Powerful Life Lessons from the Punch dailogues of Thrivikram Srinivas from Movie JULAI
నేటి కాలం దర్శకులలో కథా బలం తో బాటు మలుపులతో కూడిన కథనం దానికి మించిన పదునైన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారిలో త్రివిక్రం శ్రీనివాస్ ముందుంటాడు అంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పటినుండి అన్ని రకాల పుస్తకాలను కాచి వడబోయడమే కాకుండా తెలుగు బాషమీద మంచి పట్టు ఉండటమే కాకుండా ప్రాసతో కూడిన భాష, పద ప్రయోగాలలో వైవిధ్యం చమత్కారం తో కూడిన పంచ్ డైలాగ్ లు ప్రేక్షకులకు నవ్వు కలిగించడమే కాకుండా ప్రతీ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తాయి. కాని ప్రతీ సంభాషణ ని లోతుగా పరిశీలించి చూస్తే తాను కాచి వడబోచిన జీవిత సత్యాలు అంతర్లీనంగా గోచరిస్తాయి.ఈ మధ్య విడుదలయిన జులాయి సినిమాలో ఆద్యంతం అనేక డైలాగ్ ల్లో under current గా మంచి భావాల్ని, ఆలోచనలని తెలియచేస్తాయి.. కొన్ని డైలాగ్ లను పరిశీలిస్తే.....
ఎవడు జులాయి??????
1..లక్ష రుపాయకు తగిలే లాటరీ టికెట్ కూడా కష్టపడి
సంపాదించిన రుపాయి తోనే కొనాలి... జీవితం హై వే.. గెలుపు వన్ వే.. ఇందులో షార్ట్ కట్స్ కి నో వే......
సినిమా ప్రారంభం లోనే TITLE JUSTIFICATION చేసేటట్టు ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈ డైలాగ్ చెప్పించాడు డైరెక్టర్ త్రివిక్రం..
కనీసం కష్టపడకుండా అడ్డదారిలో ఎదిగిపోదామనుకునే ప్రతీ వాడు ఒక జులాయే... నెలంతా
కష్టపడిసంపాదించే బదులు పదివేల్ రుపాయల్ని రెండుగంటల్లో లక్ష
కష్టపడిసంపాదించే బదులు పదివేల్ రుపాయల్ని రెండుగంటల్లో లక్ష
రుపాయలు చేసేద్దామనే వై ఖరి కలిగియున్న రవి (అల్లు అర్జున్)జులాయి అయితే రెండు శాతం వడ్డి ఎక్కువ ఇస్తాడంటే వెనుక ముందూ ఆలోచించకుండా పదిహేను వందల కోట్లు డిపాజిట్ చేసిన ప్రతీవాడూ ఒక జులాయే. అంతమొత్తాన్ని ఒక క్రిమినల్ తో కలసి కొట్టేసి హైదరాబాద్ లో పెద్ద సైట్ కొనేద్దామని ప్లాన్ చేసిన వరద రాజులు (కోటా) , పదిమందితో ప్లాన్ చేసి పని జరిగాక వాటాలు ఇవ్వనవసరం లేకుండా అందరినీ పైకి పంపించిన బిట్టూ ( సోనూ సూద్) , డంపింగ్ యార్డ్ లో డబ్బు ఉందని తన వెహికిల్ కి ఎగిరివచ్చిన నోటు తో గుర్తించి అందర్నీ పంపించి గోవిందరాజులతో కలసి బిట్టుని మరియు పైసా ఆశించకుండా లైఫ్ రిస్క్ చేస్తున్న హీరో రవిని కూడా బోల్తా కొట్టించాలనుకున్న రాజ్ మాణిక్యం ( రావు అశోక్), ఐ,పి,ఎస్ అఫీసర్ అయినా గన్ వాడాలన్నా చివరికి ఇంటరాగేషన్ చెయ్యాలన్నా వణికే సీతారామయ్య( రాజేంద్ర ప్రసాద్) అంతా జులాయిలే ఒక విధంగా చూస్తే... జీవితం హై వే.. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటూ సూటిగా పోవాలి. షార్ట్ కట్స్ కోసం చూసామా గెలుపు కి నోవే.. ఈ రోజుల్లో చాలామంది ఎవడి మీద వాలిపోదామా అని చూసే వాళ్ళే... స్నేహితులు కష్టపడి సహాయం చేస్తే లేదా తల్లిదండ్రులు సంపాదిస్తే, లేదా అత్తామామ ఇచ్చే కట్నం మీదో , బెట్టింగ్ మీదో, బెదిరీంచడం మీద ఆదారపడో పైకెదిగిపోదామని ఆలోచించడం ఆపాలి.... రెండు మూడు గంటల్లో లక్షలు సంపాదించాలనుకుంటే ప్రాబెమ్స్ తప్పవు..
2. ఆలోచనల్లోనూ, పిల్లలకు చెప్పే పాఠాల్లోనూ రిచ్ నెస్ ఉండాలిః
ఈ సినిమాలో హీరో మొదటి సీన్ లో జీవితం లో లాజిక్ గా ఆలోచించడం , ఉన్నతం గా ఆలోచించడం స్కూల్ స్థాయి లోనే పిల్లలకు నేర్పించాలంటారు త్రివిక్రం. ఏభై కేజీ ల మనిషి కోటి రుపాయల BMW కారులో సిగ్నల్ దగ్గర ఎదురుచూస్తే...... ఇలాంటి విషయాలు చెప్పి థాట్స్ లో రిచ్ నెస్ నేర్పించండంటాడు. లాజిక్ లేకుండా బట్టీ పట్టి నేర్చుకోవడం వలన సరియైన ఉద్యోగం దొరక్క " సాఫ్టవేర్ లో ఖాళీ లేదు, హార్డ్ వేర్ లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్ లో రౌడీలెక్కువ, కనస్ట్రక్షన్ జీతాలు తక్కువని బాధపడాల్సి వచ్చి నిజంగా జులాయి గా హైదరాబాద్ లో అమీర్ పేట లో స్కిల్స్ ఇంప్రూవ్ మెంట్ కోర్సులు చేస్తూ కాలం గడపాల్సి వస్తుంది.
3. లైఫ్ లో ఎప్పుడూ ఏం చెయ్యాలి అని అవతలివారిని అడగకు . నీ కంటూ క్లారిటీ ఉండాలి:
తమజీవితం లో ఏం చెయ్యాలో, ఏం కావాలని అనుకుంటున్నారో చాలా మందికి సరియైన అవగాహన ఉండదు. ఇతరుల సలహాల మీద సూచనలమీద అధారపడుతూ జీవితం ఎలగో ఒకలాగ బ్రతికేస్తుంటారు. ఒంటరిగా కనీసం తనకు కావల్సిన బట్టలు కూడా ఎంచుకోలేని పరిస్థితి. ముఖ్యం గా తమ లక్ష్యం ఏమిటో దానికి కావల్సిన నైపుణ్యాలేమిటో , వాటిని ఎలా పెంపొందించుకోవాలనే కనీస అవగాహన ఉన్నవాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. ఇతరుల నుండి సలహాలు తీసుకోవచ్చేమో గాని నిర్ణయం మాత్రం మనదై ఉండాలి. పదే పదే ఇతరుల మీద అలవాటు పడటం వ్యక్తిత్వ లేమి కి నిదర్శనం. ట్రావెల్ మూర్తి (బ్రహ్మాజీ) కన్ ఫ్యూజన్ లో బిట్టూ ( సోనూ సూద్ ) ని అడిగినా.. ఇదే పరిస్థితి చాలా మంది యువకులకూ ఎప్పూడూ కొనసాగుతూనే ఉంటుంది. క్లారిటీ లేని వాడు జులాయీ లా మిగలడానికి అవకాశం ఉంటుంది
4.
( ఇంకాఉంది....)