సినిమాని లాజికల్ గా ఆలోచిస్తూ చూడాలా?????
సినిమా అనేది మనల్ని ఒక ఊహా లోకం లో ఉంచుతూ కొన్ని వాస్తవాల్ని కొన్ని అభూత కల్పనల్ని మేళవించి ఆనందాన్ని, వినోదాన్ని, కొన్నిసార్లు విజ్ఞనాన్ని అందిస్తుంది. వాస్తవానికి బయట ప్రపంచంలో ఎవరూ పాటలు ఫాడుకుంటూ నృత్యాలు చేయరు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. అన్నీ లాజికల్ గా ఉండాలంటే కుదరదు. మన కలలబేహారులు సినిమాలు నిర్మించేవారు. అవతార్ సినిమాలో లాంటి మానవరూపమో జంతురూపమో తెలియని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తుంటే ఆహో ఓహో అంటూ ఎగబడీ చూస్తాం. హాలీవుడ్ సినిమల్లో లాజిక్ లు, అవాస్తవాలు వెతకం. ఎందుకంటే వాటిని ఆనందిచిండానికే ప్రాధాన్యత ఇస్తాం, విమర్శించటానికి మాత్రం కాదు. మిష్టర్ ఇండియా సినిమాలో అనీల్ కపూర్ వాచీ చేసిన విన్యాసాలు కుర్చీనుండి దొర్లిపడీ మరీ ఆనందిచాం. సోషియా ఫాంటసీ, సైంటిఫిక్ ఫాంటసీ అంటూ తరువాత తమాయించుకుంటాం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయిన మొదటి వారం రోజులు పిచ్చిముదిరి ఇలాంటి సినిమా తీసారని విమర్శకులు నాలుకలకి పనిచెప్పారు. కాని పటిస్టమైన స్క్రీన్ ప్లే. చిరంజీవి ఈజ్ తో చేసిన నటన, శ్రీదేవి అందచందాలముందు అంతా ఔరా అని ఇదొక నూతన ప్రయోగం అని సర్టిఫికేట్ ఇచ్చారు.
2001 లో తీసిన అ బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమా నోబుల్ బహుమానం పొందిన గణిత శాస్త్రజ్ఞుడు జాన్ ఫోర్బ్స్ నాష్ జీవిత ఆధారంగా వచ్చిన సినిమా నాలుగు ఆస్కార్ అవార్డ్స్ పొందటమే కాకుండా మరో నాలుగు అంశాలలో ఆస్కార్ నామినేషన్ కూడా పొందింది. దీట్లో హీరో కి కనబడేవారు ఇతరులకి కనబడరు. అమెరికా గూడచారి సంస్థ తనకు అతి ముఖ్యమైన పని అప్పచెప్పారని భావిస్తుంటాడు. తనకు కనబడే పాత్రలు ఎవరికీ కనబడవు. స్కీజోఫేనియా అనే వ్యాధి తో ముడిపడిన ఇతని పాత్ర అందరికీ విస్మయం కలిగిస్తుంటుంది
ఇంచుమించు ఈ సినిమా ప్రేరణ తో తీసిన వన్ నేనొక్కడినే రోటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంది. ఈ సినిమా మీద భారీ అంచనాలుండటం, వన్ నేనొక్కడినే అని టైటిల్ పెట్టడం తో ఇతర అభిమానుల మధ్య అనవసర పోటీ లాంటి ఆలోచనలు కలిగించడం తో ఈ సినిమా మొదటి రోజు చాలా భయంకరమైన టాక్ వచ్చింది. మేం తీసుకున్న టికెట్ లలో ఒకటి ఎక్కువ అవడంతో దానిని వదిలించుకోడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఎవరు ఏమనుకున్నా విభిన్నతలను, ప్రయోగాలను మెచ్చుకునే సహృదయత, కళాభిమానం ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రతీ సీన్ లో రిచ్ నెస్, చివరి వరకు స్టోరీ లో జతచేయబడుతున్న అంశాలు ప్రేక్షకుడ్ని ఆలోచింపచేస్తుంది. దర్శకుడి శ్రమ, తల్లిదండ్రులగురించి మహేష్ బాబు పడే వేదన మంచి సెంటిమెంట్ పండిస్తుంది. ఒక్కసారి లాజిక్కులకు పోకుండా అర్థం చేసుకోదానికి ప్రయత్నిస్తూ చూడండి. పక్కవాడు ఫాలో అవుతున్నాడో, అర్థం కాక హేళన చేస్తున్నాడో పట్టించుకోకుండా ప్రతీ క్షణాన్ని, ప్రతీ సీన్ ని అనందించండి. కొంత నిడివి తగ్గించబోతున్నారు కాబట్టి ఈ సినిమా మరో వారం రోజుల్లో నెమ్మదిగా మంచిటాక్ వస్తుంది. మహేష్ బాబు నటన అందరికీ నచ్చుతుంది. అవసరం లేని రెండుపాటలు కూడా తీసేస్తే ఇంకా మంచిది. ప్రయోగాలు చేసే టప్పుడు మసాలా ఫార్ములా ల గురించి ఆలోచించకూడదు. ఇదే ఏ హిందీ సినిమా కాని ఇంగ్లీష్ సినిమా కాని అయివుంటే తెగ సంబరపడిపోతూ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు చాలామంది .

మంచి పాయింట్ వ్రాశారు.
ReplyDeleteనిన్ననే మా కొలీగ్ ఒకాయన ఈ సినిమా "పేలిపోయింది" అని కామెంటుతుంటె, నేను చెప్పాను, ఐతే మనం తప్పకుండా చూడవలిసిని సినిమా అని. కొంతకాలం క్రితం మన బ్లాగుల్లో "లవ్ ఫైల్యూర్" అనే సినిమా మీద కొంత హడావిడి జరిగింది. విమర్శ ఎంతసేపూ ఆ సినిమాలో హీరోయిన్ జుట్టు సరిగ్గా దువ్వుకోలేదు, మొహానికి పౌడర్ రాసుకోలేదు చుట్టూనే తిరిగింది. పాత్ర బట్టి నటుడి నటన, వేషధారణ ఉండాలి అన్న ప్రాధమిక విషయం మర్చిపోయిన ప్రేక్షకులు ఎక్కువ. మనకు పాత్ర ఏదైనా సరే నటుడు, వాడి "పొగరు" బాగా కనపడాలి, వాడి పక్కన "స్నేహితులు" పేరిట 40+ లేకి బాచ్ కామెడీ పేరిట చేసే వెర్రి మొర్రి చేష్టలు, అంతే సినిమాకు అంతకంటే మరేదీ అక్కర్లేదు కదా! అప్పుడే అది "సినిమా" అని నమ్మకం చాలామందికి. పాత్రలో నటుడు ఇమడాలా, నటుడిని బట్టి పాత్ర ఏదైనా సరే ఆ పాత్ర గుణగణాలు, నడవడిక, డైలాగ్ డెలివరి మార్చెయ్యాలా అన్న విషయంలో రెండోదానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షక "మూకలు" ఉన్నంత కాలం మంచి సినిమాలు రావటం దుర్లభం, అధవా వచ్చినా అవి విజయవంతం కావటం అసాధ్యం. విజయవంతం ఐనంత మాత్రాన ఘొప్ప సినిమాలు అయి తీరాలని లేదు, సరిగ్గా కలెక్షన్లు సంపాయించలేదు కాబట్టి అదేదో మంచి సినిమా కాదనటానికీ వీల్లేదు. సినిమాలకు విడుదల చెయ్యటానికి హాళ్ళు కూడా దొరకనీయని సంస్కృతి వచ్చి, "ఫలానా" వారి సినిమాలు ఐతేనే వెంటనే విడుదల లేకపోతే లేదు అనే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన సినిమా ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కనీసం విడుదలకు నోచుకున్నది. చిన్న నిర్మాతలు మంచి సినిమా తీస్తే విడుదల చేసుకోవటానికి సినిమా తీసిన దానికంటే ఎక్కువ కష్టపడాల్సిన రోజులు కదా ఇవ్వి.