Saturday, 16 January 2016

"నాన్నకు ప్రేమతో"


సంక్రాంతి పండుగ అయిపోయిందా...   లేదు అది అప్పుడే అవదు.  "నాన్నకు ప్రేమతో"  సినిమా చూసారా  చూడలేదా?  థియేటర్ లో ఆ సినిమా  చూడకుండా సంక్రాంతి సెలవలు ఆనందించం అని మీరు అనుకుంటే...... అది ఉట్టిదే......
ఈ సినిమా ఎలా ఉండి? ఈ సినిమా లో గొప్ప విషయాలు  ఇవి   అని చెప్పడానికి  నేను ఇది రాయటం లేదు.  ఈ సినిమా చూస్తూ కలిగిన ఆనందం వ్యక్తపర్చకుండా  ఆ ఎమోషన్  ని నాలోనే దాచేసుకుంటే  సుకుమార్ చెప్పిన విషయాల్ని నేను పాటించనట్టే కదా......  ఏ ఎమోషన్  అయినా వ్యక్తపరచాలి. అబ్రహం మాస్లో  చెప్పిన  Hierarchy of Human Needs  థియరీ  చెప్పడం తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.
  తెలుగుప్రేక్షకుల స్థాయిని పెంచే రీతిలో ...తెలుగు ప్రేక్షకుల  స్థాయిని  అర్థం చేసుకున్న  స్థితి లో తీసిన సినిమా ఇది.  అసలు ఈ సినిమా  ఇంకా ముందే చూడాల్సి ఉంది..   అనవసరమైన  హైరానా తో  నెగటివ్ టాక్ ఎందుకు తీసుకొచ్చారో   నాకైతే అర్థం కాలేదు.
 ఈ సినిమా గురించి ఎవడి అభిప్రాయం వినొద్దు.  ఆఖరికి  నా అభిప్రాయం కూడా...ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే   ఒక కుహనా మేథావి ( అసలు వీడికి  ఇదే పని) సైన్స్ పాఠం లా ఉందే.. అంటూ  థియేటర్ నుండే  ఎఫ్. బి. లో పెట్టడం మొదలుపెట్టాడు.  అంటే అసలు వెళ్ళడమే లోపాలు వెతకడానికి వెళ్లినట్టు ఉన్నాడు.  ఒక సోషియో ఫేంటసీ సినిమాని  హర్షించేటపుడు  ఈ సినిమా లో లాజిక్ లు వెతకడం ఏమిటి?
అసలు సినిమాని విశ్లేషించి  ఇలా ఉంటె బాగుణ్ణు  అలా తీయాల్సి ఉంది అంటూ వివరణలివ్వడం వలన ఉపయోగం ఉందా.........
దయచేసి  సినిమాని ఆనందించే అద్భుతమైన  గుణం,   అధ్బుతమైన సెల్యూలాయిడ్ వర్ణచిత్రాలను ఆహ్లాదించే  రసస్పూర్తి మీలో ఉంటె ,  మన తెలుగువాడు   ఒక వినూత్న ప్రయోగాత్మక, ఆలోచింపచేసే  సినిమాని   భారీ బడ్జెట్  లో  తీసిన ధైర్యాన్ని ప్రశంసించే  స్పందించే మనసు మీకు ఉంటె...  వెంటనే ఈ సినిమాని చూడండి..  ఆనందించండి...  ఇందులో సీన్లు, డైలాగ్ లు  ప్లస్ పాయింట్స్  మైనస్ పాయింట్స్  నేను ఇక్కడ రాస్తే  మీ  ఆలోచన్ స్థాయిని, సినిమాని అర్థంచేసుకోగల  స్థాయిని నేను అవమానపరిచినట్టే......
ఇది బాగో లేదు అంటూ  కొంతమంది చేసిన నెగటివ్ ప్రచారంలో పడి  రెండురోజులు ఆలస్యంగా ఈ సినిమా చూసిన తప్పును  మీరు చేయకండి....    అయ్యో ఈ సినిమా బాగోలేదట  అంటూ తప్పుచేసాను అన్న   నెగటివ్ ఎమోషన్ కి   సుకుమార్ కి సారీ   చెబుతూ..........ఇందులో నేర్చుకోవలసిన  విషయాలు, మేనేజ్ మెంట్ విషయాలు   ఈ సినిమా ఏభై రోజుల ఫంక్షన్ కి మరో బ్లాగ్ లో రాస్తానని తెలియచేస్తూ.....
తెలుగు ప్రేక్షకులు ఎ  బి  సి    అంటూ ఉండరని రుజువు చేయడానికి   వీలైనంత  త్వరలో   చూడండి......  
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com

No comments:

Post a Comment