You plan to fail  అన్నది ఆంగ్ల సామెత.  అంటే  ప్రణాళిక వేయడం లో విఫలమైతే, విఫలమవడానికి ప్రణాళిక  వేస్తున్నట్టే అని అర్థం. ప్రణాళిక వేయడం ఎంత ముఖ్యమో దానిని అనుకున్నట్టుగా అమలు చేయడం అంతే ముఖ్యం. Plan without Action is Futile but Action without plan is fatal.  ప్రణాళిక ఉండి అది అమలు చేయకపోతే అది వ్యర్థం కాని అసలు ప్రణాళిక లేకుండా పని చేస్తే అది ప్రమాదకరం. ప్రణాళిక లేకుండా పని చేయడం వలన తక్కువ సమయంలో పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావచ్చును.
3. ప్రాధాన్యతల క్రమం లేకపోవడం (  Lack of Prioritization) : నేటి ఆధునిక కాలంలో మనిషి చాలా బిజీ అవుతున్నాడు. ఉన్న కొద్ది సమయంలోనే అనేక పనులు చేయవలసి వస్తుంది. ఏ పని వెంటనే చేయాలి. ఏ పని ఇతరులకి అప్పగించాలి ఏ పని తరువాత చేయవచ్చు అనే విషయం లో  అవగాహన లోపించడం వలన ముందు చేయవల్సినది వెనుక, తరువాత చేయవలసినది ముందు చేస్తూ తన జీవితాన్ని కిందా మీదా చేసుకుంటున్నాడు. ప్రధాన మంత్రి కైనా, తపాలా బంట్రోతుకైనా ఉన్న సమయం రోజుకి ఇరవై నాలుగు గంటలే. ఉన్న సమయాన్ని తన ప్రాధాన్యతల ప్రకారం ఉపయోగించుకోవాలి.
4. సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడం ( Indecisive Nature): సరియైన సమయంలో సరియన నిర్ణయం తీసుకోవడం లో విఫలమైతే దాని ప్రభావం మన సమయం పై పడుతుంది. the decision that delayed is the decision not taken అని అంటారు.  ఆలస్యం గా చేసిన నిర్ణయం అసలు నిర్ణయమే కాదని. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే దాని అమలులో మరింత ఆలస్యమవుతుంది. పని సకాలంలో పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. దాని ప్రభావం ఇతర పనులపై కూడా పడుతుంది.
5. పరిపూర్ణత్వానికై పరితపించుట ( Perfectionism) : చాలా మంది పనులు చేసే టపుడు నూటికి నూరుపాళ్ళు ఖచ్చితంగా జరగడానికి చూస్తుంటారు. ఉన్నంతలో పరిపూర్ణతకోసం ప్రయత్నించడం మంచిదే కాని ఆ క్రమంలో అన్ని పనులు ఆపి ఆ ఒక్క పనిలో నిమగ్నమైతే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. ఎంత బాగా చేసినా ఏదో ఒక తప్పిదం జరగడానికి అవకాశం ఉంటుంది. అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపనంత వరకు అలా వదిలేస్తే మంచిది. అలా కాదని చేసిందే చేసుకొని కూర్చుంటే  అది ఒక Obsession Compulsion Disorder అనే మానసిక జాడ్యానికి దారి తీస్తుంది.  
6.  మానసిక, శారీరక అలసట ( Mental and Physical Exhaustion) : పనికి పనికి మధ్య తగిన విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా కొనసాగించడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోవడం వలన చేస్తున్న పనులు ఆలస్యమై ఏ పని సరియైన సమయానికి జరగదు.  సాధ్యమైనంతవరకు  అలసట  ఉన్నప్పుడు   చేస్తున్న పని ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది. 
7. మొహమాటం ( Not being able to say NO) : చాలామంది  తమకు  తమపై  అధికారి గాని లేదా స్నేహితులు గాని ఏదైనా పని అప్పచెబితే  అది వారి వలన సాధ్యం కాకపోయేటప్పటికీ  మొహమాటం కొద్దీ ఆ పనిని చేస్తామని ఒప్పుకుంటారు. ఆ పని చేయలేక చేయలేమని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరి వద్ద చివరికి మాట పడటమే కాకుండా వాళ్ళ పనికూడా పూర్తి చేయలేకపోతారు. అందరినీ సంతృప్తి పరచడం చాలా కష్టం. ఎంత మంచి అనిపించుకోవాలని ప్రయత్నిస్తే అంత చెడ్డ అనిపించుకోడానికి అవకాశం ఉంటుంది. 
8. క్రమబద్ధత లేకపోవడం ( Lack of Orderliness):  చాలామంది తాను  పని  చేసే  చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుతూ, పని అయిన తర్వాత వాటిని యథాస్థానంలో ఉంచుతారు.  ఈ రకమైన క్రమశిక్షణ వలన మరలా ఆ వస్తువులు అవసరమైనప్పుడు వెతుకుతూ సమయాన్ని వృథా చేస్తుంటారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని, పనిచేసే ప్రదేశాన్ని చూసి పనితనాన్ని చూడాలంటారు.  జపాన్ వారి పద్ధతి అయిన 5S  బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం చాలా మందిలో ఈ క్రమశిక్షణ లోపించడమే.
9. తగిన ప్రేరణ, ఉత్సాహం లేకపోవడం ( Lack of Motivation and encouragement ) : చాలామంది స్వతహాగా చాలా నెమ్మదిగా, నిస్తేజంగా  పని  పట్ల ప్రత్యేకమైన ఉత్సాహం లేకుండా తక్కువ ప్రేరణ తో ఉంటారు.  వారికి తగిన గుర్తింపు లేకపోవడం వలన గాని, వారిలో ప్రేరణ కలిగించకపోవడం వలన గాని monotony కి లోనై ఏ పని పైన శ్రద్ధ చూపరు. దీని వలన అనుకున్న సమయానికి పనులు జరగవు. అందుకే అన్ని సంస్థలలో  ఉద్యోగులలో ప్రేరణ కలిగిస్తూ వారికి తమ పని పట్ల ఉత్సాహం, ఉత్తేజం కలిగించడాని మానవ వనరుల అభివృద్ధి విభాగం ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యకలాపాలకు, సెలవుతో కూడిన విహారయాత్రలకు అవకాశం కల్పిస్తుంది. 
10. ఒత్తిడి ( Stress):  ఈ రోజుల్లో సమాజంలో అన్ని వర్గాల వారి లో పని వలన వచ్చే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. Unrealistic deadlines, Inspections, Review meetings, Report Submissions ఒకటేమిటి  అన్ని  రకాలుగా  తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఇది ఉద్యోగుల పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో కూడా తెల్లవారి పిల్లలను స్కూల్ కి పంపించడం వారికి కేరేజ్ కట్టడం, శ్రీవారికి ఇస్త్రీ బట్టలు అందించడం మొదలుకొని ఆఫీస్ కి పంపించడం ఇలా అనేక పనుల మధ్య ఒత్తిడితో అపర కాళిక మాతల్లా  ఉంటారు.  ఇలా ఒత్తిడికి గురయ్యే వారిలో హర్మోన్ల సమతౌల్యం కూడా దెబ్బతిని వారి ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుందని పరిశోధనలు  తెలియచేస్తున్నాయి.  
ADVANTAGES OF GOOD TIME MANAGEMENT : సమయాన్ని సరిగా నిర్వహించుకోడానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు, చిట్కాలు, నైపుణ్యాలు గురించి తెలుసుకునే ముందు అసలు సమయాన్ని సరిగా నిర్వహించడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుంటే  వాటిపై మనకు ఆసక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
1.Goals and Objectives are Achieved: లక్ష్యాల సాధనః సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతులను అలవరుచుకుంటే మన లక్ష్యాలు, ఉద్ధేశ్యాలు మనం సకాలంలో ఎటువంటి హైరానా లేకుండా నెరవేర్చుకోడానికి అవకాశం ఉంటుంది.                                                                                 2.Confidence  and Good will are increased: ఎప్పుడైతే మన పనులను సకాలంలో , సక్రమంగా పూర్తి చేయగలుగుతామో మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులలో మన పట్ల గురి పెరుగుతుంది.  ఏ పని సరిగా చేయకపోతే మన విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా ఇతరులు మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది.                                           3.Stress will be reduced:( ఒత్తిడి తగ్గుతుంది)  సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతుల్ని అలవాటు చేసుకుంటే  ఒక క్రమ పద్ధతిలో మన పనులు మనం సకాలం లో పూర్తి చేయడం వలన మనపై ఎటువంటి ఒత్తిడి, చిరాకులు ఉండవు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకు చిరాకు పడాల్సిన అవసరం ఉండదు.                                                                            4.Peace of Mind and Sense of Achievement:(మానసిక ప్రశాంతత  మరియు సంతృప్తి):  పని పట్ల సరియైన క్రమశిక్షణ అలవడుతుంది. తత్ఫలితంగా పనులు సరిగా జరగడం వలన మానసిక ప్రశాంతత అలవడుతుంది. లక్ష్యాలు సాధించామనే తృప్తి కలుగుతుంది.                      5.Increased energy: పనులు సరిగా పూర్తి కాక హైరానా పడుతూ ఉన్న శారీరక మానసిక శక్తులను దుర్వినియోగపరచుకోవలసిన స్థితి ఏర్పడదు కాబట్టి సమయ పాలన సరిగా చేసుకొనే వారికి శక్తి పెరుగుతుంది. 6.Increased Productivity:  చేస్తున్న పని  సమయానికి  పూర్తికావడం  వలన   ఇంకా ఎక్కువ పనులు చేయడానికి సమయం మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయడం ద్వారా తన ఉత్పాదకత పూర్తిస్థాయిలో ఉండే విధంగా పనిచేయగలడు.                          7.Financial stability  (ఆర్ధిక సుస్థిరత): శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అన్నాడో కవి.  ఎప్పుడైతే తన కర్తవ్యాలని సరిగా నిర్వహించ గలుగుతాడో తన రంగం లో ఉన్నత స్థానానికి చేరుకోడానికి అవకాశం ఉంటుంది.  తత్ఫలితంగా ఆర్ధికంగా కూడా ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది.                                                                                           8. Promotion in the Job ( ఉన్నత స్థాయికి ఎదుగుదల). ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం పొందినపుడు తన విధులను ఎటువంటి జాప్యత లేకుండా సరిగా చేయగలగడం ద్వారా ఉన్నతాధికారుల ధృష్టిలో పడతాడు. నేటి కార్పోరేట్ రంగం లో కేవలం పనితీరు బట్టే ప్రమోషన్లు ఉంటాయి. ఉన్న పని చేయడానికి పరేషాన్ అయ్యేవాడికి ప్రమోషన్ కాదు  ఫైరింగ్ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది.                                                                                           9. Maximum Utilization of Time;  (సమయాన్ని గరిష్టంగా సదుపయోగం   చేయగలడం)  ఒకే పని నాన్చుకుంటూ చేస్తుంటే సమయం వృథా అవడమే కాకుండా  సమయ గరిష్ఠ వినియోగం తగ్గిపోతుంది.  ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వారు సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోగలుగుతారు.                                                              10. Stronger Family Bonds ( కుటుంబ బాంధవ్యాల అభివృద్ధి) చాలా మంది ఆఫీస్ లో పని సకాలంలో పూర్తిచేయలేక ఆ ఫైళ్ళన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వారితో ఉలుకు పలుకు లేకుండా ఫైళ్ళల్లో మునిగిపోతారు. కంపెనీ విషయాలు చర్చిస్తూ ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అంటూ ఫోన్ లో కూడా తోటి ఉద్యోగస్తులతో చర్చిస్తూ ఇంట్లో వారిని ఉపేక్షిస్తుంటారు. దానివలన కుటుంబ సభ్యులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. అలా కాక సమయపాలన సరిగా చేస్తూ ఎక్కడ పనులు అప్పటి కప్పుడే పూర్తిచేయగలిగితే ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. అందరి మధ్య ప్రేమాభిమానాలు పరిడవిల్లుతాయి. 
WHAT IS THE VALUE OF THE TIME....
value of One Year:   ఒక సంవత్సరం  విలువ  తెలుసుకోవాలంటే  ఒక  విద్యా  సంవత్సరం కోల్పోయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది.  EAMCET  లేదా I.I.T.  లో రాంక్ రాకపోవడం వలన  ఆ విద్యార్థి  లాంగ్  టెర్మ్  కోచింగ్  తీసుకుంటే తరువాత సంవత్సరం కోర్సు లో జాయిన్  అయితే  ఆ విద్యార్థి  ఉద్యోగం పొందినంతవరకు  విద్యా సంవత్సరం లో ఎందుకు తేడా వచ్చిందో  వివరించాల్సి ఉంటుంది. అంతే కాక  తనతో చదువుకునే వాళ్ళకు జూనియర్  అవుతాడు.  ఒక సంవత్సరం విలువ  ఆ విద్యార్థి కి బాగా తెలుస్తుంది.
  value of One Month: ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ఎనిమిదో నెల గర్భం తో ఉన్న ఒక స్త్రీ  గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే ఆమె తనని పరిశీలించి అత్యవసరంగా సిజెరియన్ చేసి బిడ్డయొక్క రక్షణ్ దృష్ట్యా బయటకు తీసి ఇంక్యుబేటర్ లో ఒక నెల రోజులు ఉంచితే  ఆ బిడ్డ సంరక్షణ కోసం తల్లడిల్లే ఆ తల్లికి ఒక నెల యొక్క విలువ తెలుస్తుంది.
value of One Week:
ఇంకా  ఉంది.............

 
 
   
                              

Sunday, 12 February 2012

ఇలా చదవాలి....అలా సాధించాలి....

అత్యంత ప్రజాధరణ పొందిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయుక్తమైన " ఇలా చదవాలి..అలా సాధించాలి"  పుస్తకాన్ని  సీరియల్ గా ఈ బ్లాగ్ లో మీ అందరికోసం ........... మీకు వీలైనంతమందికి  ఈ బ్లాగ్ ను షేర్  చేయండి




Thursday, 9 February 2012

భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం( 4)


            శంకరాచార్యులవారి ఈ శ్లోకాలన్నింటిని కలిపి మోహముద్గారంఅని అంటారు.  జీవితం పట్ల విపరీతమైన కాంక్షను కలిగి యుండి శరీరం పట్ల విపరీతమైన మోజును కలిగి ఉండి చివరలో  ఈ జీవితాన్ని విడిచి పెట్టవలసిన సమయంలో తీవ్ర దుఃఖానికి లోనవుతారని ఈ శ్లోకం లో హెచ్చరిస్తున్నారు.
                                      నలినీదళగత జలమతి తరళం
                                       తద్వజ్జీవితమతిశయచపలం
                                       విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
                                       లోకం శోకహతం చ సమస్తం .. 4
( భావం;  తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.)
      అచంచల స్వభావం కలిగిన జీవితాన్ని తామరాకు పై నీటి బొట్టు తో శంకరాచార్యులు పోల్చుట జరిగింది. ఒకసారి వృద్ధాప్య దశకు చేరిన వారిని ఎవరినైనా కదిపినట్లైతే ఇంకా మొన్న మొన్నే స్కూల్ కి వెళ్ళి నట్టుంది, ఈ మధ్యే వివాహం అయినట్టుగా ఉంది, చూస్తుండగానే అరవై ఏళ్ళు గడచాయంటే  అసలు నమ్మబుద్ధి కావట్లేదంటారు.  తామరాకు పై నీటి బొట్టు తో జీవితాన్ని పోల్చడం లో  రెండు ముఖ్యమైన విషయాలు తెలియచేస్తున్నారు
   1.  జీవితం అత్యంత అస్థిరమైనది. నీటిబొట్టు తామరాకు పై బాహ్యంగా జరిగే ఏ ప్రభావానికైనా కదులుతూ ఉంటుంది. నేను గొప్ప. నేను శాశ్వతం అనే ఆలోచనలో అహంభావ ప్రదర్శన చేసే వారు  గ్రహించవలసిన విషయం ఇది. అమెరికాలో  1923 అమెరికా దేశంలో అత్యంత సంపన్నులైన ఎనిమిది మంది ఎడ్జ్ వాటర్ బీచ్  హోటల్  నందు సమావేశమై అమెరికా లో అందరి వద్ద కలిపితే ఎంత సంపద ఉందో  తమ ఎనిమిది మంది వద్ద అంత సంపద ఉందని ప్రకటించి, అమెరికా ఆర్ధిక వ్యవస్థనే ప్రభావితచేయగలమని ప్రకటించారట.  1929 లో సంబంవించిన ఆర్ధిక మాంద్యం ప్రభావ ఫలితంగా  కొంతకాలానికి  ఈ  ఎనిమిది మందిలో ముగ్గురు  ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఇద్దరు  దివాళా పిటీషన్ తెచ్చుకొని పేదరికంలో మరణించడం జరిగింది, ఒక్కరు పిచ్చెక్కి మరో ఇద్దరు జైలు జీవితంలో  మరణించడం జరిగింది.  నాది నాది అనుకునేది నీది కాదురా  అని ఒక సినీ కవి చెప్పినట్టు  తామరాకు పై ఉన నీటిబొట్టు ఏ మార్పు జరిగినా ఏల నేలకు రాలిపోతుందో మానవ జీవితమ్ కూడా అంతే.  
 2.  తామరాకు పై నీటిబొట్టు తో జీవితాన్ని పోల్చడంతొ  మనిషి ఈ జీవితాన్ని ఎలా  బ్రతకాలో కూడా  శంకరాచార్యులవారు  తెలియచేస్తున్నరు. నీటిబొట్టు తామరాకుపై ఉన్నప్పటికీ తామరాకుతో ఎటువంటి సంబంధం లేకుండా పూర్తి detachment  తో ఉంటుంది.  నా శరీరం, నా సంపద, నా సంతానం, నా ఆస్తి,  నా సౌందర్యం అనే బంధాల్లో చిక్కుకున్న మనుషులు పై శ్లోకంలో చెప్పినట్టు శోకానికి గురు అవుతున్నారు. ఏదీ నీది కాదని అనుకో అనే తత్వ విచారమున్నట్లైతే ఎటువంటి బాధ మనసుకి అంటదు.  ఒకతను తెల్లవారి లేచి పెద్ద పెద్ద కేకలతో ఏడవడం మొదలుపెట్టాడట. అందరూ చేరి కారణమేమిటని అడిగారట. కలలో తనకు వజ్రాలు, బంగారం, అందమైన భార్య దొరికాయని తీరా నిద్ర లేచి చూస్తే అవన్నీ పోయాయని ఏడుస్తున్నానని సమాధనం చెప్పాడట. అంతా వాడిని చూసి పిచ్చివాడని ఎగతాళి చేయడం మొదలుపెట్టారట. దానికి ఆయన వాళ్ళతో  జీవితం కూడా  ఒక పెద్ద కల లాంటిదే  ఎప్పుడైతే మీలో  నిజమైన జాగృతావస్థ  వస్తుందో  ఈ బందనాల పట్ల విముఖత కలిగి ఈ బంధనాలనుండి విముక్తులవుతారు అని బోధించాడట.
                   ఈ శ్లోకంలో  తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే  The more you are attached to the worldly mundane attachments, the more you will suffer.  ఎన్ని బంధాలు, వ్యామోహాలు పెట్టుకుంటే అంత బాధపడాల్సి ఉంటుంది. ఎప్పటికైనా వీటిని పోగొట్టుకోవలసి వస్తుంది అనే త్యాగ భావనతో  మన కర్తవ్యాల్ని విస్మరించకుండా ముందుకుపోవాలి. Let us have detached attachments in our outer life.  శరీరం పొందే ఏ అవస్థ యొక్క ప్రభావం మనసుపై పడకుండా ఉండగలిగితే శొకరహితంగా జీవించవచ్చని శంకరుల అభిప్రాయం.


Thursday, 26 January 2012

భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం

భజగోవిందం - పరిపూర్ణ వ్యక్తిత్వానికి పునాది. (3)

         శంకరాచార్యులవారు  మానవ మానసిక విచలతకు మూల కారణాన్ని ఈ 3 వ శ్లోకంలో వివరించారు.  కడవంత  గుమ్మడికాయ  కత్తిపీటకు  లోకువన్నట్టు  ప్రతీ వ్యక్తి స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం
 చేసుకుంటున్నాడు.   '' ఎంతనేర్చినా  ఎంత చూసినా ఎంతవారలైనా  కాంత దాసులే ''  అని త్యాగరాజు గారన్నట్టు కాంతా వ్యామోహంలో తన జీవిత లక్ష్యాలను ఉపేక్షించిన వారు  చరిత్రలో కోకొల్లలు.  జహంగీర్   నూర్జహాన్  వ్యామోహంలో పడి తన రాజ్యాధికారాన్ని సైతం ఆమె చేతిలో పెట్టి  తన జీవిత పర్యాంతం లో   జహంగీర్  నామా  అనే ఆత్మకథలో  ఒక రొట్టె ముక్క కోసం,  గుక్కెడు మధువు కోసం తన అధికారాన్ని నూర్జహాన్ కు అమ్ముకున్నానని తలచి తలచి బాధపడతాడు.    ఈ శ్లోకాన్ని ఒక సారి పరిశీలించినట్లైతే.. 

                   నారీస్తనభర నాభీదేశం
                  దృష్ట్వా మాగామోహావేశం
                  ఏతన్మాంసవసాది వికారం
                  మనసి విచింతయ వారం వారం
భావం ;   స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.
       స్త్రీల బాహ్య సౌందర్యం చూసి మోహావేశంను పొంది  తమ కర్తవ్యాలను ఉపేక్షించినవారెందరో  నిత్యం కనబడుతుంటారు.  అరిషడ్వర్గాలలో  కామం  అనేది  అతి ముఖ్యమైనది. మనిషనేవాడు కోరికలపుట్ట. స్వేచ్చా జీవిగా
పుట్టిన  మానవుడు  సర్వత్రా సంకెళ్ళతో ఉన్నాడు  అన్నాడు రూసో.  ప్రాకృతిక స్వేచ్చ లో  ప్రతీ మనిషి  తన కోరికలు  తీర్చుకోడానికి  తన ఇచ్చానుసారం ప్రవర్తించవచ్చునేమో గాని  సామాజిక జీవితం  ప్రారంభమయిన  తర్వాత  కుటుంబ  వ్యవస్థ  అనేది  ఏర్పాటు  చేయబడి  మనిషి  తన  కోరికలను  తీర్చుకునేందుకు   కొన్ని  నియమాలు  ఏర్పాటు చేసారు.   ఎవరైనా ఈ కట్టుబాటులను     అనుసరించవలసినదే.
            కామప్రకోపాలను నియంత్రించుకోలేక స్త్రీల బాహ్యసౌందర్యమే ప్రధానంగా  వ్యామోహం  లో  చిక్కుకున్నట్టైతే  మనిషికి  పతనం  తప్పదు.   పరస్త్రీ  వ్యామోహంలో పడి తమ  భవిష్యత్తు నాశనం  చేసుకున్నవాళ్ళు  మనకు  చరిత్రలో  చాలామంది కనబడతారు. రావాణాసురుడు మరణించిన తర్వాత  రాముడు  అలసటతో  యుద్ధభూమిలో  ఒక రాతిపై  కూర్చొని  ఉన్నాడట. సూర్యాస్తమవుతున్నసమయంలో ఒక స్త్రీ  రాముడున్న   చోటుకి వస్తుంది.  రాతి పై  కూర్చొని  ఉన్న రాముడు  తన వైపు వస్తున్న  ఆ నీడ తనవైపు  రావడం  చూసి   ఆ నీడ తనకు  తగలకుండా   జరగసాగడట.    దానితో   ఆ  నీడ అక్కడే  ఆగి వెనక్కి    వెళ్ళిపోసాగింది.  రాముడు  బిగ్గరగా   ఎవరది  అని అడిగితే  ఆమె  ఆగి  దగ్గరగా వచ్చి ఇలా చెప్పిందట. ''  అయ్యా!  నేను  మండోదరిని.  రావాణాసురుని  భార్యను.   నా భర్త  అరివీర  భయంకరుడు.  గొప్ప శివభక్తుడు.  అలాంటి  మహా శక్తిమంతుడిని  వధించిన  వ్యక్తి  ఎలా  ఉంటాడో అతని గొప్పతనం   ఏమిటో  స్వయంగా తెలుసుకుందామని  వచ్చాను.   ఇక్కడకు వచ్చాక నాకు నా భర్త బలహీనత . అర్థం అయింది.   పరస్త్రీ నీడ  కూడా మీపై  సోకకుండా  మీరు  మిమ్మల్ని  నియత్రించుకుంటున్నారు.  మరి నాభర్త పరస్త్రీ వ్యామోహంలో ప్రాణాలను,  రాజ్యాన్ని కోల్పోయాడు. అదే మీ ఇద్దరిలో తేడా అని చెప్పి నమస్కరించి   అక్కడనుండి వెళ్ళిపోయిందట.
            ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని  ఆ బలహీనతను జయించడం ఎలా అన్న వారికి  శంకరాచార్యులు వారు దారి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో.   స్త్రీ  సౌందర్యం అంతా  మాంసం, క్రొవ్వు ల సమూహమే అనే ఏహ్య భావాన్ని అలవరుచుకోవడం  ద్వారా ఈ వ్యామోహం నుండి బయట పడవచ్చు.  వయస్సు ఊడిగిన నాడు ఈ బాహ్యమైన తళుకులు బెళుకులు నశిస్తాయని అర్థం చేసుకోవాలి.   భోగి కాని వాడు యోగి కాలేడు అన్న  వేమన యోగి గా మారడానికి అతనిలో కలిగిన వైరాగ్యం మరియు ఏహ్యతా భావనయే.  స్త్రీ వ్యామోహం లో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వేమన ఒక వేశ్య ఆకర్షణలో ఉంటాడు. ఆమె తన కోరిక తీర్చడానికి ఏదైనా బంగారు నగ కానుకగా కోరుతుంది. వేమన తన ఒదినె వద్దకు వచ్చి బంగారు నగ అడుగుతాడు. అది ఎందుకోసమో తెలుసుకున్న ఆమె  తన బంగారు నగను వేమనకు ఇచ్చి ఒక షరతు పెడుతుంది.  ఆ  వేశ్య ఆ నగను మరుగుదొడ్డిలో  నగ్నంగా ఉన్నప్పుడు తలను వచ్చి  కాళ్ళమధ్యగా వెనుకనుండి  ఆ నగను తీసుకోవాలని వేమనకు చెబుతుంది.  అలాగే అని వెళ్ళిన  వేమన  ఆ దృశ్యం చూడటంతో అతనిలో ఏహ్యతా భావం ఏర్పడి తన కామప్రకోపాలను త్యజించి, ఇటువంటి నీచమైన పనులలో తన యవ్వనం కోల్పోయానని యోగిగా మారుతాడు.  మనమైతే  యోగి గా మరనవసరం లేదు కాని అశాశ్వతమైన బాహ్య సౌందర్యాలు శాశ్వతమనే మాయలో పడకుండా ఉండగలిగి. లక్ష్యసాధనకు కృషి చేస్తే  చాలు..                   

Monday, 23 January 2012

OPRAH WINFRAY........the legendary icon for women Empowerment

ఓఫ్రా  విన్ ఫ్రే..... 

            ఈ రోజు భారతదేశం లో పర్యటిస్తూ అటు  మీడియా ధృష్టిని ఇటు ప్రజల ధృష్టిని ఆకట్టుకొంటున్న అమెరికా టీ. వీ లో ఒక కొత్త శకానికి నాంది పలికిన  నల్లజాతి మహిళ ఓఫ్రా విన్ ఫ్రే జీవితం గురించి,  ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న  ఆటుపోట్ల గురించి , అన్ని రకాల సమస్యలని అధిగమించి  అమెరికాలో కెల్ల అత్యంత సంపన్నమైన నల్లజాతి మహిళగా  ఎదిగిన విధానం గురించి అందరికీ తెలియచేస్తూ   ముఖ్యంగా జీవిత సమస్యల వలయాల్లో చిక్కుకున్న మహిళలకు స్ఫూర్తి కలిగించాలనే సదుద్ధేశ్యం తో   ఇంటర్ నెట్ ద్వారా సేకరించిన సమాచారం తో  వ్రాయనడిన వ్యాసం ఇది.

        అమెరికా టీ.వీ రంగంలో  టాక్ షో లకి ప్రత్యేకమైన ప్రజాధరణ కలిగించిన అత్యధిక మైన వీక్షకుల అభిమానాన్ని పొందిన విన్ ఫ్రా టాక్ షో  ప్రపంచ  మీడియాలో ఒక సంచలనం. ఈ కార్యక్రమం స్ఫూర్తిగా ప్రపంచంలో పలు దేశాల్లో, పలు భాషల్లో అనేక టాక్ షో కార్యక్రమాలు తయారు చేయబడు తున్నాయి.   ఈ విన్ ఫ్రా టాక్ షో  ప్రజాధరణ్ కు ఏకైక కారణం  విన్ ఫ్రా  మాట  చాతుర్యం, భావోద్వేగాల సమ్మేళనం, ఎంచుకున్న   సబ్జెక్ట్ ల గొప్పదనమే. 

     అత్యంత దయానీయమైన పరిస్థితులనుండి  అత్యంత ప్రభావితమైన స్థితికి ఎదగటానికి  ఓప్రా విన్ ఫ్రే అనుసరించిన  ధృక్పథం ఏమిటి? పోరాట పటిమ ఏమిటి ?  తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే దయానీయమైన జీవితం నుండి  ఆమె కార్యక్రమంలో ఫాల్గోనడమే పూర్వజన్మ సుకృతం గా  భావించే స్థాయికి  ఆమె ఎలా ఎదగగలిగిందో తెలుసుకుంటే  ఆమె పోరాట పటిమకు మనం  తలవంచి సలాం కొట్టాల్సిందే.....
బాల్యం ; 
     అమెరికాలోని మిస్సిసిపి రాష్ట్రం లో కొసియస్కో అనే ప్రదేశంలో   వెర్నిటా లీ అనే పెళ్ళికాని ఒక నీగ్రో యువతి  కడుపున 1954   జనవరి 29   న ఓఫ్రా విన్ ఫ్రే జన్మించింది. వెర్నాన్ విన్ ఫ్రే అనే  గని కార్మికుడు తన తండ్రి  ఆమె కు చెప్పబడింది.  కాని    కొన్ని  సంవత్సరాల తర్వాత  నోవా రాబిన్ సన్  అనే రైతు  జెనిటిక్ పరీక్షలలో  తండ్రిగా తెలియచేయబడ్డాడు.  అమ్మమ్మ   దగ్గర  తనని వదిలి తల్లి  వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది.  మొదటినుండి  తల్లి తనపట్ల ఏ భాధ్యతకూడా తీసుకోలేదు.  ఆరు సంవత్సరాల వయస్సు వరకు  ఆమె అమ్మమ్మ సంరక్షణలోనే పెరిగింది.  అమ్మమ్మ  హాట్టీ  మే లీ   క్రైస్తవ మతాన్ని బాగా నమ్మే స్త్రీ.  తనతోబాటుగా రోజూ  చర్చికి తీసుకెళ్ళేది. కనీసం ధరించేందుకు దుస్తులు లేని  అత్యంత కడు పేద స్థితిలో  ఉన్నప్పటికి  విన్ ఫ్రే ని క్రమశిక్షణ లో పెంచింది.  చర్చిలో  బైబిల్ చదవడంలో   ఇతరులకి బోధించడంలో    విన్ ఫ్రే  ఆ  చిన్న వయస్సులో  అద్భుత ప్రతిభ చూపి   బోధకురాలిగా  అందరిచేత పిలవబడేది. ఆమె పెద్దయ్యాక  మంచి వక్త కాగలదని ఆమె అమ్మమ్మ  ఆ వయస్సులోనే  ఊహించింది.
         ఆరేళ్ళ వయస్సు తర్వాత తన తల్లి ఉంటున్న విస్ కాన్ సిన్ రాష్ట్రానికి వెళ్ళింది.  కాని  పనిమనిషిగా బ్రతుకు వెల్లబుచ్చుతున్న తల్లి వెర్నిటా లీ  తనని సరిగా పట్టించుకునేది కాదు. ఆమెకు అప్పటికే   పెట్రికా అనే మరో అమ్మాయి ఉండేది.  కాని ఆ అమ్మాయి  అనారోగ్యం తో మరణించింది.  తర్వాత  మరో అమ్మాయికి జన్మ నిచ్చి  తనకి  పేట్రికా అనే పేరు పెట్టింది.
సమస్యల సుడిగుండాలు ; 
                   తొమ్మిది సంవత్సరాల పసి ప్రాయంలో  విన్ ఫ్రే   తన దగ్గర బంధువుల చేత  శారీరక దోపిడికి గురి అయింది. అనేక సార్లు మానభంగానికి గురి అయింది. గతిలేని పరిస్థితుల్లో  ఇంట్లో నుండి పారిపోయింది.  14  సంవత్సరాల వయస్సులో  తన ప్రమేయం లేకుండా తల్లి అయి  మగబిడ్డకు జన్మనిచ్చింది. కాని ఆ బిడ్డ అనారోగ్యం తో మరణించాడు.  ఇటువంటి స్థితిలో ఏ రకమైన ఓదార్పు గాని కుటుంబ తోడ్పాటు లేకపోవడంతో  ఆమె మత్తు మందులకు చెడు సావాసాలకు లోనై   కౌమార శిక్షణాలయాల్లో ఉంచబడింది.
        విద్యాభ్యాసం;  ఇటువంటి స్థితిలో   విన్ ఫ్రా  తండ్రి ఆమె సంరక్షణా భాధ్యత తీసుకొని చదువుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఆమె ను  ఈస్ట్ నాష్ వెల్లీ హైస్కూల్ లో ఆనర్స్  విద్యార్థిని గా చేర్పించాడు.  అన్ని విషయాల్లో ముందంజ వేస్తూ  స్కూల్ లో అత్యంత  ప్రభావిత విద్యార్థిని గా పేరు తెచ్చుకుంది విన్ ఫ్రే. నాటక పోటీల్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం పొందడం తో పాటు  వ్యక్తృత్వపోటీల్లో ప్రథమ స్థానం తెచ్చుకోవడం తో  నల్ల జాతి వారికి సంబంధించిన ప్రతిష్టాకర టెన్నేసే స్టేట్ యూనివర్సిటిలో  స్కాలర్ షిప్  సాధించి  ఉన్నత చదువు కొనసాగించింది. అక్కడ కమ్యూనికేషన్ మరియు పెర్ ఫార్మింగ్ ఆర్ట్ లో  చదువు పూర్తి చేసింది యూనివర్సిటీలో  ఉన్నప్పుడే  Miss Black Tennesse  Beauty pageant అవార్డ్  సాధించింది.



రేడియో వ్యాఖ్యాత గా  మారడం;   

     హైస్కూల్ లో ఉన్నప్పుడే  నీగ్రోల రేడియో  WVOL  లో    న్యూస్ రీడర్  గా తీసుకొనబడింది. అక్కడనుండి Nashville's WLAC-TV లో  ఏంకర్  గా ఎంపికైంది.  ఆ టీ.వీ లో  మొదటి నల్లజాతి ఏంకర్ వెన్ ఫ్రే నే.   ఆ తర్వాత  అక్కడ నుండి  Baltimore's  WJZ-TV   కి  మారింది.  ఆమె ప్రతిభను గమనించిన టీ. వీ కంపెనీ  ఆమెకు  People Are Talking  మరియు  Dialing for Dollars   అనే  ప్రొగ్రామ్స్  లో  అవకాశం ఇచ్చారు.  తన వ్యక్తి గత ప్రతిభతో  ఆ   కార్యక్రమాలను అత్యంత ప్రజాధరణ పొందిన కార్యక్రమాలుగా మార్చింది.

         The Oprah Winfrey Show,;   

                    ప్రముఖ పాత్రికేయుడు రోజర్ ఎబెర్ట్  చొరవతో ఆమె King World కంపెనీ తో   వ్యాపార భాగస్వామి అయింది.  1986 సెప్టెంబర్ 8  వ తేదీ న తనకు అత్యంత ప్రజాధరణ కల్పించిన   The Oprah Winfrey Show  ప్రాంభం అయింది. ఇక్కడ నుండి  ఆమె  వెనుతిరిగి చూదనవసరం లేకుండా   తన ప్రత్యేకత తో ఆ కార్యక్రమాన్ని  నెం 1  కార్యక్రమం గా మార్చింది. ఈ  కార్యక్రమాన్ని  ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్ల వీక్షకులు 109  దేశాల్లో  చూస్తున్నారంటే ఆమె గొప్పతనం అర్థమవుతుంది. 1998  లో అనేకమంది భాగస్వాములతో స్త్రీల సమస్యలకోసం  ఆక్సిజన్  అనే  కేబుల్ చానల్  ప్రారంభించింది.  O  అనే పత్రిక ప్రారంభించడంతో ఆమె  ముద్రణా రంగం లో అడుగుపెట్టింది.  ప్రస్తుతం ఆమె  అమెరికాలో అత్యంత సంపన్నమైన నల్లజాతి మహిళ గా  ఎదిగింది.

 మరి అత్యంత దయానీయమైన స్థితి నుండి ప్రపంచ ప్రఖ్యాత మహిళగా ఎదగడానికి  ఆమె  నమ్మిన సిద్ధాంతాలేమిటి?  అనుసరించిన విధానాలేమిటి ?    విన్ ఫ్రే  జీవిత గుణ పాఠాలను మనం తెలుసుకుంటే  మన జీవితాన్ని కొంత వరకు మార్చుకోడానికి  అవకాశముంటుంది.  అవి  ఏమిటంటే..

LESSON 1 ;  SET  HIGH GOALS

LESSON 2 ;  LISTEN TO INNER VOICE

LESSON 3 ; OVERCOME YOUR FEAR

LESSON 4 ; RISE ABOVE THE OBSTACLES

LESSON 5 ; BE RESPONSIBLE FOR YOUR OWN LIFE

LESSON 6;  FACE THE CHALLENGES

LESSON 7 ; RECOGNIZE AND SEIZE THE OPPORTUNITY

LESSON 8 ;  USE THE NEW TECHNOLOGY

LESSON 9 ; BE A GOOD CORPORATE CITIZEN

LESSON 10 ; FIND YOUR PASSION

         వీటి గురించి మరింత  వివరం గా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..  ( ఇంకా ఉంది )

Wednesday, 18 January 2012

MANAGEMENT LESSONS FROM THE FILM '' BUSINESSMAN''


                 MANAGEMENT LESSONS FROM THE FILM '' BUSINESSMAN''

                    చూసే కళ్ళుంటే, అర్థం చేసుకునే మనసుంటే నేర్చుకునేందుకు అనేక విషయాలుంటాయి. ఈ మధ్యే రిలీజై సంచలనం సృష్టిస్తున్న బిజినెస్ మేన్ సినిమాలో మేనేజ్ మెంట్ కు సంబంధించిన వ్యక్తిత్వ వికాస శిక్షణకు సంబంధించిన విషయాలు చర్చిద్దాం..    

                    దర్శకుడు పూరీ జగన్నాధ్ నిత్యం అనేక పుస్తకాలు చదవడమే కాకుండా అనేక ప్రముఖ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలలో ఉన్న విషయాలను కథానాయకుల వ్యక్తిత్వాన్ని మలచడానికి ఉపయోగిస్తుంటారు. బిజినెస్ మేన్ చిత్రం లో అనేక విషయాలు ఒక మంచి వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన పుస్తకానికి కావలసిన సబ్జెక్ట్ , సత్తా, పటుత్వం అన్నీ ఉన్నాయి... ఈ మధ్య ఒక పత్రికా సమావేశంలో ఈ సినిమా కథాంశాన్ని ఒక పుస్తకం గా రాస్తానని చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇవి మీ అందరితో పంచుకుందామనే ఆసక్తి ఈ వ్యాసం రాయడానికి మూల కారణం.  సినిమా తయారీలో ఉన్న భారీ పెట్టుబడి కోసం కొంత మసాలా అన్ని వర్గాల కోసం  జోడించినా  సినిమా కథాంశంలో  యువత ప్రయోజనం కోసం  కొన్ని నియమాలను పాటించడం పూరీ జగన్నాథ్  గారి ఆనవాయితీ...
             
                  ప్రతీ మేనేజ్ మెంట్ నిపుణులు   పీటర్ డ్రక్కర్  మొదలుకొని స్టీఫెన్ కొవె వరకు చెప్పే సూత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.   మా వ్యక్తిత్వ వికాస  శిక్షకులు నిర్వహించే సెమినార్ లలో  పోకిరీ  సినిమాకి సంబంధించిన రెఫరెన్స్  డైలాగ్  కానీయండి లేదా సన్నివేశం కానీయండీ లేకుండా  మా సెమినార్ లు పూర్తి కావు అంటే అతిశయోక్తి కాదు.   నేటి యువతకు  సినిమా  మాధ్యమంలో  ఈ నియమాలు బాగా తలకెక్కుతాయి. మహేష్  బాబు లాంటి  భారీ  యూత్  ఫాలోయింగ్ హీరో తో చెప్పిస్తే  అనుసరించే వాళ్ళ సంఖ్య కూడా పెరగవచ్చు.  సినిమాలో  మనం గమనించదగ్గ  కొన్ని మేనేజ్ మెంట్ సూత్రాలు  క్రింద తెలియచేయబడ్డాయి.

1. HAVE A CLEAR GOAL - DECLARE IT
:

                      ఈ సినిమాలో  చాలా  ఖచ్చితం గా చెప్పిన విషయం ఏమిటంటే  ప్రతీ ఒక్క వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి.  నీ లక్ష్యం  10  మైళ్ళు అయితే 11 వ  మైలుకి  గురి పెట్టు అని చాలా  స్పష్టం గా చెబుతాడు హీరో.    సినిమా ప్రారంభంలో హీరో తాను ముంబాయికి ఎందుకు వచ్చాడో  చాలా స్పష్టం గా చెబుతాడు. ఏదో నెమ్మదిగా పనిచేసుకోడానికి రాలేదు. మాఫియా మళ్ళీ  పునరజ్జీవింపచేయడమే లక్ష్యం అంటాడు.   కాని అంతిమ లక్ష్యం ఏమిటనేది కథా గమనం లో తెలుస్తుంది.   నీ లక్ష్యం ఎలా ఉండాలంటే  అది వినేవాళ్ళకు  ఆశ్చర్యం కలగాలి. నోరు వెళ్ళబెట్టాలి. అబ్దుల్ కలాం అంటారు low aim is a crime అని.   Crime  కి  సంబంధించిన aim  అయినప్పటికీ  ఇక్కడ లక్ష్యం చిన్నదా పెద్దదా? అనేది ముఖ్యం.  లక్ష్యం తరుచూ ప్రకటించడం వలన దానిని సాధించాలనే కమిట్ మెంట్  పెరుగుతుంది.  లక్ష్యం  అనేది  కాలం తో పాటు  మారుతూ ఉండాలి.   చివరిలో  మహేష్ బాబు  హీరోయిన్ తో ఒక వేళ నీ ప్రేమ నిజమై నే బ్రతికితే  ముంబాయి కి  కాదు ఇండియా మొత్తానికి..........  అంటూ   సిగ్నిఫికెంట్ గా  చేయి చూపిస్తాడు.  Micro Aims will  be changed into Macro Aims along with the time.

2. DEVELOP TRUST AMONG THE PEOPLE
;

                      లక్ష్యం ఉంటే సరికాదు  దానిని సాధించేందుకు  సరిపడా జట్టు ఏర్పాటు చేసుకోవాలి  తన వారందరిలో తనకు  ఆ సత్తా   ఉందనే విశ్వాసం  కలిగించాలి.   అందుకే తన లక్ష్యాన్ని ప్రకటించినపుడు నోరు వెళ్ళిబెట్టిన బ్రహ్మాజీ ని చాచి కొడతాడు. నీవంటే  భయం కలుగుతుందిరా  అంటే  నీకే భయం కలిగించలేకపోతే ముంబాయికి ఎలా భయం కలిగించ కలుగుతానని అంటాడు.  డోంగిరీ కి వెళ్ళి అక్కడ క్రిమినల్స్  చితక్కొట్టి తాను అందరినీ నడిపించగల నాయకుడినని అందరికీ పని కల్పిస్తానని ఎటువంటి ఈగోలు లేకుండా తన క్రింద పని చెయ్యమని చెప్పి ఒక్కొక్కడికి డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చి  వారి విశ్వాసం పొందుతాడు.  మున్షీ  ని   షకీల్ అండ్ టీం తో  జైల్ లో చంపించి లాలూ (  షియాజీ షిండే     )  విశ్వాసం పొందుతాడు. తాను  ప్రారంభించే  బిజినెస్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి నాజర్ ని పిలిచి  '' నీ లాంటి కసి ఉన్నవాడు  మా డిపార్ట్ మెంట్ లో ఎందుకు లేడని ''  అతని విశ్వాసం పొందుతాడు.  నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం  ప్రజల విశ్వాసం, విశ్వసనీయత  పొందగలగడం.  అది కోల్పోయిన వాళ్ళు తిరిగి పొందడానికి ఎన్ని పాట్లు పడుతుంటారో నిజ జీవితంలో చూస్తున్నాం. దారావిలో  బ్యాంకు అప్పులతో బాధపడుతున్న సామాన్య ప్రజానికానికి  పది రోజుల్లో అందరి ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తానన్న మాట నిలబెట్టుకోవడం ద్వారా అక్కడ ప్రజల మద్దతు పొందుతాడు.   విశ్వసనీయత, నమ్మకం  జట్టును గాని ప్రజలను గాని నడిపించేందుకు ముఖ్యమైన సాధనాలు

3. INFORMATION GIVES CONFIDENCE :
      
                 హీరో  తన తల్లిదండ్రులను చంపిన ప్రకాష్ రాజ్ పై పగ సాధించడానికి   అమాయకంగా  పధ్నాలుగు సంవత్సరాల వయస్సులో బహిరంగంగా చంపడానికి సిద్ధపడి, విఫలమైన తర్వాత తన లక్ష్యాన్ని సాధించడానికి  సంబంధించిన , దానికి కావలసిన సమచారం సంపాదిస్తాడు.   మున్షీ  వలన లాలూకి గల  ఇబ్బంది తెలుసుకుంటాడు.  తనగురించి  నెగటివ్  సలహాలు  ఇస్తున్న ధర్మవరపు సుబ్రమణ్యం యొక్క  రహస్యాలను చెప్పడం ద్వారా  అతని ద్వారానే  '' వీడికున్న  ఇన్ఫర్మేషన్ , కాన్ఫిడెన్స్  చూస్తే  వీడిని నమ్మొచ్చు'' అనిపిస్తాడు.  మహారాష్ట్ర బ్యాంకు లో  ఉన్న పట్టాల గురించి ,  విలన్  కమీషనర్ నాజర్  ని చంపబోతున్న విషయాన్ని.  ఇంకా అనేక సందర్భాలలో   విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లతో సిధ్ధంగా ఉంటాడు.  తనకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఏ మాత్రం సంకోచించడు.   లక్ష్యాన్ని   సాధించాలనుకునే ప్రతీవారు తెలుసుకోవలసినది ఇదే.  knowledge is power & knowledge gives you confidence.  ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కో సెంటర్ లో ఎంత ఖర్చవుతుందో తెలుసా  అని ధర్మవరపు సుబ్రమణ్యం ఎగతాళి గా అడిగితే  అహ్మదాబాద్ నుండి మొన్న కడప వరకు ఎంత ఖర్చయిందో  ప్రస్తుతం ఎంత అవవచ్చునో  సమాచారం చెబుతుంటే అంతా నివ్వెరపోతారు మనతో సహా.    చేతిలో ఉన్న  సమాచారమే  ఆత్మ విశ్వాసాన్ని  పెంపొందిస్తుంది.   ఆఖరికి ప్రకాష్ రాజ్ ని ఎలక్షన్ నుండి అనర్హున్ని చేసే సమాచారం  అతనికి అన్ని విధాల ఉపయోగపడుతుంది.   So always try  to acquire information by enhancing your knowledge.

4. FORM BUFFER CENTERS & DEVELOP A TEAM AND MAINTAIN WITH WIN/WIN
            
                   హీరో  మహేష్ బాబు ముంబాయికి వచ్చాక  తనకు కావలసిన సహాయం ఎప్పటికప్పుడు పొందేందుకు   ఒక buffer center  ( Buffer Platform)  గా  షియాజీ  షిండే ని ఏర్పాటు చేసుకుంటాడు.  అతనికున్న సమస్యని తొలగించడం ద్వారా అతని మద్దతు పొందుతాడు. ఎంతకావాలంటే నీకు డబ్బుకి  మర్డర్ లు చేసే వాడిలా  కనబడుతున్నానా  అని    అతనిని తన అవసరాలు తీరుస్తూ   తన లక్ష్యాన్ని సాధించేందుకు  లాంగ్ రన్ లో ఉపయోగించుకునేందుకు ఒక Resource గా  మార్చుకుంటాడు..  అంతే కాక  తన  అంతిమ లక్ష్యం  ప్రకాష్ రాజ్  కాబట్టి దానికి ఉపయోగపడే విధం గా ముంబాయిలో తన పట్టుకోసం  బలమైన టీం ఏర్పాటు చేసి  ఆ టీం సభ్యుల   అవసరాలు జీతాలిస్తూ  తీరుస్తాడు.    Team Building and Team performing are the important keys in the success of any individual or organization.   ప్రజలను ఉపయోగించుకోవడమే తప్ప  వారికి తగినంతగా ఉపయోగపడకపోవడమే  అనేకమంది నాయకులు అర్ధాంతం గా  కనుమరగవడానికి  కారణం.

5.. TAKE CALCULATED RISK - DEVELOP SAFEGUARD MECHANISM
:

               తాను ఎంచుకున్న లక్ష్యం  అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి ఎప్పటికప్పుడు  తన రిస్క్  కి సంబంధించిన   తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ  పరిణామం లోనే  హీరోయిన్ ని  ప్రేమలో  దించుతాడు  తన ప్రాణాలకు రిస్క్  పోలీస్ డిపార్ట్ మెంట్  కాబట్టి   కమీషనర్ కూతురైన కాజల్  ని  ఎంచుకుంటాడు.   కాని చివరికి ఆమె     ప్రేమలో  పడతాడు  అందుకు తగ్గ రిస్క్  తీసుకుంటాడు  అది వేరే సంగతి.   తన ప్రాణాలను రిస్క్ పెట్టినప్పుడల్లా  తగిన జాగ్రత్తల్లో ఉంటాడు.  ''  అందరం మనుషులమే   అందరికీ  ఫేమలీస్  ఉన్నాయి.  చదువుకున్న వాళ్ళే కదా  ఎమోషనల్  అవ్వద్దమ్మా '' .  అంటూ  తనని ఏమైనా  చేస్తే  ఏం జరగబోతుందో  చాలా స్పష్టం గా చెబుతాడు.   ఎమోషనల్  బ్లాక్ మెయిలింగ్  సరైనది కాకపోయినప్పటికీ   రిస్క్ ఉన్నప్పుడు   జాగ్రత్తలవసరమే.    Don't take chance at the risk of your life  అంటారు.   చివర్లో   కాజల్ కి తన ప్రేమ మీద నమ్మకం కలిగించడం కోసం,  విలన్లను చంపడానికి  తనను తాను కాల్చుకుంటాడు.  రిస్క్ లేనిదే సక్సెస్ ఉండదు గదా...

6. HAVE COMMUNICATION AND NEGOTIATION SKILLS
      
                  మహేష్ బాబు  తన హీరోయిజం అంతా  మంచి కమ్యూనికేషన్ లో  చూపిస్తాడు.  ఇరవై వేలు రూపాయలను ఇరవై వేల డాలర్లనడం  మోసగించడం కానపుడు  తాను చేసినది మోసం కాదని కాజల్  ని  కన్విన్ష్   చేస్తాడు.   దేవుడ్ని కొలవడం కూడా బిజినెస్  అని చెప్పడం,   లేడీని పులి వేటాడటం డిస్కవరీ చానల్ లో  చూసే వాళ్ళంతా లేడీ బ్రతకాలని కోరుకుంటారు, తీరా లేడీ బ్రతికాక టీ.వీ.లు కట్టేసి  హాయిగా నవ్వుకొని కోడి ని చంపి పలావ్ చేసుకొని తింటారు. వారికి లేడి మీద జాలి కన్నా, పులి ని ఏమీ చేయలేమన్న ఏడుపే ఎక్కువ అని చెప్పడం, చేపలను తినడం వయలెన్స్ కాదా అని చెప్పడం,     క్రైం చేసుకునే వాళ్ళకు వెధవ ఈగో లెందుకు  అనడం,  షియాజీ షిండే కు  దగ్గరవడం కాని ,  ఆఖరికి   డిల్లీని నీకే ఇస్తా  అని   తన plan of action  ని జాతీయస్థాయి నాయకుడి దగ్గర తెలియపరచడం  ఇవన్నీ   తన ప్రభావపూరిత  కమ్యూనికేషన్ కి పరాకాష్ఠ  అని చెప్పొచ్చు.  ఈ రోజుల్లో ఎంతమంది  అంత చక్కని కమ్యూనికేషన్ కలిగి ఉన్నారు.  క్లాస్ లో  తన స్వంత క్లాస్ మేట్స్ వద్ద  సెమినార్  చెప్పాలంటే, ఇంటర్వ్యూ బోర్డ్ ముందు నిలబడాలంటే  ఆఖరికి  తన తల్లి దండ్రులతో తన ఇష్టాయిష్టాలు చెప్పాలంటే  బొమ్మరిల్లు సీన్  జరగాల్సిందే  కాని తమ అభిప్రాయాలను  సరిగా  చెప్పలేకపోతున్నారు.   A word  rules the world.   Napoleon Bonaparte ,   Adolf Hitler, Abraham Lincoln. Barack Obama ,  N.T.R    లు వీరంతా నాయకులు అవగలిగారంటే  వారి కమ్యూనికేషన్  మరియు  సంప్రదింపులు చెయ్యగలిగే నైపుణ్యమే.  ఈ సినిమాలో కథానాయకుడు  తన  సంభాషణా చాతుర్యం తో  పోలీస్ కమీషనర్ ని,  ఆయన కూతుర్ని  , ఆఖరికీ  సినిమా చూడటానికొచ్చిన ప్రేక్షకుల హృదయాల్ని    కేజీలల్లో  కాదు  క్వింటాలలో కొట్టేస్తాడు.

7. HAVE RIGHT PHILOSOPHY OF LIFE
               
           ''  ఎవడి సినిమా వాడిదే.  ఎవడి సినిమాకి వాడే  హీరో.''  ఇదే  దర్శకుడు ఈ సినిమా ద్వారా  చెప్పాలనుకున్నది.  అనేకమంది మా వాడి సినిమా ఇన్ని రోజులాడింది, ఇంత కలెక్షన్స్ వసూలు చేసింది  అంటూ    వీధులకెక్కి  కాదు చివరికి టీ వీ  చానెల్లెక్కి  తన్నుకు చస్తున్నారు.  బహుశా  వారికి ఈ విషయం ఎవరు చెప్పిన  అర్థం  కాదని   మహేష్ బాబు చెప్పించాడు.  ప్రతి  ఫ్రేం లో   హీరో  తన జీవితం గురించి,   ఇతరుల అభిప్రాయాల గురించి స్పష్టం గా విశ్లేషిస్తాడు.   ఇక్కడ  ఎవరి ప్రపంచం  వారిదే.  నా ప్రపంచం నీకు అర్థం కాదు. అని హీరోయిన్ తో అంటాడు.  దేవుడి గురించి,  హింస గురించి ఆఖరికి  మాఫియా గురించి   తన ఆలోచనలు అందరినీ  ఆలోచింప చేస్తాయి.  సూర్య భాయ్  అంటే  ఒక పేరు కాదు  ఒక బ్రాండ్ ఇమేజ్.  ఇలా ప్రతి ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతానికి లేదా సూత్రానికి ఒక ప్రతీకగా మారాలి.    అహింస అంటే  గాంధీజీ,  సామాజిక సేవ అంటే  ఒక మదర్ థెరీసా,  సామాజిక న్యాయం అంటే  ఒక అంబేద్కర్.   ఇక్కడ జాతీయ నాయకులతో  ఒక సినిమా నాయకుడిని పోల్చడం కాదు నేను చెబుతున్నది.  నీ జీవిత సత్యానికి, నీ జీవన మార్గానికి నీవే ఒక పర్యాయపదం గా ఒక బ్రాండ్ ఇమేజ్  గా మారగలగాలి.
          ప్రతీ ఒక వ్యక్తి కూడా తన జీవితం గురించి, తన ఆలోచనల గురించి,  తన జీవన విధానం గురించి నిర్ధిష్ట అభిప్రాయాలు కలిగియుండాలన్నదే  ఈ సినిమా చెప్పే  గొప్ప మేనేజ్ మెంట్  పాఠం 

8. SUCCESS DEPENDS UPON NET WORKING :
   
        నీవు ఉన్నతంగా  ఎదగాలంటే  ఎంతమంది తో సత్సంబంధాలు కలిగియున్నావన్నదే ముఖ్యం.  మొత్తం దేశం  అంతా తన నెట్ వర్క్  విస్తరింప చేయడం  తో జాతీయ రాజకీయాలను సైతం నిర్దేశించగల స్థాయికెలతాడు.   ప్రతీ రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో మమేకం  అవడానికి  ప్రయత్నించేది ఇందుకే...    పిసరంత  అధికారం చేతికొస్తే అహంకారం తలకెక్కి ప్రజలకు దూరమై  చివరికి  అడ్రస్ లేకుండా పోయిన నాయకులెంతోమంది  మన వ్యవస్థలో ఉన్నారు.  ప్రతీ చోట, ప్రతీ ప్రదేశం లో  తన వారిని  ఏర్పాటు చేసుకొని చాలా సంస్థలు బహుళ జాతి సంస్థలుగా ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందుతున్నాయి.    నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆక్టోపస్ లా  అష్టదిక్కులా  వ్యాప్తి చెందడమే  మనం నేర్చుకోవలసిన  గుణపాఠం. 

9. READY TO SACRIFICE  FOR YOUR DREAM :
 
        ప్రతి ఒక్కడికీ ఒక కల ఉంటుంది.  కలలు లేనివాడు మనిషే కాదు.  కాని ఈ  సినిమాలో  హీరో అడుగుతాడు నీ కలకోసం ఏమి  త్యాగం చేయగలవని.   ముంబాయిని  శాంతిగా ఉంచుదామనే కల కమీషనరైన నాజర్ కి ఉంటుంది  దానికోసం  ఏం చెయ్యగలరు. మీ కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యగలరా?  అని ప్రశ్నిస్తే  వారికి కాదు    చూస్తున్న ప్రేక్షకులకి మాట రాదు..  కల కంటే  సరి కాదు.  ఆ  కల సాకారం  పొందేందుకు ఎంతటి త్యాగానికైనా  సిద్ధపడాలి.   పిల్లల భవిష్యత్ గురించి కలలు కనే తల్లిదండ్రులు అహోరహం శ్రమించే తల్లిదండ్రులు, తాము కనుక్కోనవలసిన రహస్యాలకోసం  రేయనక పగలనక  ప్రయోగశాలల్లో గడిపే సైంటిస్ట్ లు    ఇలా ఎంత మందో  తమ కలల సాకారం కోసం శ్రమిస్తున్నారు. త్యాగాలకు సిద్ధంగా ఉంటున్నారు.   కాని  కలలు కంటూ  రోడ్డు మీద  వాల్ పోస్టర్ లకు  పాలాభిషేకాలు,  రక్తాభిషేకాలు చేసే వారు  ఏం త్యాగాలు చేస్తున్నారో?...   చివరికి  కాజల్ ప్రేమను పొందడానికి  తన ప్రాణాలను త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు.   కసి, శ్రమ, త్యాగం  జీవిత వ్యాపారాలు చేసే  ప్రతీ  కలల బేహారులకు  నిత్య పెట్టుబడులు. 

10. LIFE IS A MESSAGE.  :

                  '' జీవితం అనేది ఒక  యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు.   Be alert   , protect  your self.   లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి .  కసితో పరిగెత్తండి.  పాడాలనుకుంటే కసిగా  పాడేయండి.  చదవాలనుకుంటే కసిగా  చదివేయండి. లైఫ్ లో ఏ గోల్ లేనివాళ్ళు మాత్రం  వీలైనంత త్వరగా చనిపోండి. మీవలన మాకు  ఏ ఉపయోగం లేదు. గుర్తు పెట్టుకో  నీ కంటే   ' తోపు '  ఎవ్వడూ  లేడిక్కడ. నీకు  ఏదనిపిస్తే  అది చెయ్యి.  ఎవ్వడి మాట వినొద్దు.  మనిషనే వాడి మాట అసలు వినొద్దు.  నీ టార్గెట్  టెన్ మైల్స్ అయితే  ఎయిమ్ ఫర్  ద లెవెన్త్  మైల్. . కొడితే దిమ్మ తిరిగిపోవాలి.  చల్. ''  ఇది  చివరిలో దర్శకుడు  మహేష బాబు ద్వారా  అందించే సందేశం.   ఇదే   ఈ సినిమా నేర్పే జీవిత సత్యం. ఇవి  మహేష్ బాబు పాత్ర ద్వారా  దర్శకుడు పూరీ జగన్నాధ్  తన అనుభవాలనుండి నేర్చుకున్న జీవిత సత్యాలను  వ్యక్తిత్వ వికాస పాఠాలుగా  చెప్పించాడు.   దీని ద్వారా  తెలుసుకునేది  ఒకటే ఎన్ని ఆటంకాలైనా ఒంటరిగా ఎదుర్కొని  ఎదురీతలతో గమ్యాన్ని చేరావా  నీ జీవితం ఒక సందేశం  అవుతుంది. నీవు చెప్పే   ప్రతీ అక్షర సత్యం ఎంతో మందికి మార్గదర్శకం అవుతుంది. నీవు  నడిచిన దారి  పదిమందికి గమ్యం చేర్చే రహదారి  కావాలి. . నీ వద్దకు టీవీ చానెళ్ళు కెమెరా పట్టుకొని వస్తే  నీ  డైలాగ్స్ నీవు చెప్పగలగాలి.   No one kicks a dead dog.     Be a hero.  live like a hero  and  die  like  a hero.

           చాలా ఓపికతో చదివినందుకు  థాంక్స్  చెప్పను.  వీలైతే  మనం ఆచరిద్దాం.  మీ అభిప్రాయం మాత్రం  trainerudaykumar@gmail.com   కి  మెయిల్  చెయ్యండి .   ఈ బ్లాగ్ ని   ప్రముఖ పాటల  రచయిత   భాస్కరభట్ల  గారి ద్వారా తెలుసుకొని   ఈ సినిమా  దర్శకులు శ్రీ  పూరి జగన్నాథ్  గారు  మెయిల్ ద్వారా  తన అభిమానం  తెలియ చేసారు.


Puri Jagan
3:25 PM (13 minutes ago)

to me
Love you sir
Meeru rasindi nenu kuda rayalenu
Simply love you

Sent from my iPad

 I thank him personally  and Thank you also for reading 
  విష్ యూ  గుడ్ లక్..

అలజంగి  ఉదయ్ కుమార్
you can follow following links 

hrudayfeelings.blogspot.com

http://www.youtube.com/watch?v=W12ahO0Y7dU