Monday, 26 August 2013

నేనింతే................. తెలుసుకోవల్సింది.?????? .ఆచరించాల్సింది?????


డియర్ ఫ్రెండ్స్ ,
   సినిమాలు చూస్తుంటారా?   వినోదం కోసమా... కాలక్షేపం కోసమా..... ఏదో స్నేహితులతో కలిసి  ఆనందిద్దాం  అని వెళ్తుంటారా?    
   సినిమా కేవలం వినోదం కోసమే అనే ఆలోచన మీకు ఉంటే దానిని పక్కన పెట్టండి.......ఈ రోజే   పూరి జగన్నాథ్  తీసిన సినిమాల డి.వి.డి లు   కొనండి....  ఒక్కో సినిమా   ఒక్కో వ్యక్తిత వికాస నిఘంటువు..  హీరో ల పాత్రల చిత్రీకరణ, వ్యక్తిత్వ నిర్మాణం  పరిశీలించండి....జీవితాన్ని ఎలా జీవించాలో..... మన వ్యక్తిత్వాల్ని ఎలా మెరుగు పరుచుకోవాలో ......కళ్ళకు కట్టినట్టు, అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు వివరిస్తాడు....   మనుష్యుల్ని, సమాజాన్ని ఇంతచక్కగా అవగాహన చేసుకొని సినిమా మాధ్యమం కూడా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించవచ్చని నిరూపించిన అతి తక్కువ మంది దర్శకులలో  పూరి జగన్నాథ్  అగ్రగణ్యుడు అని చెప్పడం లో అతిశయోక్తి ఏ మాత్రం కాదు...   ప్రతి మనిషికి సామాజిక భాధ్యతకన్నా  వ్యక్తిగత భాద్యత ముఖ్యం అని కెమేరామేన్ గంగ తో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర తో చెప్పిస్తే....  కెరీర్ ముఖ్యమా  కుటుంబం ముఖ్యమా  వర్క్ లైఫ్ బాలెన్స్ ఎలా చెయ్యాలో  నలిగిపోతూ  కెరీర్ కోసం  కుటుంబాన్ని త్యాగం చేస్తే  అది తప్పు ..కెరీర్ కన్నా  కుటుంబమే ముఖ్యం, మానవ సంబంధాలే ముఖ్యం అని అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ పాత్ర ద్వారా  చెప్పించారు పూరి జగన్నాథ్ ......ఇక బిజినెస్ మేన్ చిత్రం లో అయితే ఎన్ని మేనేజ్మెంట్ పాఠాలున్నాయో ఒక పెద్ద పుస్తకమే రాయ వచ్చు.
        ఇవన్నీ చిత్రాలు ఒక ఎత్తు అయితే... నిలువెత్తు వ్యక్తిత్వానికి ఒక నమూనా గా..  ఒక మనిషి లక్ష్యం అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ...ప్రేమించే పని కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి ..ఎన్ని అవాంతరాలు వచ్చిన, ఆకర్షణలు వచ్చినా   చలించకుండా  ఎలా సాధించాలి?  తనను ప్రేమించేవారు వారి కాళ్ళపై వారు నిలబడేటట్టు, వారి సమస్యలను వారికి వారే వ్యక్తిగత భాధ్యత ద్వారా ఎలా తొలగించుకునేటట్టు చేయాలి  ఇలాంటి విషయాలను ఆదర్శం గా ఆవిష్కరించిన   చిత్రం   నేనింతే.........

                           *** నీకిష్టమైన పని చెయ్****  


       సినిమా  మొదలవడమే  సినిమా హీరో రవితేజ కల కంటూ ఉంటాడు.  నూటికి ఎనభై శాతం మంది తాము చేస్తున్న పనిని ఏ మాత్రం ఇష్టపడకుండా  తిట్టుకుంటూ,  రాజీ పడుతూ, మనసు చంపుకొని,  అయిష్టం గా చేస్తుంటారు. చేస్తున్న పని ఏ మాత్రం సంతృప్తి చెందకుండా  మెకానికల్ జీవిస్తుంటారు.  ఇష్టమైన పని చేయడానికి  చాలా కష్టపడాలి.  బ్రతుకు అదే కావాలి, ఊపిరి అదే కావాలి, కలలో కూడా దాని గురించే ఆలోచించాలి.  బలమైన కోరికలే కలలు గా రూపాంతరం చెందుతాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్  చెబుతాడు.   తెలుగు సినిమా ఫీల్డ్ లో మంచి దర్శకుడు కావాలని రవితేజ కోరిక, జీవిత లక్ష్యం.   అది సాధించాలంటే ఒక రోజులో  జరిగేది కాదు. దానికోసం నిరంతరం శ్రమిస్తుండాలి. ప్రతీ ఆలోచన తన లక్ష్యానికి సంబంధించినదై ఉండాలి.  ఏ సినిమా చేస్తున్నవు అని హీరోయిన్ ని అడిగితే  తాను  చరణ్  సినిమా అంటుంది. దానికి రవితేజ ఓ మా రాజమౌళీ గారిదా అంటాడు.  ఏ రంగం లో ఉన్నావో ఆ రంగానికి  చెందినవారితో  నిన్ను నీవు అసోషియేట్ చేసుకోవాలి.

                          *****  లైఫ్  అంటేనే పెయిన్ ****

             జీవితమంటేనే ఒక పోరాటం. పోరాటానికి సిద్ధం గా ఉండాలి.  హీరోయిన్  ఒక డాన్సర్.  డ్రెస్ వేసుకోడానికి ఇష్టపడకపోతే  ఆమె మీద కోప్పడతాడు.  జీవించడానికి, డబ్బుకోసం  ఆమె  పడే  మానసిక   సంఘర్షణ  చూసి  విలువలకు ,  పరిస్థితులకు  ఆమె  పడుతున్న  వేదన చూసి  ఇష్టపడతాడు.     సాధారణంగా ఆడవారిని  తమ  పరిస్థితుల్ని  పట్ల కాస్త జాలి,  వారి పట్ల కాస్త సానుభూతి చూపించి  చాలామంది  దగ్గరవడానికి ప్రయత్నిస్తారు.  కాని హీరో జాలి కాని,  సానుభూతి  కాని  చూపించడు.  నీ సమస్యల్ని నీకు నీవుగ పరిష్కరించుకో అని హీరోయిన్ కి, ఆమె అక్కకి నిఖార్సుగా చెబుతాడు.  ఎదుటివారి స్వీయభాధ్యతను పదే పదే గుర్తుచేస్తూ వారి కాళ్ళ పై వారు నిలబడాలని ఆశించడం నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారి లక్షణం.