పిల్లల్లో డబ్బులు గాని విలువైన వస్తువులు గాని తస్కరించే స్వభావాన్ని సైకాలజీ లొ క్లేప్తోమేనియా ( KLEPTOMANIA) అంటారు. ఈ రోజుల్లో స్కూలు కు ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు తీసుకురావడం మిగిలిన స్నేహితులతో వాటిని ఖర్చు పెట్టడం అతి సాధారణం అయిపోతుంది. ఒకరినుండి ఒకరు నేర్చుకుని ఈ జాడ్యం
మిగిలిన వారికీ ప్రాకే అవకాశం ఉంటుంది.
ఈ ధోరణికి గల కారణాలు ఏమిటని విశ్లేషిస్తే ..........
కొంతమంది పిల్లలకు చిన్నప్పటినుండి మిగిలిన స్నేహితుల పుస్తకాలు గాని, ఇతర వస్తువులు గాని వారి మీద కోపం వలన గానిలేదా వారు అవి పోగొట్టుకుని ఇబ్బంది పడుతుంటే ఆనందించడానికి దొంగతనం చేసే అలవాటు మొదలవుతుంది. వాటిని సకాలం లొ గుర్తించి అరి కట్టకపోతే , అలా వారు విలువైన వస్తువులు లేదాతల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు తీయడం జరుగుతుంది. ఎవరూ గుర్తించకపోవడం తో, తప్పని నచ్చ చెప్పకపోవడం తో అది ఒక అలవాటు అవుతుంది.
సాధారణం గా చదువులో వెనుక బడే పిల్లలు మిగిలిన పిల్లల వద్ద గొప్పగా ఉండాలనే భావనతో ఇంట్లో నుండి డబ్బులు తీసుకొచ్చి వారి స్నేహితులకు చిరుతిళ్ళు కోసం లేదా హోటల్ కు తీసుకు వెళ్లి పార్టీ ఇవ్వడం చేస్తుంటారు. అందరి లొ గొప్ప గా ఉండాలనే తపన మిగిలిన స్నేహితుల ముందు అజమాయిషీ చెల్లించాలనే కొరికి ఈ విపరీతధోరణికి కారణాలు. వారు తాము ఇంటి లొ ఎ సమయం లొ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకువస్తున్నారో మిగిలిన వారికి చెప్పి వారిని కూడా ఇటువంటి పనులకు ప్రేరేపిస్తుంటారు. ఇంట్లో కూడా డబ్బులు పిల్లలకు అందుబాటు లొ ఉంచడం లెక్క సరిగా చూసుకోకపోవడం వీరిని గుర్తించడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్న తర్వాత తల్లిదండ్రులు కనులు తెరుచుకుంటారు. పాఠశాల స్థాయిలో వీటిని నిరోధించకా పొతే పెద్దయ్యాక చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు
ప్రయత్నించే ప్రమాదం ఉంది.
తల్లిదండ్రుల పాత్ర:
- ఇంట్లో పిల్లల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చడమే కాకుండా, పిల్లలలొ కనబడే విపరీత ధోరణులను పరిశీలిస్తూ ఉండాలి.
- పిల్లలవద్ద ఖరీదైన వస్తువులు గాని తాము కొన్ని వస్తువులు గాని కనబడితే అవి ఎలా వచ్చాయో విచారాన్ చేస్తుడాలి.
- ఇంట్లో ఎంత డబ్బు ఉంది, ఎప్పటికప్పుడు సరి చూసుకున్తున్డాలి. ఒకవేళ తేడా వస్తే సరిగా ఆరా తీతాలి.
- పిల్లలకు అందుబాటు లొ డబ్బులు ఉంచరాదు.
- పిల్లలకు డబ్బు పొడుపు చేసే అవగాహన కల్పిస్తూ వారి కిడ్డీ బ్యాంక్ లొ ఎంత జమా అయినదీ, దేనికి ఖర్చు అయినది తెలుసుకుంటుండాలి.
- పిల్లల గదులను, బ్యాగ్ లను అప్పుడప్పుడు వారికి తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని పరిసీలిస్తుండాలి.
- స్కూల్ నుండి సమయానికి వస్తున్నారా, మధ్యలో చిరుతిళ్ళ కోసం గాని మరి ఇతర వ్యాపకం కోసం ఇంటికి రావడం ఆలస్యమవుతున్నారా అని పరిశీలిన చేస్తుండాలి.
- ఉపాధ్యాయులను తరుచూ కలుస్తూ వారి ప్రవర్తనకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే, తేలిక గా తీసుకోకుండా పరిశీలించాలి.
మొక్కి ఒంగనిది మాని ఒంగునా అన్నట్టు పిల్లల ప్రవర్తనలో లోపాలు ఆదిలోనే తొలగిస్తే తర్వాత బాధ పడాల్సిన అవసరం రాదు. తల్లిదండ్రులుగా మన భాద్యత ను
సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment