"Parents who know their children's
teachers and help with the homework
and teach their kids right from wrong --
these parents can make all the difference." -- U.S. Ex President Bill Clinton
ఈ రోజుల్లో చాలా మంది పిల్లల్ని తరుచూ ఒక్ స్కూలు నుండి మరొక స్కూలు మార్చడమే కాకుండా ఇంచుమించు ఏ స్కూలు పట్ల సరియైన సంత్రుప్తి కలిగి ఉండటం లేదు. స్కూలు ని లేదా ఉపాధ్యాయుల్ని నిందించే ముందు అసలు తల్లిదండ్రులుగా మన భాధ్యతలను ఎంత వరకు నెరవెరుస్తున్నామో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికన్ మాజీ అధ్యక్షుడు తల్లిదండ్రుల భాధ్యత గురించి చాలా వివరంగా చెప్పాడు ఏ తల్లిదండ్రులైతే వారి పిల్లల టీచర్లను తెలుసుకొని యుండి, పిల్లల హోమ్ వర్క్ లో సహయం చేస్తూ వరికి మంచి చెడ్డల గురించి బోధిస్తూ ఉంటారో వారు పిల్లల్లో చాలా మార్పు తేగలుగుతారని.
ప్రతీ తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకొందాం.
* పిల్లలు చదువుతున్నప్పుడు మీరు కూడా మీకు నచ్చిన నవలకాని, మ్యాగ్ జైన్ గాని లేదా న్యూస్ పేపర్ గాని తీసి చదవండి. వారు చదవడానికి ఆహ్లదకరమైన పరిస్థితులు ఉండేటట్టుగా చూడండి. ఆ సమయంలో మీరు టీ.వీ చూడటం లేదా ఇతర అంశాలు చర్చించడం వలన వారి ఏకాగ్రతను మనమే పాడు చేస్తుంటామని గ్రహించండి.
* పిల్లలు టీవీ చూసే సమయం నియంత్రించండి. పిల్లలు టీ వీ చూడకుండా నియంత్రించడం ప్రతీ తల్లిదండ్రులకు కత్తి మీద సామే. ఏ కార్యక్రమాలు చూడాలి? ఎంత సేపు చూడాలి? వారితో చర్చించి ఒక సమయం కేటాయించుకునేటట్టుగా ఒప్పందానికి రండి. కొన్ని కార్యక్రమాలు వారితో కలిసి చూడటం చేయాలి. పూర్తిగా కేబుల్ కనెక్షన్ తీసివేయడం అర్థరాహిత్యం.
*హోమ్ వర్క్ ఏ సమయంలో చేయాలో సమయాన్ని ముందుగా నిర్దేశించుకోండి. వారి స్కూల్ డైరీ తీసి ఏ అంశాలు హోమ్ వర్క్ గా ఇచ్చారో చూడటం ప్రతీ తల్లి లేదా తండ్రి కనీస భాధ్యత దానికి పావుగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. మనం బిజీ అని లేదా ఈకాలం చదువులు నాకు అవగాహన లేదని తప్పించుకోడానికి ప్రయత్నిస్తాం. ప్రతీ రోజు స్కూల్ డైరీ చూడటం వలన్ స్కూల్ లో ఏం జరుగుతుందో తెలియడమే కాకుండా వారి ఉపాధ్యాయులతో నిర్మాణాత్మకం గా చర్చించడానికి అవకాశం ఉంటుంది.
*పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. వారి సమ వయస్కులతో వారు ఎదుర్కోనే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో చర్చీచాలి. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వారి స్నేహితులెవరో వారు ఎవరితో పోటీ పడుతున్నారో మనకు తెలిసి ఉండాలి.
* మీరు పిల్లల్నుండి ఏమీ ఆశిస్తున్నారో వారికి చెబుతూ ఉండండి. బ్రయాన్ ట్రైసీ అనే రచయిత లా ఆఫ్ ఎక్స్ పెక్టేషన్స్ అని మన అంచనాలుకు తగ్గట్టుగా పిల్లలు నిలవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారని చెబుతాడు. అయితే ఆ అంచనాలు ఆచరణ సాధ్యమైనవిగా చూడండి. లేకపోతే వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
* స్కూలు ని తరచూ సందర్శించండిః మన పిల్లలు చదువుతున్న స్కూల్ కి తరుచూ వెళ్తూ వారు ఏ సమయం మనకి కేటాయించారో ఆ సమయంలో ఉపాధ్యాయులతో పిల్లల గురించి చర్చించాలి. స్కూల్ ప్రమణాలలో తేడా లేదా లోపాలు ఉంటే ప్రిన్సిపాల్ ధృష్టికి తీసుకురావాలి.
అంతే తప్ప ఎవరో చెప్పిన మాటల బట్టి లేదా పేపర్లలో ప్రకటనల బట్టి అంచనా వేయవద్దు.
* స్కూల్ యాజమాన్యంతో సహకరించండి. ఫీజులు సకాలంలో చెల్లించడం ఒకవేళ ఏదైనా కారణం చేత ఆలస్యమైతే ముందుగా స్కూల్ వారికి చెప్పి అనుమతి తీసుకోవడం తల్లిదండ్రులుగా మన విధి. స్కూల్ ఫీజు గురించి మన పిల్లల్ని వారు అందరిలో అడగటం, నోటీస్ బోర్డులో పేర్లు ఉంచడం పిల్లల మానసిక స్థాయి మీద చాలా ప్రభావం చూపుతొందని మరువ వద్దు. మేము అలా కాదండి అని బాధ పడాల్సిన పనేమీ లేదు ఏ కార్పోరేట్ స్కూల్ అయినా అతి సాధారణ స్కూల్ అయినా ఎదుర్కొంటున్న అతి సాధారణ్ సమస్య ఫీజులు వసూలు కాకపోవడం.
మన పిల్లల చదువు భాధ్యత కేవలం ఒక్క స్కూల్ ది మాత్రమే కాదు. ఇది ఉమ్మడి భాధ్యత. పువ్వు పుట్ట గానే పరిమళిస్తుంది. ఏకలవ్యుడికి ఎవరు నేర్పారనే మెట్ట వేదాంతం మాని మన ప్రయత్నం మనం మొదలు పెడదాం.
థాంక్యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com